lady constable
-
కామారెడ్డి పోలీసుల కేసులో విచారణ వేగవంతం
-
కామారెడ్డి జిల్లా అడ్లూర్ ఎల్లారెడ్డిలో విషాదం
-
కారుతో ఢీకొట్టి.. వేట కొడవలితో నరికి
ఇబ్రహీంపట్నం: కులాంతర వివాహం చేసుకుని తమ పరువు తీసిందని, అక్కపై కక్ష పెంచుకున్న తమ్ముడు ఆమెను అతి కిరాతకంగా హతమార్చాడు. స్కూటీపై వెళుతున్న ఆమెను కారుతో ఢీకొట్టాడు. కిందపడిపోయిన ఆమె మెడ, చెంప భాగంలో వేట కొడవలితో దాడి చేశాడు. రక్తపు మడుగులో విలవిల్లాడిన ఆ మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీం పట్నం మండలం రాయపోల్ గ్రామ సమీపంలో సోమవారం ఉదయం ఈ దారుణం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా.. రాయపోల్‌కు చెందిన కొంగర నాగమణి (27) హయత్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తోంది. ఏడేళ్ల క్రితమే ఈమెకు వివాహం జరగగా, కొద్దిరోజులకే భర్త నుంచి విడాకులు తీసుకుంది. అనంతరం ఇదే గ్రామానికి చెందిన బండారి శ్రీకాంత్‌ను ప్రేమించి గత నెల 10న యాదగిరిగుట్టలో కులాంతర వివాహం చేసుకుంది. ముందుజాగ్రత్తగా తమకు రక్షణ కల్పించాలని ఇబ్రహీంపట్నం పోలీసులను ఆశ్రయించింది. దీంతో వారు ఇరు కుటుంబాలను పిలిపించి నచ్చజెప్పారు. అనంతరం దంపతులు మన్సురాబాద్‌లో కాపురం పెట్టారు. అయితే తక్కువ కులానికి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకుని, ఊరిలో తమ కుటుంబ పరువు తీసిందని నాగమణిపై కక్ష పెంచుకున్న ఆమె తమ్ముడు పరమేశ్ అవకాశం కోసం ఎదురు చూడటం ప్రారంభించాడు. విధులకు వెళ్తుండగా.. తన తల్లిదండ్రులు హంసమ్మ, సత్తయ్యను చూసేందుకు శ్రీకాంత్ రెండురోజుల క్రితం భార్య నాగమణితో కలిసి రాయపోల్ వచ్చాడు. సోమవారం ఉదయం హయత్‌నగర్ పీఎస్‌లో విధులకు హాజరయ్యేందుకు నాగమణి ఒక్కరే స్కూటీపై బయలుదేరారు. ఊరు దాటగానే అప్పటికే దారికాచిన పరమేశ్ కారులో వెంబడించాడు. మన్నెగూడ సబ్ స్టేషన్ జంక్షన్ వద్ద స్కూటీని కారుతో వేగంగా ఢీకొట్టి, కిందపడిన ఆమెపై దాడి చేసి చంపేశాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. సమాచారం అందుకున్న సీఐ సత్యనారాయణ సంఘటన స్థలానికి చేరుకుని క్లూస్ టీంతో ఆధారాలు సేకరించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. పరమేశ్ వెంటాడుతున్నాడని చెప్పింది నాగమణి, తాను ఎనిమిదేళ్లుగా ప్రేమించుకుంటున్నామని, ఆమెకు తల్లిదండ్రులు లేకపోవడంతో నాలుగేళ్లు హాస్టల్లో ఉండి చదువుకుందని, ఆ సమయంలో అన్నీ తానై చూసుకున్నానని శ్రీకాంత్ తెలిపారు. యాదగిరిగుట్టలో తమ వివాహం జరిగిందని, నాగమణి పేరున ఉన్న ఎకరా భూమి తమకు వద్దని చెప్పామని కన్నీటి పర్యంతమయ్యారు. అయినా కనికరం లేకుండా అక్కను చంపాడని రోదించారు. పరమేశ్ తనను వెంటాడుతున్నాడని నాగమణి ఫోన్ చేసి చెప్పిందని, వెంటనే తన సోదరుడిని పంపించినా అప్పటికే దారుణం జరిగిపోయిందని వాపోయారు. మా కుమారుడికి ప్రాణహాని ఉంది సొంత అక్కనే చంపిన పరమేశ్‌తో తమ కుమారుకు శ్రీకాంత్‌కు ప్రాణహాని ఉందని హంసమ్మ, సత్తయ్య ఆందోళన వ్యక్తం చేశారు. శ్రీకాంత్‌ను కూడా పరమేశ్ చంపేస్తాడంటూ రోదించారు. అతనికి ఉరి శిక్ష వేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు పోలీస్‌స్టేషన్ ఎదుట బంధువులతో కలిసి ఆందోళన నిర్వహించారు. సీపీఎం నేతలు వీరికి మద్దతు తెలిపారు. కాగా పరారీలో ఉన్న పరమేశ్‌ను పట్టుకునేందుకు మూడు బృందాలను ఏర్పాటు చేసి గాలిస్తున్నామని సీఐ సత్యనారాయణ తెలిపారు. స్కూటీని ఢీ కొట్టినప్పుడు కారు నంబర్ ప్లేట్ ఘటనా స్థలంలో పడిపోయిందని, హత్యకు వాడిన కత్తి (వేట కొడవలి)తో పాటు నంబర్ ప్లేట్‌ను స్వా«దీనం చేసుకున్నామని తెలిపారు. కులాంతర వివాహం, ఆస్తి వ్యవహారాలే హత్యకు ప్రధాన కారణాలుగా భావిస్తున్నామని సీఐ స్పష్టం చేశారు. అయితే నాగమణిని హత్య చేసిన తర్వాత పరమేశ్ నేరుగా వచ్చి పోలీస్ స్టేషన్లో లొంగిపోయినట్లు తెలుస్తోంది. పోలీసులు మాత్రం పరారీలో ఉన్నాడని చెబుతుండటం గమనార్హం. -
కానిస్టేబుల్ ఆత్మహత్య.. శరీరంపై గాయాలు.. ఏం జరిగింది?
లక్నో: ఓ మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకుంది. అయితే, ఆమె మృతదేహంపై 500కుపైగా గాయాల గుర్తులు కనిపించడం కలకలం రేపింది. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. ఆమె మరణంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. వివరాల ప్రకారం.. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఉన్నావ్‌లో పోలీస్ లైన్‌లోని వసతిగృహంలో నివాసం ఉంటున్న మీను అనే మహిళా కానిస్టేబుల్.. గురువారం తన గదిలోని ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేసింది. అది గమనించిన కుటుంబ సభ్యులు, స్థానికులు వెంటనే అప్రమత్తమై ఆమెను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో ప్రాణాలు కోల్పోయింది. అనంతరం ఆమె మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. కాగా, పోస్టుమార్టం నివేదికలో మహిళా కానిస్టేబుల్ ఉరివేసుకుని చనిపోయిందని, మృతదేహాంపై 500కుపైగా గాయాల గుర్తులు ఉన్నట్లు వెల్లడైంది. అలీగఢ్‌కు చెందిన ఓ కానిస్టేబుల్‌తో మీను ప్రేమలో ఉన్నట్లు స్థానికులు చెప్పారు. అతడు మీనును మోసం చేసి వేరే మహిళను పెళ్లి చేసుకున్నాడని.. బాధితురాలు ఎన్నిసార్లు ఫోన్‌చేసినా సమాధానం ఇవ్వలేదని తెలుస్తోంది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన మీను.. తననుతాను గాయపరుచుకుని ఆత్మహత్య చేసుకుని ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. -
చచ్చిపోదామని పట్టాలపై ..ఇంతలో వచ్చింది దేవత ! వైరల్ వీడియో
న్యూఢిల్లీ: జీవితంలో ఆశను కోల్పోవద్దు అని ఎంత చెప్పినా తృణప్రాయంగా ప్రాణాల్ని త్యజిస్తున్న వారి సంఖ్య మాత్రం తగ్గడం లేదు. చివరికి ఆత్మహత్య చేసు కోవడం నేరం అని చెప్పినా కూడా చాలామంది సూసైడ్ చేసుకుంటూనే ఉన్నారు. కానీ ఆ ఒక్క క్షణం వారిని మృత్యు ముఖ్యం నుంచి తప్పించగలిగితే, సరియైన కౌన్సిలింగ్ ఇప్పించ గలిగితే జీవితం విలువ తెలిసి వస్తుందని చాలామంది మానసిక నిపుణులు చెబుతున్న మాట. అయితే తాజాగా చనిపోవాలని పట్టాలపై పడుకున్న వ్యక్తిని తృటిలో ప్రమాదంనుంచి తప్పించిన వైనం ఒకటి వైరల్‌గా మారింది. (తల్లి అకౌంట్నుంచి మొత్తం వాడేసిన చిన్నది: పేరెంట్స్ గుండె గుభిల్లు!) వెస్ట్ బెంగాల్‌లోని పూర్వా మేదినీపూర్ రైల్వే స్టేషన్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆర్పీఎఫ్ ఇండియా ట్విటర్ హ్యాండిల్ ఈ ఘటనకుసంబంధించినవీడియోను షేర్ చేసింది. దీని ప్రకారం రైలు కింద పడిచనిపోవాలనుకున్న యువకుడు చాలాసేపే అక్కడక్కడే తచ్చట్లాడాడు. చివరికి అతివేగంగా దూసుకు రానున్న రైలు కింద పడేలా పట్టాలపై పడుకున్నాడు. అయితే డ్యూటీలో ఉన్న లేడీ కానిస్టేబుల్ సుమతి ఈ విషయాన్ని గమనించారు. క్షణం కూడా ఆలస్యం చేయకుండా శరవేగంగా కదిలి అతగాడిని ట్రాక్‌పై నుండి లాగాపడేశారు. అంతే క్షణాల్లో అతడు యమపాశంనుంచి తప్పించుకున్నాడు. (రూ. 451 కోట్ల శ్లోకా మెహతా డైమండ్ నెక్లెస్: షాకింగ్ న్యూస్!) సుమతి నిర్భయంగా ముందుకు కదిలి ఆ వ్యక్తిని ప్రాణాలను కాపాడిన వైనంపై నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. కుడోస్ సుమతి మేడమ్ అంటూ అభినందిస్తున్నారు. అంతేకాదు ఆత్యహత్యా ప్రయత్నం చేసిన వ్యక్తికిపై కేసు నమోదు చేయకుండా, దయచేసి అతనికి సాయం చేయండి అంటూ అభ్యర్థిస్తున్నారు. ఈ వీడియో దాదాపు 264.6 వేల వ్యూస్, 7వేలకు పైగా లైక్స్, 232 రీట్వీట్లను సాధించింది. #RPF Lady Constable K Sumathi fearlessly pulled a person off the track, moments before a speeding train passes by at Purwa Medinipur railway station. Kudus to her commitment towards #passengersafety.#MissionJeevanRaksha #FearlessProtector pic.twitter.com/yEdrEb48Tg — RPF INDIA (@RPF_INDIA) June 8, 2023 -
జింఖానా ‘తొక్కిసలాట’.. మహిళను కాపాడేందుకు ఆ లేడీ కానిస్టేబుల్ ఏం చేసిందంటే?
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్ జింఖానా గ్రౌండ్ వద్ద ఉదయం ఆసీస్-భారత్ మ్యాచ్ టిక్కెట్ల కోసం జరిగిన తొక్కిసలాట ఘటనలో ఓ లేడీ కానిస్టేబుల్ చాకచక్యంగా వ్యవహరించింది. ప్రాణాపాయంలో ఉన్న మహిళకు వెంటనే సీపీఆర్ చేసి ఆ ప్రాణాన్ని నిలబెట్టింది. టిక్కెట్ల కోసం ఒక్కసారిగా అభిమానులు తోసుకుని రావడంతో అందులో 45 ఏళ్ల మహిళ పూర్తిగా స్పృహ తప్పి పడిపోయారు. చదవండి: హెచ్‌సీఏపై సమీక్ష.. కఠినచర్యలు తప్పవ్..! మంత్రి షాకింగ్ కామెంట్స్ దీంతో బేగంపేట మహిళా పీఎస్‌లో పనిచేస్తున్న కానిస్టేబుల్ నవీన తక్షణమే స్పందించి ఆ మహిళను బయటకులాగారు. అప్పటికే ఆమె స్పృహ కోల్పోయి ఊపిరి అందని పరిస్థితిలో ఉండటంతో ఆ కానిస్టేబుల్ సీపీఆర్ చేశారు. మహిళను కాపాడిన కానిస్టేబుల్‌పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సందర్భంగా కానిస్టేబుల్ నవీన సాక్షితో మాట్లాడుతూ, సాటి మహిళను కాపాడాలని ఆలోచించానని తెలిపారు. -
అప్పు కోసం బ్యాంకుకు వెళ్లిన మహిళా కానిస్టేబుల్‌కు షాక్.. పాన్ కార్డుపై అప్పటికే..
సాక్షి, హైదరాబాద్: రుణం కోసం బ్యాంకుకు వెళ్లిన ఓ మహిళా కానిస్టేబుల్‌కు విస్తుపోయే నిజం తెలిసింది. తన ప్రమేయం లేకుండా తన పేరుపై ఇతర రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తి లోను తీసుకున్న విషయాన్ని బ్యాంకు అధికారులు చెప్పడంతో.. షాక్‌కు గురై సిటీ సైబర్ క్రైం పోలీసుల్ని ఆశ్రయించింది. వివరాలు.. సిటీ సైబర్ క్రైం పోలీసు స్టేషన్లో విధులు నిర్వర్తి స్తున్న మహిళా కానిస్టేబుల్‌కు డబ్బులు అవస రం కావడంతో రుణం కోసం ఎస్బీఐకు వెళ్లింది. కానిస్టేబుల్ వివరాలు చెక్ చేసిన బ్యాంక్ అధికారులు ఆల్రెడీ మీ పేరుపై రూ.80 వేలు రుణం ఉన్నట్లు తెలిపారు. తన ప్రమేయం లేకుండా లోను ఎవరు తీసుకున్నారని ఆరాతీయగా.. తమిళనాడుకు చెందిన ఓ వ్యక్తి కానిస్టేబుల్ పాన్‌కార్డ్‌పై లోను తీసుకున్నట్లు తెలిసింది. దీంతో ఆమె సైబర్‌క్రైం పోలీసులకు ఫిర్యా దు చేయగా.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ మధు తెలిపారు. చదవండి: ఈ టిప్స్ పాటిస్తే.. మీ ఆధార్ కార్డు సేఫ్..లేదంటే? దొంగ చేతికి తాళం ఇచ్చినట్లే -
పురిటినొప్పులతో విలవిల్లాడిన మహిళ.. కానిస్టేబుల్ చేసిన పనికి ఫిదా..
లక్నో: ఒక మహిళా కానిస్టేబుల్ తన మానవత్వాన్ని చాటుకుంది. పురిటినొప్పులతో బాధపడుతున్న మహిళకు అండగా నిలిచి, తల్లిబిడ్డలను క్షేమంగా ఆసుపత్రికి చేర్చింది. ఈ అరుదైన సంఘటన ఉత్తర ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. వివరాలు.. జలాలాబాద్‌కు చెందిన 30 ఏళ్ల రేఖ తన భర్తతో కలిసి ఉంటుంది. కాగా, గర్భవతి అయినా రేఖ కొన్ని రోజులుగా పురిటినొప్పులతో బాధపడుతుంది. దీంతో ఆసుపత్రికి వెళ్లి చూయించుకోవాలనుకుంది. ఈ క్రమంలో తన తల్లితో కలిసి గత సోమవారం (జులై 26)న బస్సులో షాహజాన్‌పూర్‌కి బయలుదేరింది. బస్సులోని కుదుపుల కారణంగా ఆమెకు నొప్పులు ఎక్కువయ్యాయి. దీంతో బస్సును రోడ్డు పక్కన నిలిపివేసి.. అంబులెన్స్‌కు సమాచారం అందించారు. అయితే, ఆమెకు నొప్పులు మరీ ఎక్కువకావడంతో బాధను తాళలేక విలవిల్లాడింది. ఈ క్రమంలో బింటూ పుష్కర్ అనే మహిళ కానిస్టేబుల్ అదే బస్సులో ప్రయాణిస్తుంది. అంబూలెన్స్ మాత్రం సమయానికి రాకపోవడంతో ఆమె రేఖ, ఆమె తల్లి ఆందోళనకు లోనయ్యారు. దీంతో బింటూ పుష్కర్ వారిద్దరికి ధైర్యం చెప్పింది. అంతటితో ఆగకుండా, రేఖ తల్లితో కలిసి చీరను అడ్డుగా పెట్టి ఆమెకు సపర్యలు చేసింది. కాసేపటి తర్వాత రేఖకు ఒక బాలిక జన్మించింది. తల్లిబిడ్డలు ఇద్దరు క్షేమంగానే ఉన్నారు. ఈ క్రమంలో.. కాసేపటి తర్వాత అక్కడికి చేరుకున్న అంబూలెన్స్‌లో తల్లిబిడ్డలను దగ్గర్లోని ఒక మెడికల్ కాలేజీకి తరలించారు. ఇద్దరు కూడా ఆరోగ్యంగానే ఉన్నారని వైద్యులు తెలిపారు. దీంతో పుష్కర్, బస్సులోని మిగతా ప్రయాణికులు సంతోషంతో ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం.. ఈ సంఘటన కాస్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. కష్టకాలంలో మహిళకు అండగా నిలిచినందుకు కానిస్టేబుల్ బింటూ పుష్కర్పై నెటిజన్లు, ఉన్నతాధికారులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. -
నెల కిందటే పెళ్లి.. మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య!
యశవంతపుర: కొత్తగా పెళ్లయిన మహిళా కానిస్టేబుల్ ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన బెంగళూరు ఉత్తర తాలూకా చిక్కగొల్లరహట్టిలో జరిగింది. మృతురాలు నేత్రా (27). ఈమె కామాక్షిపాళ్య ట్రాఫిక్ పోలీసుస్టేషన్లో పని చేస్తోంది. పీణ్యాలో కానిస్టేబుల్ అయిన మంజునాథ్ ఆమెను నెలరోజుల కిందట ప్రేమ పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరిదీ తుమకూరు జిల్లా స్వస్థలం. వంట చేసే విషయమై భార్యాభర్తల మధ్య ఘర్షణ జరిగినట్లు, దీంతో ఆమె ఉరివేసుకున్నట్లు తెలిసింది. మాదనాయనహళ్లి పోలీసులు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేశారు. -
లేడీ కానిస్టేబుల్ సంధ్య రాణి కేసులో కొత్త ట్విస్ట్
సాక్షి, హైదరాబాద్: వివాహం అయ్యిందని తెలిసే తనను పెళ్లి చేసుకున్న భర్త ప్రస్తుతం వేధిస్తున్నాడని ఏఆర్ కానిస్టేబుల్ సంధ్య రాణి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో కొత్త ట్విస్ట్ వెలుగు చూసింది. సంధ్య రాణిపై ఆమె భర్త చరణ్ తేజ్ కావాలనే దుష్ప్రచారం చేస్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడయ్యింది. తనకు వివాహం అయిన సంగతి తెలిసే పెళ్లి చేసుకున్నాడని.. ఆ తర్వాత తనను దూరం పెడుతున్నాడని సంధ్య రాణి జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఇక భర్త చరణ్ తేజ్ తనను కులం పేరుతో దూషించి, వేధింపులకు గురి చేస్తున్నట్లు సంధ్య రాణి ఫిర్యాదులో పేర్కొంది. ఈ క్రమంలో పోలీసులు చరణ్ తేజ్‌పై ఐపీసీ 498ఏ, 506, వరకట్న నిరోధక చట్టంతో పాటు ఎస్సీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. అతడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఇక చరణ్ తేజ్ సంధ్యా రాణికి గతంలోనే రెండు వివాహాలు అయ్యాయని.. ఆ విషయం దాచి తనను పెళ్లి చేసుకుందని ఆరోపించాడు. తనను తీవ్రంగా కొట్టడంతో పాటు తల్లిదండ్రులు, స్నేహితులను కలవనీయకుండా చేస్తోందన్నారు. సంధ్యారాణి కుటుంబం నుంచి తనకు, తన తల్లిదండ్రులకు ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తం చేస్తూ శంషాబాద్ డీసీపీకి ఈమెయిల్ ద్వారా ఫిర్యాదు చేశాడు. చదవండి: పెళ్లిచేసుకుని మోసం చేస్తున్నాడు: లేడీ కానిస్టేబుల్ ఫిర్యాదు -
మహిళా కానిస్టేబుల్‌పై దురుసు ప్రవర్తన,వ్యక్తి అరెస్టు
బంజారాహిల్స్: మద్యం మత్తులో ట్రాఫిక్ మహిళా కానిస్టేబుల్‌ను అసభ్య పదజాలంతో దూషించిన యువకుడిపై కేసు నమోదైంది. ఘట్కేసర్ మండలం బోడుప్పల్‌కు చెందిన కొప్పు లవకుమార్(32), ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. బుధవారం రాత్రి స్నేహితులతో కలిసి జూబ్లీహిల్స్‌లోని ఓ పబ్‌లో మద్యం తాగి ఇన్నోవా కారులో వెళ్తున్నారు. జూబ్లీహిల్స్‌రోడ్ నెం. 45 చౌరస్తాలో తిరుమలగిరి ట్రాఫిక్ పోలీసులు డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్నారు. పోలీసులను చూసిన లవకుమార్ తప్పించుకునేందుకు ప్రయత్నిస్తుండగా కానిస్టేబుల్ శ్రీలక్ష్మి గుర్తించి మరో కానిస్టేబుల్‌తో కలిసి లవకుమార్ కారును ఆపింది. మత్తులో ఉన్న లవకుమార్ శ్రీలక్ష్మి పై దుర్భాషలాడుతూ పోలీసులపై దాడికి యత్నించాడు. డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహిస్తుండగా నెట్టేశాడు. ఎట్టకేలకు పోలీసులు పరీక్షలు నిర్వహించగా బీఏసీ 100 పైనే వచ్చింది. అనంతరం శ్రీలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు లవకుమార్‌ను అరెస్ట్ చేశారు. ( చదవండి: విషాదం.. సెల్ ఫోన్లో మాట్లాడుతూ.. ) -
ప్రియుడితో కలిసి క్వారంటైన్ కు.. ఆపై..
ముంబై: క్వారంటైన్ సెంటర్‌కు వెళ్లాల్సి వచ్చినప్పుడు కూడా ఒక మహిళా కానిస్టేబుల్ తన పాడు బుద్ధిని చూపించింది. తన ప్రియుడితో కలిసి క్వారంటైన్లో ఉండటానికి స్కెచ్ వేసి అధికారులను సైతం బురిడి కొట్టించింది. ప్రియుడినే భర్త అని నమ్మించి అధికారుల నుంచి అనుమతి తీసుకుంది. అయితే, ప్రియుడి భార్యకు విషయం తెలిసి ఆమె రావడంతో ప్లాన్ బెడిసికొట్టింది. ఈ ఘటన మహారాష్ట్రలోని నాగపూర్‌లో జరిగింది. నాగపూర్‌లో పనిచేస్తున్న ఓ లేడీ కానిస్టేబుల్‌కు, మరో ఉద్యోగికి కరోనా వైరస్ పాజిటివ్ వచ్చింది. చదవండి: సీఎం ఇంటి ఎదుట కరోనా బాధితుడి ఆందోళన దీంతో వారిద్దరిని క్వారంటైన్‌కు వెళ్లాల్సిందిగా ఉన్నాతాధికారులు అదేశించారు. అయితే ఆ లేడీ కానిస్టేబుల్ ప్రియుడిని భర్తగా చూపి అతనికి కూడా కరోనా సోకి ఉండవచ్చనే అనుమానం వ్యక్తం చేసింది. దీంతో అతనిని కూడా ఆమెతో పాటు పంపి క్వారంటైన్లో ఒకే గదిలో ఉంచారు. దీని తరువాత తన భర్త, ప్రియురాలితో కలిసి క్వారంటైన్ సెంటర్ లో ఉన్నాడని తెలుసుకున్న అతని భార్య, అక్కడికి వచ్చినా ఆమెను క్వారంటైన్ సెంటర్లోకి అనుమతించలేదు. దీంతో ఆమె బజాజ్ నగర్ పోలీసు స్టేషన్ కు వెళ్లి, తన భర్తపై ఫిర్యాదు చేసింది. లేడీ కానిస్టేబుల్‌కు, తన భర్తతో ఉన్న బంధం గురించి వివరించింది. విచారణ జరిపిన అధికారులు, ఆమె నిజం చెప్పిందని నిర్ధారించుకొని, అతన్ని మరో క్వారంటైన్ సెంటర్‌కు తరలించారు. సదరు మహిళా కానిస్టేబుల్ నిర్వాకంపై విచారణ చేపట్టారు. చదవండి: ప్రియుడితో కలిసి భర్త హత్య.. ఆ తర్వాత! -
ఓ కానిస్టేబుల్.. ఓ ఎమ్మెల్యే
కరోనాను ఓడించడానికి, సామాన్యుల్లో ఆత్మసై్థర్యాన్ని నింపడానికి కొందరు స్వచ్ఛందంగా పూనుకుంటున్నారు. వారిలో ఓ మహిళా ఎమ్మెల్యే, మహిళా కానిస్టేబుల్ చేస్తున్న ప్రయత్నాలు అందరి ప్రశంసలూ అందుకుంటున్నాయి. కరోనా వైరస్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న యుద్ధంలో సాధారణ వ్యక్తుల నుండి ప్రతి ఒక్కరూ ఆయా స్థాయులలో సహకరిస్తున్నారు. దేశంలో పెరుగుతున్న కరోనా వైరస్ కేసుల దృష్ట్యా దీనిని నివారించడానికి అదే సమయంలో బాధితులకు సహాయం చేయడానికి ముందుకు వస్తున్నారు. ఈ క్రమంలో... డ్యూటీ తర్వాత మాస్క్‌ల తయారీ మధ్యప్రదేశ్ లోని కురై గ్రామ పోలీస్ స్టేషన్లో పనిచేసే సృష్టి అనే మహిళా కానిస్టేబుల్ చేసే పని చాలా స్ఫూర్తిదాయకంగా అందరి ప్రశంసలు అందుకుంటోంది. రోజంతా డ్యూటీ చేసి అలసి ఇంటికి తిరిగి వచ్చిన తరువాత, ఆ మహిళా కానిస్టేబుల్ పోలీసులకు, సామాన్య ప్రజలకు మాస్కుల తయారీలో నిమగ్నం అవుతున్నారు. ఇది మాత్రమే కాదు, తన చేతులతో మాస్క్‌లు తయారు చేసిన ఆమె ఎవరైనా మాక్ లేకుండా కనిపిస్తారో వారందరికీ మాస్క్‌ను ఉచితంగా ఇస్తున్నారు. పోలీసు అధికారి ఇన్చార్జి రోహిత్ మిశ్రా మాట్లాడుతూ ‘శానిటైజర్, మాస్క్‌ల కొరత వల్ల ఈ లాక్డౌన్ సమయంలో మహిళా కానిస్టేబుల్ స్వయంగా తయారుచేయడం చాలా ప్రశంసనీయదగినది’ అంటూ సృష్టి చేస్తున్న పనిని కొనియాడారు. ప్రజల క్షేమమే ముఖ్యం రాజస్థాన్‌లోని షేర్గడ్ ఎమ్మెల్యే మీనా కన్వర్ మాస్క్‌లు తయారు చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఆమె స్వయంగా తన ఇంట్లో 2 వేల మందికి ముసుగులు తయారు చేస్తున్నారు. ప్రజల క్షేమమే నాకు ముఖ్యం అంటూ మాస్క్‌ల తయారీలో నిమగ్నం అయిన మీనా కన్వర్‌ను స్థానిక మహిళల్లోనూ కరోనా కట్టడికి స్ఫూర్తిని నింపుతున్నారు. మీనా తయారు చేసే ఈ ముసుగులలో సగం ఖైదీలకు పంపిణీ చేయనున్నామని ఆమె తెలిపారు. -
ఎమ్మెల్యే చెంప వాయించిన మహిళ కానిస్టేబుల్
-
ఎమ్మెల్యే చెంప పగలకొట్టిన లేడీ కానిస్టేబుల్
షిమ్లా : కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆశాకుమారికి తీవ్ర అవమానం ఎదురైంది. ఓ మహిళ కానిస్టేబుల్ తో దురుసుగా ప్రవర్తించబోయి.. చెంప దెబ్బ తిన్నారు. సమీక్ష సమావేశం కోసం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నేడు షిమ్లాకు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కార్యాయలం దగ్గరకు ఆశాకుమారి చేరుకున్నారు. అయితే పోలీస్ సిబ్బంది ఆమెను లోపలికి అనుమతించలేదు. ఈ క్రమంలో ఆగ్రహానికి గురైన ఆమె వాగ్వాదానికి దిగారు. అంతటితో ఆగకుండా ఓ మహిళా కానిస్టేబుల్ చెంప పగలకొట్టారు. అయితే దానికి ప్రతిగా ఆ కానిస్టేబుల్ కూడా ఆమె చెంప వాయించింది. ఆపై ఆశాకుమారి ఆగ్రహంతో ఊగిపోగా.. కార్యకర్తలు ఆమెను పక్కకు తీసుకెళ్లారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు అందాల్సి ఉంది. ఎమ్మెల్యే చెంప వాయించిన మహిళ కానిస్టేబుల్ -
మహిళా కానిస్టేబుల్ లింగమార్పిడికి నో!
సాక్షి, ముంబై : లింగ మార్పిడికి అనుమతించాలంటూ ఓ మహిళా కానిస్టేబుల్ దాఖలు చేసుకున్న అభ్యర్థనను మహారాష్ట్ర పోలీసులు తిరస్కరించారు. ఈ మేరకు సోమవారం ఔరంగబాద్ ఐజీపీ రాజ్‌కుమార్ వాట్కర్ ఆమెకు లేఖ రాశారు. హర్మోనల్ మార్పుల కారణంగా ప్రస్తుతం ఆమె ట్రాన్స్‌జెండర్‌గా జీవించాల్సి వస్తోంది. సంఘం కూడా ఆమె పట్ల వివక్షత ప్రదర్శిస్తోంది. అందుకే ఆమె లింగ మార్పిడి కోరుకుంటోంది. అంగీకరించండి. అని ఆమె తరపున న్యాయవాది డాక్టర్ ఎజాజ్ అబ్బాస్ జౌరంగబాద్ ఐజీపీకి అభ్యర్థన పిటిషన్ దాఖలు చేశారు. అయితే పోలీస్ రిక్రూట్మెంట్ నియామవళి ప్రకారం.. కానిస్టేబుల్ పురుష అభ్యర్థుల ఎత్తు 165 సెం.మీ. ఉండాల్సి ఉంది. అయితే 2009లో కానిస్టేబుల్‌గా చేరిన సదరు మహిళ ఎత్తు 162.5 మాత్రమే. దీంతో ఆమెను అనుమతించటం కుదిరే పని కాదంటూ అభ్యర్థనను పోలీస్ శాఖ తిరస్కరించారు. ఈ అంశంపై న్యాయపోరాటానికి వెళ్లే ఆలోచనలో ఉన్నట్లు అబ్బాస్ చెబుతున్నారు. -
మహిళా పోలీసులకు హీరో స్కూటీలు
హైదరాబాద్: మహిళ సాధికారతను ప్రోత్సహించేందుకు తెలంగాణ మహిళా పోలీసులకు హీరో మోటార్స్ 159 స్కూటీలను అందజేసింది. గురువారం ఇక్కడ జరిగిన కార్యక్రమంలో హీరో మోటార్స్ ప్రతినిధులు పాల్గొన్నారు. హైదరాబాద్ కమిషనరేట్ పోలీసులకు 70, సైబరాబాద్‌కు 50 స్కూటీలను, రాచకొండ కమిషనరేట్‌కు 39 స్కూటీలను అందజేశారు. ఈ కార్యక్రమానికి షీ టీం ఇన్చార్జ్ స్వాతిలక్రా, సైబరాబాద్, హైదరాబాద్, రాచకొండ పోలీస్ కమీషనర్లు హాజరయ్యారు. -
మహిళను చితక్కొట్టిన పోలీసులు
-
ప్రయాణికురాలిపై మహిళా కానిస్టేబుల్ దాడి
ఆదిలాబాద్: బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికురాలిపై మహిళా కానిస్టేబుల్ చేయి చేసుకుంది. ఈ సంఘటన అదిలాబాద్ జిల్లాలో ఆదివారం చోటుచేసుకుంది. అకారణంగా కానిస్టేబుల్ తనపై దాడి చేసిందని బాధితురాలు.. పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. వివరాలు.. కప్పర్ల గ్రామానికి చెందిన గంగూతాయి(18) అనే యువతి తలమడుగు మండలం ధరమ్‌పూర్ గ్రామం నుంచి అదిలాబాద్‌కు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఎక్కింది. బస్సులో బాగా రద్దీ ఉండటంతో.. ఫుట్‌బోర్డులో నిలబడింది. అదే సమయంలో బస్సులో తోపులాట జరగడంతో పక్కనే ఉన్న మహిళా కానిస్టేబుల్‌ను అనూష ఢీకొంది. దీంతో కోపోద్రిక్తురాలైన మహిళా కానిస్టేబుల్.. 'కళ్లు కనిపించడం లేదా మీద పడతావెందుకు' అని ఆమెను దుర్భాషలాడింది. రద్దీ ఎక్కువగా ఉండటంతో అలా జరిగిందని గంగుతాయి చెప్పింది. 'మాటకు మాట బదులు చేప్తావా' అంటూ యువతిపై దాడిచేసి ఆమెను కొట్టింది. దీంతో యువతి తన తల్లిదండ్రులతో కలిసి ఆదిలాబాద్ టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు విచారణ చేపడుతున్నారు. -
హల్చల్ చేసిన మహిళా కానిస్టేబుల్
-
ఆ నవ్వు చెరిగిపోయింది
ఏలూరు(టూ టౌన్), న్యూస్‌లైన్ : ‘పోలీస్ స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదీలను నవ్వుతూ పలకరించేది.. పనిలో చురుకుగా ఉండేది.. ఆమె విగత జీవిగా మారటంతో స్టేషన్ బోసిపోయింది’ తోటి కానిస్టేబుళ్ల విచారం.. ‘మా మంచి చెడ్డలు అడిగి తెలుసుకునేది.. ఎప్పుడూ సరదాగా, నవ్వుతూ ఉండేది’ చుట్టుపక్కల ఇళ్లవారి వారి ఆవేదన. ఆమె మెలగిన తీరును తలచుకుంటూ తెలిసిన వారంతా కన్నీటి పర్యంతమయ్యారు. ఏలూరు రూరల్ పోలీసు స్టేషన్ కానిస్టేబుల్ కాగాని జ్యోతిరాణి ఆత్మహత్యకు ప్రేమ విఫలం కావటమే కారణమని ఆమె కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2010 బ్యాచ్‌కు చెందిన జ్యోతిరాణి, అదే బ్యాచ్‌లో శిక్షణ పొందిన జ్యోతిబాబు ఏడాది నుంచి ప్రేమించుకుంటున్నారు. ప్రసుత్తం జ్యోతిబాబు ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. తమ ప్రేమ విషయం జ్యోతిరాణి ఆమె కుటుంబ సభ్యులకు చెప్పింది. దానికి వారు ఏమీ అభ్యంతరం చెప్పలేదు. తనకు వేరే పెళ్లి సంబంధాలు చూస్తున్నారని ఇటీవల జ్యోతిరాణితో చెప్పిన జ్యోతిబాబు, ఆమెను కూడా ఇంట్లోవాళ్లు చూసిన సంబంధం చేసుకోమని సలహా ఇచ్చాడు. అప్పటి నుంచి ఆమె దిగాలుగా ఉంటోంది. నాలుగు రోజుల క్రితం వారిద్దరి మధ్య పెళ్లి ప్రస్తావకు రాగా, పెళ్ళి చేసుకోనని జ్యోతిబాబు కరాఖండిగా చెప్పాడు. దీంతో జ్యోతిబాబు ఇంటికి వెళ్ళి అతని కుటుంబసభ్యులతో మాట్లాడమని గత నెల 31న ఆమె తన తల్లి సత్యవతిని కోరింది. మూడు రోజుల్లో ఏమైందో ఏమో శుక్రవారం ఉదయం విధులకు వెళ్ళిన జ్యోతిరాణి సాయంత్రం ఇంటికి వచ్చింది. రాత్రి 8 గంటలకు చీర మార్చుకుంటానని తల్లికి చెప్పి తన గదిలోకి వెళ్ళింది. భోజనానికిగాను ఆమెను తల్లి పిలిచినా ఎంతసేపటికీ బయటకు రాకపోవడంతో తలుపులు పగులగొట్టి చూడగా ఆమె చీరతో ఫ్యాన్‌కు ఉరివేసుకుని కనిపించింది. శనివారం మృతదేహాన్ని పోస్టుమార్టం చేశారు. ఈ ఘటనపై ఏలూరు టూటౌన్ పోలీసులు కేసును నమోదు చేసి విచారణ చేపట్టారు. గానుగులపేటలో విషాదచాయలు పవర్‌పేట సమీపంలోని గానుగులపేటలో నివాసం ఉంటున్న కాగాని త్రిమూర్తులు, సత్యవతికి ముగ్గురు కుమార్తెలు. పెద్ద కుమార్తెకు వివాహమైంది. మూడో కుమార్తె చదువుకుంటోంది. రెండో కుమార్తె జ్యోతిరాణి. ఆమె స్నేహితులు పోలీస్ ఉద్యోగానికి ప్రయత్నించటంతో ఆ స్ఫూర్తితో ఆమె ప్రయత్నించి కృతకృత్యురాలైంది. చిన్న వయసులోనే కానిస్టేబుల్ ఉద్యోగం రావటంతో ఆమె తల్లిదండ్రులు ఎంతో సంతోషించారు. ఇంటి చుట్టుపక్కల వారితో కలివిడిగా ఉంటూ వారి యోగక్షేమాలు తెలుసుకునే జ్యోతిరాణి మృతికి స్థానికులు కంటతడి పెట్టారు. పోస్టుమార్టం చేసే సమయంలో స్ధానికులు పెద్ద సంఖ్యలో ప్రభుత్వాసుపత్రికి చేరుకున్నారు. ఫిర్యాదీలను నవ్వుతూ పలకరించేది 2010లో పోలీసు శాఖలోకి అడుగుపెట్టిన జ్యోతిరాణి ముందుగా పెదపాడు పోలీసుస్టేషన్లో మొదటి పోస్టింగ్ వచ్చిన ఆమె రెండేళ్ల క్రితం ఏలూరు రూరల్ స్టేషన్‌కు బదిలీ అయింది. స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదీదారులను నవ్వుతు పలకరించి, ఫిర్యాదులు తీసుకునేదని హెడ్ కానిస్టేబుల్ నాని చెప్పారు. రైటర్‌కు సహయకురాలైన ఆమె చురుకుగా పనిచేసేదని పలువురు కానిస్టేబుల్స్ పేర్కొన్నారు. జ్యోతిరాణి లేకపోవడంతో స్టేషన్ నిండుతనం కోల్పోయిందని 2010 బ్యాచ్ కానిస్టేబుల్స్ ఆవేదన వ్యక్తం చేశారు. జ్యోతిరాణికి ఇన్చార్జి డీఎస్పీ కర్రి పుష్పారెడ్డి, రూరల్ సీఐ శుభాకర్, రూరల్ ఎస్సై జోసెఫ్ రాజు, టూటౌన్ ఎస్సై కిషోర్‌బాబు,రూరల్ పోలీసు స్టేషన్ సిబ్బంది కన్నీటి వీడ్కొలు పలికారు. శనివారం జ్యోతిరాణి అంత్యక్రియలు జరిగాయి. జ్యోతిబాబుపై కేసు నమోదు : జ్యోతిరాణిని ఆత్మహత్యకు ప్రేరేపించిన అభియోగంపై కానిస్టేబుల్ జ్యోతి బాబుపై ఐపీసీ 306 సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్టు టూటౌన్ ఎస్సై కిషోర్‌బాబు చెప్పారు.