ప్రముఖ బైక్ తయారీ సంస్థ 'డుకాటీ' సరికొత్త మల్టిస్ట్రాడా వీ2, వీ2 ఎస్ బైకులను లాంచ్ చేయడానికి సిద్ధమైంది. కంపెనీ ఈ బైకులను వచ్చే ఏడాది (2025) లాంచ్ చేయనున్నట్లు సమాచారం.
2025లో లాంచ్ కానున్న కొత్త డుకాటీ మల్టీస్ట్రాడా వీ2 బైక్.. దాని మునుపటి మోడల్స్ కంటే కూడా 18 కేజీల తక్కువ బరువుతో ఉంటుంది. ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 19 లీటర్లు. ఇందులోని 890 సీసీ ఇంజిన్ 115.6 హార్స్ పవర్, 92.1 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ స్లిప్పర్ క్లచ్ అండ్ బైడైరెక్షనల్ క్విక్‌షిఫ్టర్‌తో 6 స్పీడ్ గేర్‌బాక్స్ పొందుతుంది.
కొన్ని కాస్మొటిక్ అప్డేట్స్ కాకుండా డిజైన్, ఫీచర్స్ వంటివన్నీ రెండింటిలోనూ ఒకే విధంగా ఉన్నప్పటికీ.. ఎస్ వేరియంట్ ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ యూనిట్. ఈ బైక్ ముందు భాగంలో 120/70-ఆర్19 టైర్, వెనుక 170/60-ఆర్19 టైర్‌లు ఉన్నాయి. ఇందులో 320 మిమీ ఫ్రంట్ డిస్క్‌లు, వెనుక 265 మిమీ రియర్ డిస్క్ ఉన్నాయి.
మల్టీస్ట్రాడా వీ2 ట్రాక్షన్ కంట్రోల్, రైడింగ్ మోడ్‌లు, స్విచబుల్ డ్యూయల్ ఛానల్ ఏబీఎస్, పవర్ మోడ్‌లు, ఇంజిన్ బ్రేకింగ్ కంట్రోల్‌తో కూడిన సరికొత్త ఎలక్ట్రానిక్స్ వంటివన్నీ ఉన్నాయి. ఈ ఎలక్ట్రానిక్స్ అన్నీ 5 ఇంచెస్ టీఎఫ్‌టీ డిస్‌ప్లేలో కనిపిస్తాయి. ప్రస్తుతం కంపెనీ ఈ బైక్ ధరలను వెల్లడించలేదు. అయితే ధరలు రూ. 16 లక్షల కంటే ఎక్కువ ఉండొచ్చని సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment