యమహా కొత్త ‘వైజెడ్‌ఎఫ్‌–ఆర్‌3’ | Yamaha new Sports bike | Sakshi
Sakshi News home page

యమహా కొత్త ‘వైజెడ్‌ఎఫ్‌–ఆర్‌3’

Published Sat, Feb 10 2018 12:47 AM | Last Updated on Sat, Feb 10 2018 12:47 AM

Yamaha new Sports bike - Sakshi

గ్రేటర్‌ నోయిడా: యమహా మోటార్‌ ఇండియా తాజాగా తన స్పోర్ట్స్‌ బైక్‌ ‘వైజెడ్‌ఎఫ్‌–ఆర్‌3’లో అప్‌డేటెడ్‌ వెర్షన్‌ని మార్కెట్‌లో ఆవిష్కరించింది. దీని ధర రూ.3.48 లక్షలు (ఎక్స్‌షోరూమ్‌ ఢిల్లీ). ఇందులో 321 సీసీ ఫ్యూయెల్‌ ఇంజెక్టెడ్‌ 4 స్ట్రోక్‌ ఇంజిన్, డ్యూయెల్‌ చానల్‌ యాంటీ–లాక్‌ బ్రేకింగ్‌ సిస్టమ్‌ (ఏబీఎస్‌) వంటి పలు ప్రత్యేకతలున్నాయని కంపెనీ తెలిపింది.

గ్రేటర్‌ నోయిడాలో జరుగుతున్న 14వ ఎడిషన్‌ ఆటో ఎక్స్‌పో కార్యక్రమంలో బాలీవుడ్‌ స్టార్, యమహా బ్రాండ్‌ అంబాసిడర్‌ జాన్‌ అబ్రహం ఈ ‘వైజెడ్‌ఎఫ్‌–ఆర్‌3’ బైక్‌ని  ఆవిష్కరించారు. కాగా ఈ స్పోర్ట్స్‌ బైక్స్‌ ఎంపిక చేసిన యమహా డీలర్‌షిప్స్‌ వద్ద మాత్రమే వినియోగదారులకు అందుబాటులో
ఉండనున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement