యమహా అమ్మకాలు 17 శాతం అప్
హైదరాబాద్: టూవీలర్ దిగ్గజం యమహా మోటార్ ఇండియా అమ్మకాలు జూలై నెలలో జోరుగా ఉన్నాయి. గత ఏడాది జూలైలో 50,286గా ఉన్న తమ విక్రయాలు ఈ జూలైలో 17 శాతం వృద్ధితో 58,591కు పెరిగాయని యమహా మోటార్ ఇండియా ఒక ప్రకటనలో తెలిపింది. ఇటీవల తాము మార్కెట్లోకి తెచ్చిన 125 సీసీ సాల్యూటో బైక్‌కు , ఫాసినో స్కూటర్‌కు మంచి ఆదరణ లభిస్తోందని కంపెనీ వైస్ ప్రెసిడెంట్(సేల్స్, మార్కెటింగ్) రాయ్ కురియన్ పేర్కొన్నారు. వినియోగారుల అభిరుచులకనుగుణంగా మరిన్ని వినూత్నమైన మోడళ్లను అందిస్తామని కురియన్ పేర్కొన్నారు. అమ్మకాలు మరింత పెరుగుతాయన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.