యమహా మోటార్ ఇండియా ఎంటీ సిరీస్‌లో మరో అధునాతన బైక్‌ను శుక్రవారం మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. ‘ఎంటీ–015’ పేరుతో విడుదలైన ఈ 155 సీసీ బైక్ ధర రూ.1.36 లక్షలు. లిక్విడ్ కూల్డ్ 4 స్ట్రోక్ ఇంజిన్, సింగిల్ చానల్ యాంటి–లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ఏబీఎస్), ఫ్యూయల్ ఇంజెక్టడ్ వేరియబుల్ వాల్వ్ యాక్చువేషన్ (వీబీఏ) ఫీచర్లుగా కంపెనీ తెలిపింది. ఈ ఏడాదిలో 60,000 యూనిట్లను విక్రయించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.
Comments
Please login to add a commentAdd a comment