ఢిల్లీ: దేశీ వాహన తయారీ కంపెనీ ‘మహీంద్రా అండ్ మహీంద్రా’ (ఎం అండ్ ఎం) తాజాగా తన ప్రముఖ కాంపాక్ట్ ఎస్‌యూవీ ‘ఎక్స్‌యూవీ 300’లో ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ (ఏఎంటీ) వెర్షన్‌ను మంగళవారం ఆవిష్కరించింది. ‘డబ్ల్యూ8’ పేరుతో అందుబాటులోకి వచ్చిన డీజిల్ ట్రిమ్ ధర రూ.11.5 లక్షలు (ఎక్స్–షోరూం, ఢిల్లీ) కాగా, ఆప్షనల్ ట్రిమ్ ధర రూ.12.7 లక్షలుగా కంపెనీ ప్రకటించింది. టెక్నాలజీ అభివృద్ధి చెందిన కారణంగా.. మునుపటి వెర్షన్‌తో పోల్చితే ధర రూ.55,000 పెరిగినట్లు వివరించింది. ఈ సందర్భంగా సంస్థ ఆటోమోటివ్ విభాగం చీఫ్ (సేల్స్ అండ్ మార్కెటింగ్) విజయ్ రామ్ నక్రా మాట్లాడుతూ.. ‘ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదలైన ఎక్స్‌యూవీ 300 మాన్యువల్ వెర్షన్‌కు వచ్చిన విశేష స్పందన చూశాక, ఆటోషిఫ్ట్‌ను విడుదల చేస్తే అమ్మకాలు మరింత పెరుగుతాయని నిర్ణయం తీసుకున్నాం. ఈ కారణంగానే నూతన వెర్షన్ అందుబాటులోకి వచ్చింది’ అని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment