
అశ్వాపురం: అధికారులు, ఉద్యోగ సంఘాలు, ఉద్యోగులు సమన్వయంతో పనిచేసి మణుగూరు భారజల కర్మాగారం అభివృద్ధికి కృషి చేయాలని భారజల బోర్డు చైర్మన్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటీవ్ డాక్టర్ యూ.కామాచి ముదలి అన్నారు. బోర్డు చైర్మన్ రెండో రోజు మణుగూరు భారజల కర్మాగారం పరిధిలో విసృతంగా పర్యటించారు. శుక్రవారం ఉదయం భారజల కర్మాగారం అడ్మినిస్ట్రేటివ్ భవనంలో అధికారులతో సమావేశమై సమీక్ష జరిపారు. అనంతరం అశ్వాపురం మండలం అమ్మగారిపల్లిలో యాష్ ప్లాంటును, గౌతమీనగర్ కాలనీలోని అణుశక్తి కేంద్రీయ విద్యాలయంలో సైన్స్‌పార్క్‌ను, స్కూల్‌ను పరిశీలించారు.
ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. భారజల ఆస్పత్రిని సందర్శించి రోగులకు వైద్యం అందుతున్న పరిశీలించారు. వైద్యులతో సమావేశమై వైద్యం అందుతున్న తీరు, సిబ్బంది వివరాలు తెలుసుకున్నారు. సాయంత్రం భారజల కర్మాగార అతిథిగృహంలో అధికారులు, ఉద్యోగ సంఘాల నాయకులతో సమావేశమయ్యారు. భారజల కర్మాగారం ప్రతిష్టను మరింత పెంచాలన్నారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి శాయశక్తులా కృషి చేస్తానన్నారు. అనంతరం చైర్మన్ తన పర్యటనను ముగించుకుని హైదరాబాద్ వెళ్లారు. ఈ సమావేశంలో భారజల బోర్డు అసోసియేట్ డైరెక్టర్ పీకేఎం.పార్థిబన్, భారజల కర్మాగారం సీజీఎం జితేంద్ర శ్రీవాత్సవ, సీఏఓ జయకృష్ణ, డీజీఎంలు అరుణ్‌బోస్, ప్రసాద్, ఏడీఎంఓ నవీన్‌కుమార్, ఏపీఓ శ్రీనివాస్, ఉద్యోగ సంఘం గౌరవ అధ్యక్షుడు సీతారాములు, అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు విఠల్‌రావు, పోతురాజు శ్రీనివాసరావు, ఉపాధ్యక్షుడు కూరపాటి శ్రీనివాసరావుతో అసోసియేషన్ ప్రతినిధులు, ఇతర అధికారులు, సంఘాల నాయకులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment