న్యూఢిల్లీ: ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్‌తో బుధవారం ప్రభుత్వ రంగ బ్యాంకుల ఎండీ, సీఈఓలు (పీఎస్‌బీ మేనేజింగ్ డైరెక్టర్లు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు) సమావేశం కానున్నారు. ప్రస్తుత ఆర్థిక వ్యవస్థ పనితీరు, రుణ వృద్ధి, మహమ్మారిని ఎదుర్కొనడంలో బ్యాంకింగ్ మద్దతు వంటి అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నట్లు అత్యున్నత స్థాయి వర్గాలు తెలిపాయి. దీనితో పాటు మొండిబకాయిలు (ఎన్‌పీఏ), వాటి రికవరీ ప్రక్రియపై కూడా ఆర్థికమంత్రి సమీక్ష జరిపే అవకాశం ఉంది. 2019 మార్చి 31న రూ.7,39,541 కోట్లుగా ఉన్న మొండిబకాయిలు, 2020 మార్చి 31 నాటికి రూ.6,78,317 కోట్లకు, 2021 మార్చి నాటికి రూ.6,16,616 కోట్లకు దిగివచ్చినట్లు గణాంకాలు పేర్కొంటున్నాయి. ముంబైలో జరుగుతుందని భావిస్తున్న ఈ సమావేశంలో భాగంగా ఆర్థికమంత్రి 2020–21కి ‘ఈఏఎస్‌ఈ 3.0 ఇండెక్స్’ ఫలితాలను కూడా ప్రకటించే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment