ఎమ్మెల్యే చెంప పగలకొట్టిన లేడీ కానిస్టేబుల్‌ | MLA Asha Devi Slapped by Lady Constable | Sakshi
Sakshi News home page

Published Fri, Dec 29 2017 2:01 PM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM

MLA Asha Devi Slapped by Lady Constable - Sakshi

షిమ్లా : కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే ఆశాకుమారికి తీవ్ర అవమానం ఎదురైంది. ఓ మహిళ కానిస్టేబుల్‌ తో దురుసుగా ప్రవర్తించబోయి.. చెంప దెబ్బ తిన్నారు. 

సమీక్ష సమావేశం కోసం కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ నేడు షిమ్లాకు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కార్యాయలం దగ్గరకు ఆశాకుమారి చేరుకున్నారు. అయితే పోలీస్‌ సిబ్బంది ఆమెను లోపలికి అనుమతించలేదు. ఈ క్రమంలో ఆగ్రహానికి గురైన ఆమె వాగ్వాదానికి దిగారు. అంతటితో ఆగకుండా ఓ మహిళా కానిస్టేబుల్‌ చెంప పగలకొట్టారు. అయితే దానికి ప్రతిగా ఆ కానిస్టేబుల్‌ కూడా ఆమె చెంప వాయించింది. 

ఆపై ఆశాకుమారి ఆగ్రహంతో ఊగిపోగా.. కార్యకర్తలు ఆమెను పక్కకు తీసుకెళ్లారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు అందాల్సి ఉంది.

ఎమ్మెల్యే చెంప వాయించిన మహిళ కానిస్టేబుల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement