జింఖానా ‘తొక్కిసలాట’.. మహిళను కాపాడేందుకు ఆ లేడీ కానిస్టేబుల్‌ ఏం చేసిందంటే? | Lady Constable Performed CPR And Saved Woman Life At Gymkhana Ground | Sakshi
Sakshi News home page

జింఖానా ‘తొక్కిసలాట’.. మహిళను కాపాడేందుకు ఆ లేడీ కానిస్టేబుల్‌ ఏం చేసిందంటే?

Published Thu, Sep 22 2022 5:13 PM | Last Updated on Thu, Sep 22 2022 5:33 PM

Lady Constable Performed CPR And Saved Woman Life At Gymkhana Ground - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సికింద్రాబాద్‌ జింఖానా గ్రౌండ్‌ వద్ద ఉదయం ఆసీస్‌-భారత్‌ మ్యాచ్‌ టిక్కెట్ల కోసం జరిగిన తొక్కిసలాట ఘటనలో ఓ లేడీ కానిస్టేబుల్‌ చాకచక్యంగా వ్యవహరించింది. ప్రాణాపాయంలో ఉన్న మహిళకు వెంటనే సీపీఆర్‌ చేసి ఆ ప్రాణాన్ని నిలబెట్టింది. టిక్కెట్ల కోసం ఒక్కసారిగా అభిమానులు తోసుకుని రావడంతో అందులో 45 ఏళ్ల మహిళ పూర్తిగా స్పృహ తప్పి పడిపోయారు.
చదవండి: హెచ్‌సీఏపై సమీక్ష.. కఠినచర్యలు తప్పవ్‌..! మంత్రి షాకింగ్‌ కామెంట్స్‌

దీంతో బేగంపేట మహిళా పీఎస్‌లో పనిచేస్తున్న కానిస్టేబుల్‌ నవీన తక్షణమే స్పందించి ఆ మహిళను బయటకులాగారు. అప్పటికే ఆమె స్పృహ కోల్పోయి ఊపిరి అందని పరిస్థితిలో ఉండటంతో ఆ కానిస్టేబుల్‌ సీపీఆర్‌ చేశారు. మహిళను కాపాడిన కానిస్టేబుల్‌పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సందర్భంగా కానిస్టేబుల్‌ నవీన సాక్షితో మాట్లాడుతూ, సాటి మహిళను కాపాడాలని ఆలోచించానని తెలిపారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement