AMT
-
‘ఎక్స్‌యూవీ 300’లో ఏఎంటీ వెర్షన్
ఢిల్లీ: దేశీ వాహన తయారీ కంపెనీ ‘మహీంద్రా అండ్ మహీంద్రా’ (ఎం అండ్ ఎం) తాజాగా తన ప్రముఖ కాంపాక్ట్ ఎస్యూవీ ‘ఎక్స్‌యూవీ 300’లో ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ (ఏఎంటీ) వెర్షన్‌ను మంగళవారం ఆవిష్కరించింది. ‘డబ్ల్యూ8’ పేరుతో అందుబాటులోకి వచ్చిన డీజిల్ ట్రిమ్ ధర రూ.11.5 లక్షలు (ఎక్స్–షోరూం, ఢిల్లీ) కాగా, ఆప్షనల్ ట్రిమ్ ధర రూ.12.7 లక్షలుగా కంపెనీ ప్రకటించింది. టెక్నాలజీ అభివృద్ధి చెందిన కారణంగా.. మునుపటి వెర్షన్‌తో పోల్చితే ధర రూ.55,000 పెరిగినట్లు వివరించింది. ఈ సందర్భంగా సంస్థ ఆటోమోటివ్ విభాగం చీఫ్ (సేల్స్ అండ్ మార్కెటింగ్) విజయ్ రామ్ నక్రా మాట్లాడుతూ.. ‘ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదలైన ఎక్స్‌యూవీ 300 మాన్యువల్ వెర్షన్‌కు వచ్చిన విశేష స్పందన చూశాక, ఆటోషిఫ్ట్‌ను విడుదల చేస్తే అమ్మకాలు మరింత పెరుగుతాయని నిర్ణయం తీసుకున్నాం. ఈ కారణంగానే నూతన వెర్షన్ అందుబాటులోకి వచ్చింది’ అని తెలిపారు. -
మహీంద్ర ఎక్స్‌యూవీ 300 (ఏఎంటీ) లాంచ్
సాక్షి, న్యూఢిల్లీ: మహీంద్ర అండ్ మహీంద్ర కొత్త వెహికల్‌ను లాంచ్ చేసింది. ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్( ఏఎంటీ) వెర్షన్ కాంపాక్ట్ ఎస్‌యూవీని మంగళవారం ఆవిష్కరించించింది. ఎఎమ్‌టి టెక్నాలజీ డబ్ల్యూ 8 (డీజిల్) ఎక్స్‌యూవీ 300 ధర ను రూ. 11. 5లక్షలు ( ఎక్స్-షో రూం, ఢిల్లీ)గా నిర్ణయించింది. అలాగే డబ్ల్యూ 8 (ఆప్షనల్) ట్రిమ్‌ను రూ.12.7 లక్షలుగా ఉంచింది. 1.5-లీటర్ టర్బో ఇంజిన్, ఎలక్ట్రానిక్ వేరియబుల్ జామెట్రీ టర్బోచార్జర్, 116.6 పీఎస్ ప్రధాన ఫీచర్లుగా ఉన్నాయి. 2019 ఫిబ్రవరిలో తీసుకొచ్చిన మాన్యువల్ వెర్షన్‌కు భారీ స్పందన రావడంతో తమ తాజా ఎక్స్‌యూవీ 300 వెహికల్‌కు కూడా అదే ఆదరణ లభించనుందనే ఆశాభావాన్ని ఎం అండ్ ఎం చీఫ్ సేల్స్ అండ్ మార్కెటింగ్ (ఆటోమోటివ్ డివిజన్) వీజయ్ రామ్ నక్రా వ్యక్తం చేశారు. -
టాటా ‘నెక్సాన్’లో ఆటోమేటిక్ వెర్షన్
ముంబై: ఏప్రిల్ నెల దేశీ వాహన విక్రయాల్లో 86 శాతం వృద్ధితో జోరు మీదున్న ప్రముఖ వాహన తయారీ కంపెనీ ‘టాటా మోటార్స్’ తాజాగా తన కాంపాక్ట్ ఎస్యూవీ ‘నెక్సాన్’లో ఆటోమేటిక్ వెర్షన్ ‘టాటా నెక్సాన్ హైపర్‌డ్రైవ్ ఎస్–ఎస్జీ’ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. ఇది 1.2 లీటర్ పెట్రోల్ వేరియంట్, 1.5 లీటర్ డీజిల్ వేరియంట్ రూపంలో కస్టమర్లకు అందుబాటులో ఉంటుంది. వీటి ధరలు వరుసగా రూ.9.41 లక్షలు, రూ.10.3 లక్షలుగా ఉన్నాయి. అన్ని ధరలూ ఎక్స్‌షోరూమ్ ఢిల్లీవి. కంపెనీ 2017 ఫిబ్రవరిలో నెక్సాన్ మోడల్‌ను మార్కెట్లో ఆవిష్కరించింది. టాటా నుంచి మార్కెట్లోకి వచ్చిన తొలి సబ్– 4 మీటర్ స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్ ఇది. కంపెనీ నెక్సాన్ మోడల్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చిన దగ్గరి నుంచి ఇప్పటి దాకా 30,000 యూనిట్లకు పైగా విక్రయించింది. బ్రాండ్‌ను మాత్రమే కాకుండా వినియోగదారుల ప్రాధాన్యాలను కూడా దృష్టిలో ఉంచుకొని ప్రొడక్టులను తీసుకురావాలని, సర్వీసులు అందించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు టాటా మోటార్స్ ప్రెసిడెంట్ (ప్యాసింజర్ వెహికల్స్ బిజినెస్ యూనిట్) మయాంక్ పరీఖ్ ఈ సందర్భంగా చెప్పారు. -
టాటా టియాగో ఆటోమేటెడ్ వెర్షన్
ధర రూ. 4.79 లక్షలు న్యూఢిల్లీ: ఆటోమొబైల్ సంస్థ టాటా మోటార్స్ తాజాగా ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ టెక్నాలజీ (ఏఎంటీ)తో టియాగో కారును ప్రవేశపెట్టింది. టియాగో ఎక్స్‌టీఏ వేరియంట్ ధర రూ. 4.79 లక్షలుగా ఉంటుందని సంస్థ పేర్కొంది. భారీ ట్రాఫిక్‌లోనూ, పార్కింగ్ సమయంలోనూ ఏఎంటీ టెక్నాలజీ గల కారు నడపడానికి అనువుగా ఉంటుందని టాటా మోటార్స్ హెడ్ (మార్కెటింగ్ ప్యాసింజర్ వెహికల్ వ్యాపార విభాగం) వివేక్ శ్రీవత్స తెలిపారు. ప్రస్తుతం తమ హ్యాచ్‌బ్యాక్ కార్ల విభాగంలో టియాగో అమ్మకాల వాటా దాదాపు 83 శాతం దాకా ఉంటుందని వివరించారు. దాదాపు 1 లక్ష పైగా బుకింగ్స్ రాగా.. 65,000 కార్లను ఇప్పటిదాకా కస్టమర్లకు అందించామని పేర్కొన్నారు. తమ ప్యాసింజర్ వెహికల్ వ్యాపార విభాగం మళ్లీ కోలుకోవడానికి టియాగో తోడ్పడిందని వివేక్ వివరించారు. -
టాటా టియాగో... ఆటోమేటిక్ వేరియంట్
ధర రూ.5.39 లక్షలు న్యూఢిల్లీ: టాటా మోటార్స్ కంపెనీ టియాగో మోడల్లో ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్(ఏఎంటీ) వేరియంట్, టాటా టియాగో ఈజీ షిఫ్ట్ ఏఎమ్టీను మార్కెట్లో విడుదల చేసింది. ఈ కారు ధర రూ.5.39 లక్షలు(ఎక్స్ షోరూమ్, ఢిల్లీ). దేశవ్యాప్తంగా ఉన్న తమ 597 సేల్స్ పాయింట్ల వద్ద ఈ టియాగో ఆటోమేటిక్ వేరియంట్ లభ్యమవుతుందని టాటా మోటార్స్ తెలిపింది. 1.2 లీటర్ మూడు–సిలిండర్ రెవోట్రాన్ పెట్రోల్ ఇంజిన్‌తో అందిస్తున్న ఈ కారులో నాలుగు గేర్ ఆప్షన్లు–ఆటోమేటిక్, న్యూట్రల్, రివర్స్, మాన్యువల్ ఉన్నాయని టాటా మోటార్స్ ప్రెసిడెంట్ (ప్యాసింజర్ వెహికల్స్ బిజినెస్ యూనిట్) మయాంక్ పరీక్ చెప్పారు.