Chief Executive Officer
-
దివాలా అంచున స్విస్ బ్యాంక్?
2008లో ప్రపంచాన్ని కుదిపేసిన ఆర్థిక సంక్షోభానికి ముసలం బ్యాంకింగ్ రంగంలోనే మొదలైన సంగతి గుర్తుండే ఉంటుంది. అమెరికా ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ లేమాన్ బ్రదర్స్ దివాలా తీయడంతో స్టాక్ మార్కెట్లు పేక మేడల్లా కుప్పకూలాయి. ఇప్పుడు సరిగ్గా మళ్లీ అంతర్జాతీయ బ్యాంకింగ్ రంగానికి అలాంటి షాక్ తగలబోతోందనే ఊహాగానాలు జోరందుకున్నాయి. అనేక సమస్యలతో సతమతమవుతున్న స్విట్జర్లాండ్ బ్యాంకింగ్ దిగ్గజం క్రెడిట్ స్విస్... క్లిష్ట పరిస్థితుల్లో ఉందంటూ స్వయంగా దాని సీఈఓ వెల్లడించడంతో దివాలా తీయొచ్చంటూ గగ్గోలు మొదలైంది. న్యూయార్క్: గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ దిగ్గజం క్రెడిట్ స్వీస్ ప్రస్తుతం క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నట్లు సంస్థ సీఈవో ఉల్రిచ్ కోర్నర్ పేర్కొన్నారు. దీంతో తాజా పునర్వ్యస్థీకరణ చర్యలకు తెరతీయనున్నట్లు సిబ్బందికి రాసిన లేఖలో వెల్లడించారు. తద్వారా తగిన చర్యలు చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. అయితే బ్యాంక్ పటిష్టంగానే ఉన్నట్లు స్పష్టం చేశారు. బ్యాంకు షేరు పతనాన్ని చూసి కలత చెందొద్దని కూడా సిబ్బందికి సూచించారు. పటిష్ట స్థాయిలో మూలధన బేస్‌తోపాటు లిక్విడిటీ కూడా బాగానే ఉందని సీఈవో వివరించారు. అయితే, ఒకపక్క బ్యాంకు షేరు రోజుకో ఆల్‌టైమ్ కనిష్టాన్ని తాకుతుండటం... దివాలా వదంతుల నేపథ్యంలో ఉల్రిచ్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఈ నెల (అక్టోబర్) 27న బ్యాంక్ చేపట్టనున్న వ్యూహాత్మక సమీక్ష ఫలితాలు వెలువడేవరకూ సిబ్బందికి ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని అందించేందుకు నిర్ణయించుకున్నట్లు సీఈవో లేఖలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. మీడియాలో ఊహాగానాలకు స్పందించకుండా క్లయింట్లకు సేవలందించడంపై దృష్టిపెట్టాలని కూడా తమ సిబ్బందికి ఉల్రిచ్ సూచించినట్లు సమాచారం. కాగా, బ్యాంకు ఈ నెల 27న మూడో త్రైమాసిక ఫలితాలు విడుదల చేయనుంది. మూడు ముక్కలు... మూడేళ్లుగా వెలుగుచూస్తున్న రకరకాల స్కామ్‌లు... క్రెడిట్ స్విస్‌ను అతలాకుతం చేశాయి. మరోపక్క, యూరప్‌లో నెలకొన్న యుద్ధ వాతావరణం, ద్రవ్యోల్బణం సెగలు, వడ్డీరేట్ల పెంపు ప్రభావం కూడా బ్యాంకులపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో క్రెడిట్ స్విస్ గ్రూపును మూడు సంస్థలుగా విడదీసేందుకు బోర్డు ప్రణాళికలు సిద్ధం చేసింది. లాభదాయకంగా ఉన్న యూనిట్లను విక్రయించాలనేది బ్యాంకు యోచన. ప్రతిపాదనల ప్రకారం అడ్వయిజరీ బిజినెస్, అధిక ఒత్తిడిలోగల ఆస్తుల (హైరిస్క్ రుణాల)తో బ్యాడ్ బ్యాంక్‌లను విడదీయనుంది. వీటిని మినహాయించగా మిగిలిన బిజినెస్‌లతో మరో సంస్థ ఏర్పాటు కానుంది. అయితే ఈ అంశాలపై క్రెడిట్ స్వీస్ స్పందించకపోవడం గమనార్హం! ఇదీ నేపథ్యం... స్విట్జర్లాండ్‌లోని రెండో అతిపెద్ద బ్యాంక్ అయిన క్రెడిట్ స్విస్ గత మూడేళ్లలో రహస్య (స్పైయింగ్) కార్పొరేట్ కుంభకోణం, ఇన్వెస్ట్మెంట్ ఫండ్ల మూసివేత, రికార్డ్ ట్రేడింగ్ నష్టాలు, న్యాయపరమైన వ్యాజ్యాల పరంపర వంటి పలు సవాళ్లను ఎదుర్కొంటోంది. దీంతో బ్యాంక్ చైర్మన్ యాక్సెల్ లేమన్ వేసవిలో ఉల్రిచ్ కోర్నర్ను సీఈవోగా ఎంపిక చేసి బ్యాంకును గాడిలోపెట్టే బాధ్యతలు అప్పగించారు. బ్యాంక్ నిర్వహణలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టేందుకు అనుమతించారు. కాగా.. ఈ నెల మొదట్లో వ్యయ నియంత్రణ చర్యల్లో భాగంగా 5,000 మంది ఉద్యోగులపై వేటు వేయనున్నట్లు కూడా వార్తలు వెలువడ్డాయి. ఇన్వెస్టర్లలో వణుకు..! గత కొద్ది నెలలుగా క్రెడిట్ స్విస్ ఎదుర్కొంటున్న సవాళ్లతో బ్యాంకు షేరు కుప్పకూలుతూ వస్తోంది. ఈ ఏడాది ఆరంభంలో 9 డాలర్లుగా ఉన్న షేరు ధర తాజాగా సరికొత్త ఆల్‌టైమ్ కనిష్టానికి (3.9 డాలర్లు) దిగజారింది. మార్కెట్ విలువ 10 బిలియన్ డాలర్లకు పడిపోయింది. కాగా, సీఈఓ తాజాగా చేసిన వ్యాఖ్యలతో బ్యాంక్ దివాలా తీయనుందంటూ ట్విటర్లో మారుమోగుతోంది. అమెరికాతో సహా ప్రపంచ వ్యాప్తంగా సెంట్రల్ బ్యాంకులు వడ్డీరేట్లను ఎడాపెడా పెంచడంతో మాంద్యం భయాలు వెంటాడుతున్న తరుణంలో క్రెడిట్ స్విస్ దివాలా వార్తలు ఇన్వెస్టర్లకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇదే జరిగితే మార్కెట్ సెంటిమెంట్ మరింత బలహీనపడొచ్చనేది విశ్లేషకుల అభిప్రాయం. ఈ నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు నేడు ఎలా స్పందిస్తాయోన్న ఉత్కంట సర్వత్రా నెలకొంది. -
ఆర్బీఎల్ బ్యాంక్ తాత్కాలిక చీఫ్ బాధ్యతల పొడిగింపు
న్యూఢిల్లీ: ప్రైవేటు రంగంలోని ఆర్బీఎల్ బ్యాంక్ తాత్కాలిక మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా (సీఈఓ) బాధ్యతలు నిర్వహిస్తున్న రాజీవ్ అహూజా పదవీ కాలాన్ని మరో మూడు నెలలు పొడిగిస్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 25వ తేదీ నుంచి మూడు నెలలు లేదా రెగ్యులర్ ఎండీ అండ్ సీఈఓ నియామకం జరిగే వరకూ ఏది ముందయితే దానికి వర్తించేలా ఆదేశాలు ఇస్తున్నట్లు బ్యాంకింగ్ రెగ్యులేటర్ పేర్కొంది. గత ఏడాది డిసెంబర్లో చోటుచేసుకున్న అనూహ్య పరిణామాల నేపథ్యంలో బ్యాంక్ ఎండీ అండ్ సీఈఓ విశ్వవీర్ అహూజాను లీవ్‌పై పంపుతూ బ్యాంక్ బోర్డ్ నిర్ణయం తీసుకుంది. అలాగే బ్యాంక్ రోజూవారీ కార్యకలపాల నిర్వహణకు తాత్కాలిక చీఫ్‌గా రాజీవ్ అహూజాకి పదోన్నతి ఇచ్చి, ఇందుకు ఆర్బీఐ ఆమోదాన్ని కోరింది. డిసెంబర్ 25 నుంచి మూడు నెలలు ఆయన బాధ్యతల్లో ఉండేలా ఆర్బీఐ ఆమోదం లభించింది. తన చీఫ్ జనరల్ మేనేజర్ యోగేష్ కే దయాల్‌ను ఆర్బీఐ బ్యాంక్ బోర్డ్‌లో నియమించినట్లు ఆర్బీఐ 2021 డిసెంబర్ 24 ఇచ్చిన ఉత్తర్వుల నేపథ్యంలో అప్పటి ఈ కీలక పరిణామం చోటుచేసుకుంది. బ్యాంక్ చీఫ్‌గా తన నియామకం తర్వాత డిసెంబర్ 26వ తేదీన మీడియా, ఇన్వెస్టర్లతో రాజీవ్ అహూజా మొట్టమొదటిసారి మాట్లాడుతూ, బ్యాంక్ ఆర్థికంగా పటిష్టంగా ఉందని తెలిపారు. డైరెక్టర్ల బోర్డు, ఆర్బీఐ నుంచి బ్యాంకుకు సంపూర్ణ మద్దతు ఉందని చెప్పారు. -
నేడు ఆర్థికమంత్రితో బ్యాంకింగ్ సీఈఓల భేటీ
న్యూఢిల్లీ: ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్‌తో బుధవారం ప్రభుత్వ రంగ బ్యాంకుల ఎండీ, సీఈఓలు (పీఎస్బీ మేనేజింగ్ డైరెక్టర్లు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు) సమావేశం కానున్నారు. ప్రస్తుత ఆర్థిక వ్యవస్థ పనితీరు, రుణ వృద్ధి, మహమ్మారిని ఎదుర్కొనడంలో బ్యాంకింగ్ మద్దతు వంటి అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నట్లు అత్యున్నత స్థాయి వర్గాలు తెలిపాయి. దీనితో పాటు మొండిబకాయిలు (ఎన్పీఏ), వాటి రికవరీ ప్రక్రియపై కూడా ఆర్థికమంత్రి సమీక్ష జరిపే అవకాశం ఉంది. 2019 మార్చి 31న రూ.7,39,541 కోట్లుగా ఉన్న మొండిబకాయిలు, 2020 మార్చి 31 నాటికి రూ.6,78,317 కోట్లకు, 2021 మార్చి నాటికి రూ.6,16,616 కోట్లకు దిగివచ్చినట్లు గణాంకాలు పేర్కొంటున్నాయి. ముంబైలో జరుగుతుందని భావిస్తున్న ఈ సమావేశంలో భాగంగా ఆర్థికమంత్రి 2020–21కి ‘ఈఏఎస్‌ఈ 3.0 ఇండెక్స్’ ఫలితాలను కూడా ప్రకటించే అవకాశం ఉంది. -
ఎల్ఐసీలో కొత్తగా సీఈవో పోస్ట్
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ జీవిత బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) పబ్లిక్ ఇష్యూకి సంబంధించి కేంద్రం చర్యలు వేగవంతం చేస్తోంది. ఇందులో భాగంగా కంపెనీలో చైర్మన్ పోస్టును చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈవో)గా మారుస్తూ సంబంధిత నిబంధనలకు మార్పులు చేసింది. దీని ప్రకారం ఇకపై ఎల్ఐసీకి సీఈవో, ఎండీ మాత్రమే ఉండనున్నారు. జూలై 7న ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రస్తుత విధానం ప్రకారం ఎల్ఐసీలో ఒక చైర్మన్, నలుగురు ఎండీల విధానం అమల్లో ఉంది. ఎల్ఐసీ లిస్టింగ్‌కు మార్గం సుగమం చేసే దిశగా కంపెనీ అధీకృత షేర్ క్యాపిటల్‌ను రూ. 25,000 కోట్లకు పెంచే ప్రతిపాదనకు కూడా కేంద్రం ఇప్పటికే ఆమోదముద్ర వేసింది. -
TikTok: నేను మరీ అంత సోషల్ కాదు.. సీఈఓగా ఉండలేను
బీజింగ్: చైనీస్ ప్రముఖ సోషల్ మీడియా యాప్ టిక్‌టాక్ మాతృ సంస్థ బైట్‌డాన్స్ సహ వ్యవస్థాపకుడు జాంగ్ యిమింగ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై తాను సంస్థకు సీఈఓగా ఉండబోనని గురువారం వెల్లడించారు. కంపెనీ మరో కో- ఫౌండర్ రూబో లియాంగ్ తన స్థానంలో బాధ్యతలు చేపడతారని, అధికార మార్పిడి సాఫీగా సాగేందుకు ఆరు నెలల పాటు రూబోతో కలిసి పనిచేస్తానని తెలిపారు. ఈ మేరకు.. ‘‘ఆదర్శవంతమైన మేనేజర్‌గా ఉండే నైపుణ్యాలు నాలో కొరవడ్డాయి అన్నది నిజం. నాకైతే మార్కెట్ విధానాల మీద, ఆర్గనైజేషనల్ ఎనాలసిస్ మీద ఆసక్తి. నిజానికి మనుషులను మేనేజ్ చేయడం కంటే ఈ అంశాల మీద దృష్టి సారిస్తే మంచిదని భావిస్తాను. ఎందుకంటే నేను మరీ అంత కలివిడిగా ఉండే వ్యక్తి(సోషల్)ని కాదు. నన్ను నేను సంతోషంగా ఉంచుకోవడానికి ఆన్లైన్లో ఉండటం, పుస్తకాలు చదవడం, పాటలు వినడం చేస్తూ ఉంటా. రూబో బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆరు నెలల పాటు తనతో కలిసి పనిచేస్తా’’ అని ఉద్యోగులను ఉద్దేశించి రాసిన మెమోలో జాంగ్ యిమింగ్ పేర్కొన్నారు. కాగా రూబో లియాంగ్ ఇంతకుముందు బైట్‌డాన్స్ హ్యూమన్ రీసోర్సెస్(మానవ వనరుల విభాగం)హెడ్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. ఇక 2012లో ప్రారంభమైన బైట్‌డాన్స్ చైనాతో పాటు గ్లోబల్ మార్కెట్లోనూ హవా చూపింది. ముఖ్యంగా షార్ట్ వీడియో యాప్ టిక్‌టాక్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందికి చేరువైన ఈ సంస్థ అనతికాలంలోనే లాభాలను ఆర్జించింది. అయితే, జాతీయ భద్రతా కారణాల దృష్ట్యా అమెరికా, భారత్ వంటి దేశాలు టిక్‌టాక్‌పై నిషేధం విధించడంతో భారీగా నష్టపోయిన ఈ కంపెనీ, పూర్వవైభవం పొందేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. చదవండి: టీనేజ్ సంచలనం.. టిక్ టాక్ ఎటాక్ -
సీఈఓ సాహ్నిపై వేటుకు ఐసీసీ సిద్ధం!
దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)లో కలకలం రేగింది. ఎవరినీ పట్టించుకోకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తున్న చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ) మను సాహ్నిని సాగనంపేందుకు రంగం సిద్ధమైంది. బోర్డులో ఎవరితోనూ కలుపుగోలుతనం లేని ఆయన నియంతృత్వ పోకడలతో అందరికి మింగుడు పడని ఉన్నతాధికారిగా తయారయ్యారు. సభ్యులే కాదు బోర్డు సహచరులు, కింది స్థాయి అధికారులు సైతం భరించలేనంత కరకుగా ప్రవర్తిస్తున్న ఆయన్ని ప్రస్తుతానికైతే సెలవుపై పంపించారు. రాజీనామా చేయించేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. ‘రాజీ’పడకపోతే ఇక తొలగించడమైన చేస్తాం కానీ ఏమాత్రం కొనసాగించేందుకు సిద్ధంగా లేమని ఐసీసీ వర్గాలు, సభ్యదేశాలు ఏకాభిప్రాయానికి వచ్చేశాయి. 2019లో జరిగిన ఐసీసీ ప్రపంచకప్ అనంతరం డేవ్ రిచర్డ్సన్ స్థానంలో 56 ఏళ్ల సాహ్ని సీఈఓ బాధ్యతలు చేపట్టారు. 2022 వరకు పదవిలో ఉండాల్సిన ఆయనకు అందరితోనూ చెడింది. ముక్కోపితత్వంతో వ్యవహరించే ఆయన శైలిపై విమర్శలు రావడంతో విచారణ చేపట్టారు. ప్రముఖ సంస్థ ప్రైజ్ వాటర్‌హౌజ్ కూపర్ అంతర్గతంగా చేపట్టిన ఈ దర్యాప్తులో ప్రతీ ఒక్కరు సాహ్ని వ్యవహారశైలిని తులనాడినవారే ఉన్నారు... కానీ ఏ ఒక్కరు సమర్థించలేదు. ఈ నేపథ్యంలో ఐసీసీ ఉన్నతాధికారుల బోర్డు ఆయన్ని మంగళవారమే సెలవుపై పంపింది. బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి సాహ్ని ఏకస్వామ్యంగా సాగిపోతున్నారు. సమష్టితత్వంతో, కలివిడిగా సాగాల్సివున్నా ఆయన మాత్రం ఇవేవి పట్టించుకోలేదు. ఐసీసీ విధాన నిర్ణయాల్లో సైతం తన మాటే నెగ్గించుకునే ప్రయత్నం చేశారు తప్ప... సహచరులు, సభ్యుల సూచనలకు విలువివ్వాలన్న స్పృహ కోల్పోయారు. సహచరులు, కింది స్థాయి ఉద్యోగులపై అయితే దుందుడుగా ప్రవర్తించేవారు. మధ్యే మార్గంగా సాగాల్సిన ఐసీసీ చైర్మన్ ఎన్నికల ప్రక్రియలోనూ ఇమ్రాన్ ఖాజా ఎన్నికయ్యేందుకు మొండిగా ప్రవర్తించారు. ఐసీసీలోని శాశ్వత సభ్యదేశాలే కాదు... మెజారిటీ అనుబంధ సభ్యదేశాల ప్రతినిధులకు ఇదేమాత్రం రుచించలేదు. ఐసీసీలోని ‘బిగ్–3’ సభ్యులైన బీసీసీఐ, ఈసీబీ, సీఏలు మను సాహ్నిని ఇక భరించలేమన్న నిర్ణయానికి రావడంతో సాగనంపక తప్పలేదు. గౌరవంగా రాజీనామా చేస్తే సరి లేదంటే ఐసీసీ తీర్మానం ద్వారా తొలగించడం అనివార్యమైంది. ఇందుకు ఐసీసీ బోర్డులోని 17 మంది సభ్యుల్లో 12 మంది మద్దతు అవసరమవుతుంది. -
బోయింగ్ సీఈవో డెనిస్‌కు ఉద్వాసన
న్యూయార్క్: మ్యాక్స్ ఎయిర్‌క్రాఫ్ట్‌ల వివాదం కారణంగా ప్రతిష్ట మసకబారడంతో .. విమానాల తయారీ దిగ్గజం బోయింగ్ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా డెనిస్ ములెన్‌బర్గ్‌ను చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈవో) పదవి నుంచి తప్పించింది. ప్రస్తుతం బోర్డ్ చైర్మన్‌గా వ్యవహరిస్తున్న డేవిడ్ కాలోన్కు సీఈవో, ప్రెసిడెంట్ బాధ్యతలు అప్పగించింది. నియంత్రణ సంస్థలు, కస్టమర్లు, ఇతర వర్గాలతో సంబంధాలను మెరుగుపర్చుకునేందుకు, వారి విశ్వాసం చూరగొనేందుకు ఈ మార్పులు అవసరమని బోయింగ్ పేర్కొంది. పూర్తి పారదర్శకంగా పనిచేసేందుకు కట్టుబడి ఉన్నామని ఒక ప్రకటనలో తెలిపింది. దీని ప్రకారం డెనిస్ ములెన్‌బర్గ్ తక్షణమే పదవి నుంచి తప్పుకోనున్నారు. వచ్చే ఏడాది జనవరి 13న కాలొన్ కొత్త బాధ్యతలు చేపడతారని బోయింగ్ తెలిపింది. ఈలోగా చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ గ్రెగ్ స్మిత్.. తాత్కాలిక సీఈవోగా వ్యవహరిస్తారని వివరించింది. 737 మ్యాక్స్ రకానికి చెందిన రెండు విమానాలు కుప్పకూలడంతో ఈ విమానాలను పూర్తిగా పక్కన పెట్టాల్సి వచ్చిన సంగతి తెలిసిందే. -
ఆడి చీఫ్ ఎగ్జిక్యూటివ్ అరెస్ట్
జర్మనీ లగ్జరీ కారు తయారీదారి ఆడి చీఫ్ ఎగ్జిక్యూటివ్ రూపెర్ట్ స్టాడ్లర్ అరెస్ట్ అయ్యారు. డీజిల్ ఉద్గారాల స్కాండల్ విచారణలో సంబంధం ఉందనే ఆరోపణలతో ఆయన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆడి సొంతమైన ఫోక్స్‌వాగన్ అధికార ప్రతినిధి రూపెర్ట్ అరెస్ట్‌ను సోమవారం ధృవీకరించారు. ఆయన్ని కస్టడీలోకి తీసుకుని రిమాండ్‌లోకి తరలించాలని జడ్జి ఆదేశించారు. ఫోక్స్‌వాగన్ కర్బన్ ఉద్గారాల స్కాండల్‌లో మాల్‌ప్రాక్టిస్‌కు పాల్పడ్డారని రూపెర్ట్పై విచారణ కొనసాగుతోంది. మోసపూరిత సాఫ్ట్‌వేర్‌ను పొందుపరిచిన 2,10,000 డీజిల్ ఇంజిన్ కార్లను ఆడి 2009 నుంచి అమెరికా, యూరప్‌లలో విక్రయించిందని ఆ కంపెనీపై పెద్ద ఎత్తున్న ఆరోపణలు ఉన్నాయి. గత నెలలోనే తమ 60వేల ఏ6, ఏ7 మోడల్స్‌ను మోసపూరిత సాఫ్ట్‌వేర్‌ను కలిగి ఉన్నట్టు కంపెనీ ఒప్పుకుంది కూడా. ఈ మోసపూరిత ఆరోపణలు, అక్రమ ప్రొడక్ట్ ప్రమోషన్లపై ఈ లగ్జరీ కారు తయారీదారిపై దర్యాప్తు సంస్థలు విచారణ చేస్తున్నాయి. ఈ మోసంలో ఆడి సీఈవో రూపెర్ట్ పాత్ర ఉందని మునిచ్ న్యాయవాదులు జూన్ 13న ప్రకటించారు. ఆయన ఇంట్లో సోదాలు కూడా జరిపారు. 1994 నుంచి రూపెర్ట్ ఫోక్స్‌వాగన్-ఆడిలో పనిచేస్తున్నారు. 2007 నుంచి ఆడిలో టాప్ మేనేజ్మెంట్ స్థానంలో ఉన్నారు. -
సమన్వయంతో పనిచేయాలి
అశ్వాపురం: అధికారులు, ఉద్యోగ సంఘాలు, ఉద్యోగులు సమన్వయంతో పనిచేసి మణుగూరు భారజల కర్మాగారం అభివృద్ధికి కృషి చేయాలని భారజల బోర్డు చైర్మన్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటీవ్ డాక్టర్ యూ.కామాచి ముదలి అన్నారు. బోర్డు చైర్మన్ రెండో రోజు మణుగూరు భారజల కర్మాగారం పరిధిలో విసృతంగా పర్యటించారు. శుక్రవారం ఉదయం భారజల కర్మాగారం అడ్మినిస్ట్రేటివ్ భవనంలో అధికారులతో సమావేశమై సమీక్ష జరిపారు. అనంతరం అశ్వాపురం మండలం అమ్మగారిపల్లిలో యాష్ ప్లాంటును, గౌతమీనగర్ కాలనీలోని అణుశక్తి కేంద్రీయ విద్యాలయంలో సైన్స్‌పార్క్‌ను, స్కూల్‌ను పరిశీలించారు. ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. భారజల ఆస్పత్రిని సందర్శించి రోగులకు వైద్యం అందుతున్న పరిశీలించారు. వైద్యులతో సమావేశమై వైద్యం అందుతున్న తీరు, సిబ్బంది వివరాలు తెలుసుకున్నారు. సాయంత్రం భారజల కర్మాగార అతిథిగృహంలో అధికారులు, ఉద్యోగ సంఘాల నాయకులతో సమావేశమయ్యారు. భారజల కర్మాగారం ప్రతిష్టను మరింత పెంచాలన్నారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి శాయశక్తులా కృషి చేస్తానన్నారు. అనంతరం చైర్మన్ తన పర్యటనను ముగించుకుని హైదరాబాద్ వెళ్లారు. ఈ సమావేశంలో భారజల బోర్డు అసోసియేట్ డైరెక్టర్ పీకేఎం.పార్థిబన్, భారజల కర్మాగారం సీజీఎం జితేంద్ర శ్రీవాత్సవ, సీఏఓ జయకృష్ణ, డీజీఎంలు అరుణ్‌బోస్, ప్రసాద్, ఏడీఎంఓ నవీన్‌కుమార్, ఏపీఓ శ్రీనివాస్, ఉద్యోగ సంఘం గౌరవ అధ్యక్షుడు సీతారాములు, అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు విఠల్‌రావు, పోతురాజు శ్రీనివాసరావు, ఉపాధ్యక్షుడు కూరపాటి శ్రీనివాసరావుతో అసోసియేషన్ ప్రతినిధులు, ఇతర అధికారులు, సంఘాల నాయకులు పాల్గొన్నారు. -
డాడీ జుకర్‌బర్గ్ పిల్లాడయ్యాడు!
►ఒక్క పోస్ట్.. పెటర్నిటీ లీవ్‌ని సార్థకం చేస్తుంది. ►ఒక్క ట్వీట్.. ప్రభుత్వ యంత్రాంగాన్ని పరుగులు పెట్టిస్తుంది. ►ఒక్క వింత హ్యాబిట్.. ‘వద్దు బ్రోస్... ఆ అలవాటు మానుకోండి’ అని నెట్లో హితవు చెప్పిస్తుంది. ►ఒక్క చాపల్యం.. వీడియోలో వైరల్ అవుతుంది. ఆదిత్య 369 లా వెనక్కి వెళ్లిన కాలం... ►ఒక్క రూపాయికి కడుపునిండా టిఫిన్ పెట్టి పంపిస్తుంది. ►ఈవారం ‘నెట్ ఇంట్లో’ మీరు ఈ ట్రెండ్స్ అన్నీ చూడొచ్చు. నెట్‌ఇంట్లో ఆశ్చర్యపోకండి... జుకర్‌బర్గ్ డాడీ ఎప్పుడు అయ్యాడా అని! ఈ ఫేస్బుక్ సీఈఓ ప్రస్తుతం పెటర్నిటీ లీవ్‌లో ఉన్నాడు. కానీ అప్పుడే డాడీ అయిపోయినట్లు... పుట్టబోయే చిన్నారితో ఆడుకునే అనుభవం కోసమా అన్నట్లు... ఓ మామూలు ఫేస్బుక్ అకౌంట్ హోల్డర్‌గా విమానాల్ని టాయ్స్‌లా పోస్ట్ చేస్తున్నారు. అమెరికాకు చెందిన యుద్ధ విమానాలు అతి దిగువగా ప్రయాణిస్తూ ఆకాశంలో చక్కర్లు కొడుతున్న దృశ్యాల 360 డిగ్రీ వీడియోను ఆయన నవంబర్ 24న పోస్ట్ చేశారు. పనిలో పనిగా ఈ సదుపాయం ఫేస్బుక్ లో కూడా ఉందని మరీ ఆయన చెప్పారు. దీనిపై వచ్చిన వేలాది కామెంట్లకు ఓపిగ్గా సమాధానాలు రాశారు. డాడీ అయ్యాక ఆయనకు ఈ ఓపిక ఇంకా బాగా పనికిరావచ్చు. విక్రమూర్ఖుడు గురుడు పట్టు వదలని విక్రమార్కుడు.. సారీ, విక్రమూర్ఖుడు. ఓ దుకాణానికి వెళ్లాడు. ఏడు ఫ్రాంకులు చెల్లించి క్యాబిన్లోకి వెళ్లాడు. లోపల్నుంచి తలుపు మూసుకున్నాడు. ఇంతలో దుకాణానికి నిప్పంటుకుంది. అందరూ ఖాళీ చేశారు కానీ క్యాబిన్లో ఉన్న మనోడు మాత్రం బయటికి రానంటాడు! మంటల్లోంచి వస్తున్న పొగకు ఉక్కిరిబిక్కిరై కూడా, భళ్లు భళ్లున దగ్గుతున్నా కూడా దొంగచాటుగా చూస్తున్న వీడియోను ఆసాంతం చూసేయాలని నిర్ణయించుకున్నాడు. ‘బయటకి రావయ్యా మగడా... చనిపోతావు’ అని అగ్నిమాపక సిబ్బంది ఎంత మొత్తుకున్నా వినకుండా ‘వీడియో పూర్తవాలి. నేను బయటకి రావాలి’ అని తేల్చేశాడు. చివరికి క్యాబిన్ తలుపులు బద్దలుగొట్టి, అతడిని బలవంతంగా బయటికి తేవాల్సి వచ్చింది. లాక్కువస్తుంటే కూడా ‘నా వీడియో... ఇంకా పూర్తి కాలేదు’ అని గోలపెట్టాడట. చివరికి ఎలాగోలా బయటకు తెచ్చాక ‘ఏడు ఫ్రాంకులు ఇచ్చా మరి... పూర్తిగా చూడకుండా ఎలా వదుల్తా’ అని అన్నాడట. ఈ సంఘటన జర్మనీలోని బెర్లిన్ లో జరిగింది. ట్విట్టర్ పవర్ ట్వీట్ అంటే తోకలేని పిట్ట. నూట నలభై అక్షరాల్లో అది ప్రపంచమంతా చుట్టి వచ్చేస్తుంది. దాని పవరేంటో చూడాలంటే నమ్రతా మహాజన్ కథ తెలుసుకోవాల్సిందే. గతవారం నమ్రత మహారాష్ట్రలో రైల్ల్లో ప్రయాణిస్తోంది. కంపార్ట్మెంట్లో ఆమె ఎదురుగా ఒక వ్యక్తి మాత్రమే ఉన్నాడు. అతని కదలికలు ఆమెలో అనుమానం రేకెత్తించాయి. ఏదో జరగొచ్చునన్న భయం ఆమెను ఆవరించింది. ఆమె తన సెల్ ఫోన్లో తక్షణం ఏకంగా రైల్వే మంత్రి సురేశ్ప్రభుకే ట్వీట్ చేసింది! క్షణాల్లో ఆమె టికెట్ పీఎన్ఆర్ నంబర్ పంపమని రైల్వే అధికారులు ఆమెను అడిగారు. ఆమె పంపింది. తర్వాతి స్టేషన్ వచ్చేసరికి పోలీసులు ఆమె వద్దకు వచ్చారు. ఆమె ఎదుటి వ్యక్తిని పశ్నించారు. అతను హడలిపోయాడు. తరువాత ఆ వ్యక్తిని వేరే కంపార్ట్మెంట్కి తరలించారు. ఇప్పుడు అంతా సురేశ్ ప్రభు పనితీరును మెచ్చుకుంటున్నారు. కానీ అసలు కథంతా నడిపించింది మాత్రం ట్విట్టర్ అనే సోషల్ మీడియానే. ఒక్క ట్వీట్ తో రైల్వే యంత్రాంగమంతటినీ కదిలించేసింది నమ్రత. అదీ ట్విట్టర్ పవరంటే! మెరుపు దాడి జిగేల్మనే గడ్డం... జిలుగు వెలుగుల గడ్డం! ఇప్పుడు గడ్డానికి మెరుపు అద్దడం లేటెస్ట్ ఫేషన్. గడ్డానికి ఎరుపు, నీలం, ఆకుపచ్చ ఇలా రకరకాల రంగుల మెరుపు అంటించి జిగేల్మనడం ఇప్పుడు యూరప్, అమెరికాల్లో వేలం వెర్రిగా సాగుతోంది. జిలుగు వెలుగుల గడ్డంతో, మెరుపుల మీసంతో అందరూ రెడీ అవుతున్నారు. కొందరైతే కేవలం గడ్డానికి, మీసానికే కాదు, నాలుకకు కూడా మెరుపు అంటించుకుని తయారవున్నారు. ఇప్పుడిదే లేటెస్ట్ ఫ్యాషన్ అని సరదా పడున్నారు. వాళ్ల ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. అయితే దీన్ని వ్యతిరేకించే వాళ్లూ లేకపోలేదు . ‘బ్రోస్ ... డోన్ట్ లెట్ బ్రోస్ గ్లిట్టర్ దెయిర్ బియర్డ్స్’ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఏకంగా ఒక ఉద్యమమే సాగుతోంది. గడ్డానికి మెరుపులు అద్దుకోవడం సులువే కానీ, వాటిని వదిలించుకోవడం మాత్రం చాలా కష్టం. కాబట్టి యూరప్ ట్రెండ్ ఫాలో అయ్యే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోండి. ఆ తరువాత మీ ఇష్టం. నాటి ధరలు... నేటి వంటలు ఉప్మా ప్లేటు ఇరవై పైసలు. ఫిల్టర్ కాఫీ పదిహేను పైసలు. రసం వడ యాభై పైసలు. ఇడ్లీ ఇరవై పైసలు, సాదా దోశ నలభై ఐదు పైసలు. ఒక ప్లేటు రసం వడ, రెండు ఉప్మా, ఒక ఫిల్టర్ కాఫీ తింటే టాక్సులతో సహా బిల్లు అక్షరాలా ఒక్క రూపాయి మరియు అయిదు నయా పైసలు. పది రూపాయలుంటే పది మంది పండగ చేసుకోవచ్చు. విందు భోజనం ఆరగించేయొచ్చు. ముంబై మాతుంగాలోని మద్రాస్ కేఫ్ 75 ఏళ్లు పూర్తిచేసుకుని, డైమండ్ జూబ్లీ జరుపుకుంటోంది. అందుకే కస్టమర్లకు హోటల్ మొదలుపెట్టిన నాటి ధరలకు ... అంటే 1940 నాటి ధరలకే టిఫిన్లు ఇస్తున్నారు. ఈ స్పెషల్ ఆఫర్ కొన్ని రోజులకు మాత్రమేనట. ఇప్పుడు ఈ హోటల్ ఇచ్చిన బిల్లుల ఫోటోలు ఇంటర్నెట్ అంతా విహరిస్తున్నాయి. మీకూ ఆనాటి ధరలకే ఈనాడు టిఫిన్ చెయ్యాలని ఉంటే తక్షణం ఓ ఆరేడు వేలు మీవి కాదకుని విమానం ఎక్కేసి ముంబాయి వెళ్లిపొండి. టిఫిన్ నలభై ఐదు పైసలు. రానూపోను ఖర్చు మాత్రం ఓ ఆరేడువేలు. అంతే...!! కూర్పు: కె. రాకా సుధాకరరావు www.sakshipost.com -
పిన్నవయసులో సీఈవో
ప్రతిభాకిరణం సింధూజ రాజ్మరాన్ అనే 16 ఏళ్ళ బాలిక భారతదేశంలో పిన్న వయసు సీఈవోగా గుర్తింపు పొందింది. చెన్నైలో పుట్టిన సింధూజ తండ్రి స్థాపించిన seppan అనే యానిమేషన్ కంపెనీకి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా నియమితురాలైంది. నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ సర్వీస్ కంపెనీస్ అనే సంస్థ సింధూజకు పిన్న వయసు సీఈవోగా గుర్తింపునిచ్చింది. సింధూజ తండ్రి ఒక కార్టూనిస్ట్. తండ్రి ప్రోత్సాహంతోనే తను సీఈవో బాధ్యతలు చేపట్టగలిగిందని చెప్పారు. సింధూజ ఫ్లాష్, ఫొటోషాప్, కోరల్ పెయింట్, ఆఫ్టర్ ఎఫెక్ట్, మాయా మొదలైన సాఫ్ట్వేర్లలో నిష్ణాతురాలు. ప్రస్తుతం ఆమె ప్రఖ్యాత భారతీయ కంపెనీలకు సినిమాలు, యాడ్స్ రూపొందించే 18 సభ్యుల బృందానికి నేతృత్వం వహిస్త్తోంది. ఆమె ప్రపంచ సమస్యలపై, వ్యాధులపై లఘుచిత్రాలను నిర్మించింది. ఇప్పుడు ‘టీ నగర్’ అనే 2డి యానిమేషన్ సినిమాకి పనిచేస్తోంది. కోరల్ సంస్థ ఆమెను ప్రపంచంలోనే చిన్న వయసు డిజిటల్ కారికేచరిస్ట్గా గుర్తించింది. అంతేకాదు, నాస్కామ్ సంస్థ ఆమెకు వేగంగా పనిచేసే 2డి యానిమేటర్ అవార్డును ఇచ్చింది. తన స్వంత నిర్మాణసంస్థను ఏర్పాటు చేసుకుని సినిమా ప్రొడక్ట్స్‌ను ప్రపంచవ్యాప్తంగా అందించాలన్నది సింధూజ ఆకాంక్ష. -
New Solicitor General of India?
SBI POs, Clerks General Awareness 1. Who will take over from S.D. Shibulal as the Chief Executive Officer and Managing Director of Infosys on August 1, 2014? 1) U.B. Pravin Rao 2) K.V. Kamath 3) Srinath Batni 4) Vishal Sikka 5) Rohan Murthy 2. Petro Poroshenko became the President of which of the follo-wing countries on June 7, 2014? 1) Belarus 2) Ukraine 3) Georgia 4) Latvia 5) Czech Republic 3. FIFA World Cup was started on June 12, 2014. Which two teams played the first match in Sao Paulo, Brazil? 1) Brazil, Mexico 2) Brazil, Cameroon 3) Brazil, Croatia 4) Spain, Netherlands 5) Spain, Chile 4. Who was appointed as the Solicitor General of India on June 7, 2014? 1) Maninder Singh 2) Tushar Mehta 3) L. Nageshwar Rao 4) Ranjit Kumar 5) P.S. Narasimha 5. Which city will host the world chess championship from Nove-mber 7 to 28, 2014? 1) Oslo, Norway 2) Madrid, Spain 3) Sofia, Bulgaria 4) Helsinki, Finland 5) Sochi, Russia 6. Reuven Rivlin was elected as the President of which of the following countries on June 10, 2014? (He will take office on July 24, 2014) 1) Hungary 2) Iceland 3) Israel 4) Italy 5) Macedonia 7. Identify the mismatched pair? 1) Bank rate - 8% 2) Repo rate - 8% 3) Reverse repo rate -7 % 4) Cash reserve ratio - 4% 5) Statutory LiquidityRatio-22.5% 8. Identify the mismatched pair? Cabinet Minister Portfolio 1) Sadananda Gowda: Railways 2) Harsh Vardhan: Health and Family Welfare 3) Nitin Gadkari: Road Transport and Highways 4) Ananth Kumar: Chemicals and Fertilizers 5) Radha Mohan Singh: Food Processing Industries 9. N.R. Narayana Murthy stepped down as Executive Chairman of which of the following com-panies on June 14, 2014? 1) TCS 2) Cognizant 3) Infosys 4) Wipro 5) None of these 10. Which country's parliament passed a bill allowing euthanasia for terminally ill children with-out any age limit in February 2014? (It is the first country to remove any age limit on mercy killing) 1) Portugal 2) UK 3) Belgium 4) Denmark 5) Netherlands 11. Taishan Station was opened on February 8, 2014. It is the fourth Antarctic research station of? 1) South Korea 2) Japan 3) China 4) Russia 5) North Korea 12. Which of the following is not the name of a station in Antarctica? 1) Dakshin Gangotri 2) Maitri 3) Bharti 4) Great Wall 5) Prithvi 13. Who became the first Indian squash player to win the IMET Open in Bratislava, Slovakia in December 2013? 1) Ravi Dixit 2) Mahesh Mangaonkar 3) Harinder Pal Sandhu 4) Ramit Tandon 5) None of these 14. Which of the following Indian airlines tied up with Tigerair to increase connectivity between flights operated by both carriers? 1) GoAir 2) IndiGo 3) Jetkonnect 4) Kingfisher 5) SpiceJet 15. Abdiweli Sheikh Ahmed is the Prime Minister of? 1) Sudan 2) South Sudan 3) Somalia 4) Egypt 5) Ethiopia 16. The 27th South East Asian Ga-mes were held in December 2013 in? 1) Vietnam 2) Philippines 3) Thailand 4) Myanmar 5) Indonesia 17. The South East Asian Games is a biennial multi sporting event involving participants from the countries of South East Asia. Which country will host the 2015 South East Asian Games? 1) Singapore 2) Cambodia 3) Malaysia 4) Philippines 5) Brunei 18. India's first supersonic jet fighter was decommissioned after 50 years of service in December 2013. What is its name? 1) Boeing P-12 2) MIG-21 FL 3) Tejas 4) Hawker Hunter 5) IAR-15 19. The cabinet approved a free trade agreement (FTA) in trade and services with which of the follo-wing organizations in December 2013? 1) SAARC 2) APEC 3) ASEAN 4) SCO 5) BRICS 20. Which of the following has launched the world's most powerful star-surveying satellite Gaia into space from Kourou in French Guiana? 1) Mexican Space Agency 2) Iranian Space Agency 3) Israeli Space Agency 4) European Space Agency 5) South African National Space Agency 21. Tigerair is a low-cost airline headquartered in? 1) Singapore 2) Kuala Lumpur 3) Jakarta 4) Riyadh 5) Manama 22. European Space Agency is an in-ter governmental organization of 20 member States. It is head-quartered in? 1) London 2) Paris 3) Lisbon 4) Madrid 5) Berlin 23. The Centre has ruled out im-position of the Inner-Line Permit (ILP) system in which of the following States in December 2013? 1) Meghalaya 2) Assam 3) Tripura 4) Manipur 5) West Bengal 24. Inner Line Permit (ILP) is an official travel document issued by an empowered State government to allow inward travel of an Indian citizen into a protected or restricted area for a limited period. Currently ILP is in force in? 1) Arunachal Pradesh 2) Nagaland 3) Mizoram 4) Both 1 and 2 5) All 1, 2 and 3 25. The government has approved a proposal to increase foreign holding in which of the following banks to 62 percent from the current 49 percent? 1) ICICI Bank 2) Axis Bank 3) HDFC Bank 4) Yes Bank 5) IndusInd Bank 26. A committee, set up by the SEBI for reviewing insider trading norms, has submitted its report. The committee was headed by? 1) N.K. Sodhi 2) Nirmal Jain 3) Motilal Oswal 4) Milind Barve 5) None of these 27. Noted writer and journalist Kh-ushwant Singh passed away on March 20, 2014. Which one of the following books was not written by him? 1) Train to Pakistan 2) Truth, Love and a Little Malice 3) A History of the Sikhs 4) Delhi: a Novel 5) The Mountain of Light 28. The Asian Development Bank will provide $350 million loan for improving power transmission and distribution system in? 1) Bihar 2) Jharkhand 3) Chhattisgarh 4) M.P 5) None of these 29. The Reserve Bank of India has advised banks to treat a credit card account as a non performing asset if the customer fails to pay the minimum due amount within? 1) 30 days 2) 60 days 3) 90 days 4) 100 days 5) None of these 30. Which of the following would set up a Central Repository of Infor-mation on Large Credits (CRI-LC) to collect, store and diss-eminate credit data to lenders? 1) NHB 2) CRISIL 3) RBI 4) CARE 5) SEBI 31. According to the Motilal Oswal annual wealth creation study, which Indian company is the biggest wealth creator during the 2008-2013 period? 1) Tata Consultancy Services 2) ITC 3) HDFC Bank 4) Infosys 5) ICICI Bank 32. JIMEX is a bilateral maritime exercise between India and? 1) Germany 2) Jamaica 3) Jordan 4) Japan 5) None of these 33. Who became the Chief Executive of India unit of the world's largest retailer Wal-Mart in Janu ary 2014? 1) Ajay Nihalani 2) B.S. Nagesh 3) Krish Iyer 4) Aditya Nadkarni 5) None of these 34. M.V. Tanksale is the Chief Exe-cutive of the Indian Banks' Association. He is the former CMD of? 1) Bank of India 2) Union Bank of India 3) Indian Bank 4) Indian Overseas Bank 5) Central Bank of India 35. Which of the following is a step towards enhancing customer convenience through Anywhere Banking? 1) RTGS 2) NEFT 3) DICGC 4) CBS 5) BPLR KEY 1) 4 2) 2 3) 3 4) 4 5) 5 6) 3 7) 1 8) 5 9) 3 10) 3 11) 3 12) 5 13) 2 14) 5 15) 3 16) 4 17) 1 18) 2 19) 3 20) 4 21) 1 22) 2 23) 1 24) 5 25) 2 26) 1 27) 5 28) 4 29) 3 30) 3 31) 1 32) 4 33) 3 34) 5 35) 4