టాటా టియాగో ఆటోమేటెడ్‌ వెర్షన్‌ | Tata Tiago AMT review: When life gives you traffic, just AMT | Sakshi
Sakshi News home page

టాటా టియాగో ఆటోమేటెడ్‌ వెర్షన్‌

Published Tue, Aug 22 2017 12:07 AM | Last Updated on Sun, Sep 17 2017 5:48 PM

టాటా టియాగో ఆటోమేటెడ్‌ వెర్షన్‌

టాటా టియాగో ఆటోమేటెడ్‌ వెర్షన్‌

ధర రూ. 4.79 లక్షలు
న్యూఢిల్లీ: ఆటోమొబైల్‌ సంస్థ టాటా మోటార్స్‌ తాజాగా ఆటోమేటెడ్‌ మాన్యువల్‌ ట్రాన్స్‌మిషన్‌ టెక్నాలజీ (ఏఎంటీ)తో  టియాగో కారును  ప్రవేశపెట్టింది. టియాగో ఎక్స్‌టీఏ వేరియంట్‌ ధర రూ. 4.79 లక్షలుగా ఉంటుందని సంస్థ పేర్కొంది. భారీ ట్రాఫిక్‌లోనూ, పార్కింగ్‌ సమయంలోనూ ఏఎంటీ టెక్నాలజీ గల కారు నడపడానికి అనువుగా ఉంటుందని టాటా మోటార్స్‌ హెడ్‌ (మార్కెటింగ్‌ ప్యాసింజర్‌ వెహికల్‌ వ్యాపార విభాగం) వివేక్‌ శ్రీవత్స తెలిపారు.

 ప్రస్తుతం తమ హ్యాచ్‌బ్యాక్‌ కార్ల విభాగంలో టియాగో అమ్మకాల వాటా దాదాపు 83 శాతం దాకా ఉంటుందని వివరించారు. దాదాపు 1 లక్ష పైగా బుకింగ్స్‌ రాగా.. 65,000 కార్లను ఇప్పటిదాకా కస్టమర్లకు అందించామని పేర్కొన్నారు. తమ ప్యాసింజర్‌ వెహికల్‌ వ్యాపార విభాగం మళ్లీ కోలుకోవడానికి టియాగో తోడ్పడిందని వివేక్‌ వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement