
సాక్షి, న్యూఢిల్లీ: మహీంద్ర అండ్ మహీంద్ర కొత్త వెహికల్‌ను లాంచ్ చేసింది. ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్( ఏఎంటీ) వెర్షన్ కాంపాక్ట్ ఎస్‌యూవీని మంగళవారం ఆవిష్కరించించింది. ఎఎమ్‌టి టెక్నాలజీ డబ్ల్యూ 8 (డీజిల్) ఎక్స్‌యూవీ 300 ధర ను రూ. 11. 5లక్షలు ( ఎక్స్-షో రూం, ఢిల్లీ)గా నిర్ణయించింది. అలాగే డబ్ల్యూ 8 (ఆప్షనల్) ట్రిమ్‌ను రూ.12.7 లక్షలుగా ఉంచింది.
1.5-లీటర్ టర్బో ఇంజిన్, ఎలక్ట్రానిక్ వేరియబుల్ జామెట్రీ టర్బోచార్జర్, 116.6 పీఎస్ ప్రధాన ఫీచర్లుగా ఉన్నాయి. 2019 ఫిబ్రవరిలో తీసుకొచ్చిన మాన్యువల్ వెర‍్షన్‌కు భారీ స్పందన రావడంతో తమ తాజా ఎక్స్‌యూవీ 300 వెహికల్‌కు కూడా అదే ఆదరణ లభించనుందనే ఆశాభావాన్ని ఎం అండ్ ఎం చీఫ్ సేల్స్ అండ్ మార్కెటింగ్ (ఆటోమోటివ్ డివిజన్) వీజయ్ రామ్ నక్రా వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment