
మాట్లాడుతున్న సీపీ డాక్టర్ రవీందర్
సాక్షి, వరంగల్ క్రైం: పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ వ్యూహంతో ముందుకు సాగాలని వరంగల్ పోలీస్ కమిషనర్ డాక్టర్ విశ్వనాథ రవీందర్ పిలుపునిచ్చారు. శనివారం కమిషనరేట్‌లో పోలీసు అధికారులతో నెలవారీ నేర సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ డాక్టర్ రవీందర్ మాట్లాడారు. ఎన్నికల నిర్వహణలో భాగంగా పోలీసు అధికారులు పోలీసుస్టేషన్‌ల పరిధిలో ఎన్ని పోలింగ్ కేంద్రాలు, పోలిం గ్ బూత్‌లు, పోలింగ్ స్టేషన్లు, రూట్లు తదితర వివరాలను అధికారులను తెలుసుకున్నారు.
ఎన్నికలకు అవసరమైన బందోబస్తు ఏర్పాట్ల గురించి అడిగారు. సమస్యాత్మక, అతిసమస్యాత్మక ప్రాంతాల్లో రక్షణ చర్యల ప్రణాళికలను సీపీ అధికారులకు వివరించారు. ఎన్నికల సందర్భంగా ముమ్మరంగా తనిఖీలు నిర్వహించడంతో పాటు పెట్రోలింగ్ కొనసాగించాలని, పోలీసు స్టేషన్ల పరిధిలో ఉన్న లైసెన్స్ తుపాకులను తక్షణమే స్వాధీనం చేసుకోవాలని సూచించారు. పోలీసు అధికారులు అన్ని పార్టీల నాయకులతో ఒకే రీతిగా వ్యవహరించాలని తెలిపారు.
ఎన్నికల ప్రచారానికి వచ్చే నాయకులకు భద్రత కల్పించే విషయంలో శ్రద్ధ పెట్టాలని చెప్పారు. ఎన్నికల విధులు నిర్వహించే అధికారులు, సిబ్బంది ఫాం–12, ఫాం–12ఏను వినియోగించుకొని విధులు నిర్వహించే ప్రదేశంలోనే ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు.
సైబర్ విభాగం బలోపేతం..
ఈ సందర్భంగా పోలీసు కమిషనర్ స్టేషన్‌ల వారీగా పోలీసు అధికారుల పనితీరుతోపాటు కేసుల నమోదు, çపరిష్కారం, నిందితుల అరెస్టు తదితర విషయాల వివరాలు తెలుసుకున్నారు. స్టేషన్ అధికారులు సిబ్బంది పనితీరుపై ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంతోపాటు పోలీసుశాఖకు చెడ్డపేరు తెచ్చేలా వ్యవహరించే సిబ్బందిని గుర్తించాలని సూచించారు. స్థానికంగా ఉన్న సమస్యలను పరిష్కరించడంలో అధికారులు వేగం పెంచాలని ఆదేశించారు.
ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి వ్యాపారం చేసే అపరిచిత వ్యక్తులను గుర్తించి వారు ప్రస్తుతం నివాసం ఉంటున్న ప్రదేశాలను తనిఖీ చేసి ఆధార్‌కార్డులను పరిశీలించాలన్నారు. రాబోవు రోజుల్లో సైబర్ క్రైం విభాగా న్ని మరింత బలోపే తం చేస్తామని తెలిపారు. సెల్‌ఫోన్, బైక్ చోరీల కు సంబంధించిన ఫిర్యాదులను స్వీకరించి నిందితులను గుర్తించేందుకు చొరవ చూపాల ని ఆదేశించార. డీసీపీలు వెంకట్‌రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, అదనపు డీసీపీ పూజ, ఏసీపీలు, ఇన్‌స్పెక్టర్లు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment