దేశరాజధాని ఢిల్లీలో ఎన్నికల వేడి రాజుకుంది. బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్‌లు ప్రచారంలో వేర్వేరు వ్యూహాలను అనుసరిస్తున్నాయి. ఢిల్లీలో బీజేపీ ప్రచారాన్ని ప్రారంభించగా ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్టుకు నిరసన వ్యక్తం చేస్తూ ప్రదర్శనలకు దిగుతోంది.
దేశరాజధానిలో బీజేపీ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. మొత్తం ఏడు లోక్‌సభ స్థానాలకు మేనిఫెస్టోలను సిద్ధం చేయడానికి కసరత్తు చేస్తోంది. ఎన్నికల్లో విజయం సాధించేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది. అభ్యర్థులతో పాటు బీజేపీ నేతలు సభలు, పాదయాత్రలతో ఢిల్లీలో రాజకీయ వేడిని మరింతగా పెంచుతున్నారు. బీజేపీ రాష్ట్ర స్థాయి ఎన్నికల కార్యాలయాన్ని కూడా ప్రారంభించింది.
ఆమ్ ఆద్మీ పార్టీ ఎన్నికల ప్రచారం స్తబ్ధుగా మారింది. ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్టును వ్యతిరేకించడంపైనే పార్టీ దృష్టి పెట్టినట్లుంది. మరోవైపు ఈ నెల 31న రాంలీలా మైదాన్‌లో తలపెట్టిన ర్యాలీకి పార్టీ నేతలు, కార్యకర్తలు సన్నాహాలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుకు ముందు, పొత్తు ఒప్పందం కింద నాలుగు స్థానాలకు ఆప్ తన అభ్యర్థులను ప్రకటించింది.
లోక్‌సభ ఎన్నికలు ముంచుకొస్తున్నా ఢిల్లీలో మూడు స్థానాల్లో కాంగ్రెస్ తన అభ్యర్థుల పేర్లను ఇంకా ప్రకటించలేదు. మిగిలిన రెండు పార్టీలతో పోలిస్తే కాంగ్రెస్ ఎన్నికల సన్నాహాల్లో ఇంకా వెనుకబడి ఉంది. ప్రస్తుతం అభ్యర్థుల పేర్లను ఖరారు చేసే దిశగా పార్టీ కసరత్తు చేస్తోందని సమాచారం.
ఢిల్లీలో లోక్‌సభ స్థానాలు, అభ్యర్థుల వివరాలు
న్యూఢిల్లీ:
బసురి స్వరాజ్ (బీజేపీ)
సోమనాథ్ భారతి (ఆప్)
తూర్పు ఢిల్లీ:
హర్ష్ మల్హోత్రా (బీజేపీ)
కులదీప్ కుమార్ (ఆప్)
దక్షిణ ఢిల్లీ:
రాంవీర్ సింగ్ బిధూరి (బీజేపీ)
సహిరామ్(ఆప్)
పశ్చిమ ఢిల్లీ:
కమల్‌జిత్ సెహ్రావత్ (బీజేపీ)
మహాబల్ మిశ్రా (ఆప్)
ఈశాన్య ఢిల్లీ:
మనోజ్ తివారీ (బీజేపీ)
ప్రకటించలేదు (కాంగ్రెస్)
చాందినీ చౌక్:
ప్రవీణ్ ఖండేల్వాల్ (బీజేపీ)
ప్రకటించలేదు (కాంగ్రెస్)
వాయువ్య ఢిల్లీ:
యోగేంద్ర చందోలియా (బీజేపీ)
ప్రకటించలేదు (కాంగ్రెస్)
Comments
Please login to add a commentAdd a comment