ప్రముఖ వాహన తయారీ సంస్థ 'ట్రయంఫ్ మోటార్‌సైకిల్' (Triumph Motorcycle).. భారతదేశంలో రూ. 8.89 లక్షల (ఎక్స్ షోరూమ్) విలువైన 'స్పీడ్ ట్విన్ 900' (Speed Twin 900) లాంచ్ చేసింది. ఇది దాను మునుపటి అన్ని మోడల్స్ కంటే కూడా కొంత ఎక్కువ అప్డేట్స్ పొందినట్లు తెలుస్తోంది.
ట్రయంఫ్ స్పీడ్ ట్విన్ 900 బైకులో 900 సీసీ ప్యారలల్ ట్విన్ ఇంజన్ ఉంటుంది. ఇది 65 హార్స్ పవర్, 80 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 5 స్పీడ్ గేర్‌బాక్స్ ఆప్షన్ పొందుతుంది. ఈ అప్డేటెడ్ బైక్ లేటెస్ట్ యూరో 5 ప్లస్ నిబంధనలకు అనుగుణంగా ఉంది.
కొత్త ట్రయంఫ్ స్పీడ్ ట్విన్ 900 ఇప్పుడు ఎక్కువ బ్లాక్ అవుట్ ఎలిమెంట్స్ పొందుతుంది. ఇచ్చి చూడటానికి స్పీడ్ ట్విన్ 1200ని పోలి ఉంటుంది. అయితే ఇందులో యూఎస్డీ ఫ్రంట్ ఫోర్క్, బ్రాండెడ్ రేడియల్ కాలిపర్‌ను కలిగి ఉంది. ఈ బైక్ సీటు ఎత్తు 900 మిమీ వరకు ఉంది. సింగిల్-పాడ్ డిజి-అనలాగ్ డిస్‌ప్లే స్థానంలో TFT యూనిట్ ఉంటుంది.
ట్రయంఫ్ స్పీడ్ ట్విన్ 900 బైక్ ఇప్పుడు మూడు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. దీని డెలివరీలు 2025 జనవరిలో ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది. స్పీడ్ ట్విన్ 900 పర్ఫామెన్స్ కూడా ఉత్తమంగా ఉంటుందని భావిస్తున్నారు.
Your journey to making every ride exceptional begins here. The new Speed Twin 900 is priced from ₹ 8 89 000* /- Ex showroom Delhi.
Discover more: https://t.co/AUDQTKfjrc#SpeedTwin900 #MeetTheNewOriginal #MakeEveryRideExceptional #TriumphMotorcycles #ForTheRide pic.twitter.com/gMiAku7wtS— TriumphIndiaOfficial (@IndiaTriumph) December 23, 2024
Comments
Please login to add a commentAdd a comment