‘ఇవేం ఎలక్ట్రిక్‌ కార్లు’..దిగ్గజ ఎలక్ట్రిక్‌ కార్ల కంపెనీపై వాహనదారుల ఆగ్రహం! | Sakshi
Sakshi News home page

‘ఇవేం ఎలక్ట్రిక్‌ కార్లు’..దిగ్గజ ఎలక్ట్రిక్‌ కార్ల కంపెనీపై వాహనదారుల ఆగ్రహం!

Published Mon, Dec 25 2023 9:50 AM

West Bengal Man Receives Rs 12 Lakh Faulty Tata Tiago Ev Car - Sakshi

భారత్‌లో అత్యంత విలువైన బ్రాండ్‌గా తన స్థానాన్ని నిలబెట్టుకున్న టాటా గ్రూప్‌ తన వినియోగదారుల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటుంది. టాటా గ్రూప్ అనుబంధ సంస్థ టాటా మోటార్స్‌ తయారు చేసిన ఎలక్ట్రిక్‌ కార్ల మన్నిక విషయంలో లోపాలు తలెత్తడమే ఇందుకు కారణమంటూ పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. 

టాటా మోటార్స్‌ దేశీయ ఎలక్ట్రిక్‌ మార్కెట్‌లో మూడు ఈవీ కార్లను పరిచయం చేసింది. అందులో నెక్సాన్‌.ఈవీ, టియాగో.ఈవీ, టైగోర్‌.ఈవీ ఉండగా.. భారత్‌లో ఎక్కువగా అమ్ముడు పోతున్న ఎలక్ట్రిక్‌ కార్ల జాబితాలో తొలిస్థానాన్ని సంపాదించుకున్నాయి. 

అయితే మార్కెట్‌ డిమాండ్‌కు అనుగుణంగా టాటా మోటార్స్‌  ఈవీ కార్లును తయారు చేస్తుంది. ముందస్తు షెడ్యూల్‌ ప్రకారమే ఆ కార్లను కొనుగోలు దారులకు అందిస్తుంది. అదే సమయంలో కార్ల తయారీ, మన్నిక విషయంలో ఆ సంస్థ అప్రతిష్టను మూటగట్టుకుంటుందంటూ టాటా ఈవీ కొనుగోలు దారులు వాపోతున్నారు. 

కొద్ది రోజుల క్రితం నేను టాటా షోరూంలో టాటా నెక్సాన్‌ కారును కొనుగోలు చేశాను. ఆ కారులో అన్నీ లోపాలేనంటూ బెంగళూరు వాసి ఆవేదన వ్యక్తం చేశాడు. ఆ ఘటన మరిచిపోక ముందే వెస్ట్‌ బెంగాల్‌కు చెందిన మరో వాహన దారుడు టాటా టియాగో (Tata Tiago EV XZ Plus Tech LUX ) కొనుగోలుతో  ఊహించని పరిణామం ఎదురైంది. కారులు లోపాలు ఇలా ఉంటాయా? అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ సంబంధిత కారు ఫోటోల్ని సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ ఎక్స్‌.కామ్‌లో ఆ కార్ల ఫోటోల్ని షేర్‌ చేశాడు.

రూ.12 లక్షలు ఖర్చు చేస్తే ఇలాంటి కారును అందిస్తారా? అని ప్రశ్నించాడు. టాటా మోటార్స్‌ బహుమతి ఇదే. కారు తయారీ నాసిరకంగా ఉంది. ఈ కారును రూ.12లక్షలు పెట్టి కొనుగోలు చేశా. కానీ ఆ కారులో లోపాలున్నాయి. డ్రైవింగ్‌ చేసే సమయంలో శబ్ధాలు వినిపిస్తున్నాయి. ఆ శబ్ధం రాకుండా ఉండేలా కారు మొత్తాన్ని పార్ట్‌ పార్ట్‌లుగా విడదీసి ఇదిగో ఇలా వెల్డింగ్‌ చేస్తున్నానంటూ పోస్ట్‌ చేసిన ఫోటోలు నెటిజన్లను షాక్‌కు గురిచేస్తున్నాయి. దీనిపై పలువురు నెటిజన్లు టాటా మోటార్స్‌ కార్ల కొనుగోలుతో తమకు ఎదురైన ఇబ్బందుల్ని పంచుకుంటున్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement