‘ఎఫ్‌ జెడ్‌’ సిరీస్‌లో 2 నూతన బైక్‌లు | Yamaha Motor India Targets 3 Lakh Sales For FZ V3.0 In 2019 | Sakshi
Sakshi News home page

‘ఎఫ్‌ జెడ్‌’ సిరీస్‌లో 2 నూతన బైక్‌లు

Published Tue, Jan 22 2019 12:47 AM | Last Updated on Tue, Jan 22 2019 12:47 AM

Yamaha Motor India Targets 3 Lakh Sales For FZ V3.0 In 2019 - Sakshi

న్యూఢిల్లీ: ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ కంపెనీ యమహా మోటార్‌ ఇండియా తన ఎఫ్‌ జెడ్‌ సిరీస్‌లో రెండు సరికొత్త బైక్‌లను సోమవారం మార్కెట్లో విడుదలచేసింది. ఎఫ్‌ జెడ్‌–ఎఫ్‌1, ఎఫ్‌జెడ్‌ఎస్‌–ఎఫ్‌1 పేర్లతో ఈ బైక్‌లను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది.

అధునాతన బ్రేకింగ్‌ వ్యవస్థ, యాంటీ–లాక్‌ బ్రేకింగ్‌ సిస్టమ్‌ (ఏబీఎస్‌).. 149 సీసీ 4–స్ట్రోక్, సింగిల్‌ సిలిండర్‌ ఇంజిన్‌ కలిగిన ఈ బైక్‌ల ధరల శ్రేణి రూ.95,000–రూ.97,000గా నిర్ణయించినట్లు కంపెనీ ప్రకటించింది.ఈ సందర్భంగా కంపెనీ చైర్మన్‌ మెటొఫుమీ షితార మాట్లాడుతూ.. ‘ఈ 2 నూతన బైక్‌ల విడుదల ద్వారా డీలక్స్‌ క్లాస్‌లో సంస్థ మార్కెట్‌ వాటా మరింత పెరగనుందని భావిస్తున్నాం’ అని పేర్కొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement