
డుకాటి భారతదేశంలో 'డెజర్ట్‌ఎక్స్ డిస్కవరీ'ని లాంచ్ చేసింది. దీని ధర రూ. 21.78 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇది దాని మునుపటి అన్ని మోడల్స్ కంటే కూడా భిన్నంగా ఉంది. అయితే అడ్వెంచర్ చేయడానికి మాత్రం అద్భుతంగా ఉంది.
ఈ బైక్ స్టాండర్డ్, ర్యాలీ వేరియంట్లలో కూడా అందుబాటులో ఉంది. స్టాండర్డ్ డెజర్ట్ఎక్స్ ధర రూ. 18.33 లక్షలు కాగా, డెజర్ట్ఎక్స్ ర్యాలీ ధర రూ. 23.70 లక్షలు. డెజర్ట్‌ఎక్స్ డిస్కవరీ.. పెద్ద విండ్‌షీల్డ్, ప్యానియర్‌లు, ఇంజిన్, బాడీవర్క్ ప్రొటెక్షన్, సమ్ గార్డ్, రేడియేటర్ గ్రిల్ పొందుతుంది. అంతే కాకుండా ఈ బైక్ హీటెడ్ గ్రిప్‌లు, సెంటర్ స్టాండ్ వంటివి కూడా పొందుతుంది.
డుకాటి డెజర్ట్‌ఎక్స్ డిస్కవరీ.. 937 సీసీ ఎల్-ట్విన్ ఇంజిన్ పొందుతుంది. ఇది 9250 rpm వద్ద, 108 Bhp పవర్, 6500 rpm వద్ద 92 Nm టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి.. మంచి పర్ఫామెన్స్ అందిస్తుంది. ఈ బైక్ ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 21 లీటర్లు. కంపెనీ ఈ బైక్ కోసం బుకింగ్స్ స్వీకరించడం కూడా ప్రారంభించింది.
ఇదీ చదవండి: తక్కువ ధర.. ఎక్కువ సేఫ్టీ ఫీచర్స్: ఇదిగో బెస్ట్ కార్లు