Tata Tiago
-
అప్పుడు భారీ బుకింగ్స్.. ఇప్పుడు రికార్డ్ సేల్స్
ఎంజీ కామెట్ ఈవీ, సిట్రోయెన్ ఈసీ3 వంటి వాటికి ప్రత్యర్థిగా ఉన్న 'టాటా టియాగో ఈవీ' అమ్మకాల్లో అరుదైన మైలురాయిని చేరుకుంది. 50,000 యూనిట్ల అమ్మకాలతో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసిన టియాగో ఈవీ బ్రాండ్ ఎంట్రీ లెవెల్ మోడల్.సెప్టెంబర్ 2022లో ప్రారంభమైన టాటా టియాగో ఈవీ కేవలం 24 గంటల్లో 10,000 బుకింగ్స్ అందుకుంది. ఇప్పుడు అమ్మకాల్లో 50వేలు దాటేసింది. డెలివరీలు ప్రారంభమైన మొదటి నాలుగు నెలల కాలంలో 10వేల యూనిట్ల టియాగో ఈవీలను విక్రయించిన కంపెనీ మరో 17 నెలల్లో 40000 యూనిట్ల విక్రయాలను సాధించగలిగింది.ఇదీ చదవండి: స్కూటర్‌పై వచ్చి కిడ్నాప్.. అదానీ జీవితంలో భయంకర ఘటనటియాగో ఈవీ రెండు బ్యాటరీ ఆప్షన్స్ పొందుతుంది. ఒకటి 250 కిమీ రేంజ్ అందించే 19.2 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్, మరొకటి 315 కిమీ రేంజ్ అందించే 24 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్. ఈ ఎలక్ట్రిక్ కారు 55 కేడబ్ల్యుహెచ్ ఎలక్ట్రిక్ మోటారును పొందుతుంది. ప్రారంభం నుంచి మంచి అమ్మకాలను పొందుతున్న టాటా మోటార్స్ సరసమైన మోడల్ టాటా టియాగో ఈవీ ప్రారంభ ధరలు రూ. 7.99 లక్షలు (ఎక్స్ షోరూమ్). -
బంపర్ డిస్కౌంట్.. ఈ ఎలక్ట్రిక్ కారుపై రూ.2 లక్షల తగ్గింపు!
ఎలక్ట్రిక్ కార్ కొనాలనుకుంటున్నవారికి ఇది నిజంగా భారీ శుభవార్త. ప్రముఖ దేశీయ కార్ మేకర్ టాటా మోటర్స్ '2 మిలియన్ ఎస్యూవీ వేడుక'లో భాగంగా తమ ఈవీ పోర్ట్‌ఫోలియోలోని పలు వాహనాలపై బంపర్ డిస్కౌంట్లు ప్రకటించింది. పాపులర్ టాటా నెక్సాన్ ఈవీపై గరిష్టంగా రూ. 2.05 లక్షల వరకూ తగ్గింపు అందిస్తోంది.ఈ సెప్టెంబర్ నెలలో టాటా ఎలక్ట్రిక్ వాహనాలు కొనేవారికి భారీగా డబ్బు ఆదా కానుంది. టాటా మోటర్స్ ఈవీ పోర్ట్‌ఫోలియోలోని టాటా నెక్సాన్ ఈవీ (Tata Nexon EV), పంచ్ ఈవీ (Punch EV), టియాగో ఈవీ (Tiago EV)లపై గ్రీన్ బోనస్‌లో భాగంగా క్యాష్ డిస్కౌంట్లు అందిస్తోంది. 2023 మోడల్లను ఎంచుకునే వారికి అదనపు తగ్గింపు లభిస్తుంది.టాటా నెక్సాన్ ఈవీపై భారీ డిస్కౌంట్టాప్ స్పెక్స్ ఉండే టాటా నెక్సాన్ ఈవీ ఎంపవర్డ్+ లాంగ్ రేంజ్ వేరియంట్లపై ఈ నెలలో రూ. 1.80 లక్షల వరకు తగ్గింపును అందిస్తోంది టాటా మోటర్స్. రూ. 20,000 తగ్గింపుతో లభించే ఎంట్రీ-లెవల్ క్రియేటివ్ + ఎంఆర్ వేరియంట్ తప్ప మిగిలిన అన్ని వేరియంట్లు రూ. 1 లక్ష నుండి రూ. 1.2 లక్షల వరకూ తగ్గింపుతో అందుబాటులో ఉన్నాయి.2023లో తయారైన అన్ని మోడల్‌లపై అయితే రూ. 25,000 అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. టాటా నెక్సాన్ ఈవీ ధర రూ. 14.49 లక్షల నుండి రూ. 19.49 లక్షల మధ్య ఉంటుంది. ఇది రెండు బ్యాటరీ ఆప్షన్లతో వస్తుంది. కంపెనీ పేర్కొన్నదాని ప్రకారం.. 30kWh వేరియంట్ 275 కి.మీ, 40.5kWh యూనిట్ 390 కి.మీ. రేంజ్ ఇస్తాయి.ఇతర ఈవీలపైనా..ఇక టాటా మోటర్స్ డిస్కౌంట్ అందిస్తున్న ఇతర ఈవీలలో టాటా టియాగో ఈవీ, టాటా పంచ్ ఈవీ ఉన్నాయి. వీటిలో టాటా టియాగో ఈవీలపై గరిష్టంగా రూ.65,000, అలాగే టాటా పంచ్ ఈవీలపై రూ.30,000 వరకూ డిస్కౌంట్ లభిస్తోంది. -
‘ఇవేం ఎలక్ట్రిక్ కార్లు’..దిగ్గజ ఎలక్ట్రిక్ కార్ల కంపెనీపై వాహనదారుల ఆగ్రహం!
భారత్‌లో అత్యంత విలువైన బ్రాండ్‌గా తన స్థానాన్ని నిలబెట్టుకున్న టాటా గ్రూప్ తన వినియోగదారుల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటుంది. టాటా గ్రూప్ అనుబంధ సంస్థ టాటా మోటార్స్ తయారు చేసిన ఎలక్ట్రిక్ కార్ల మన్నిక విషయంలో లోపాలు తలెత్తడమే ఇందుకు కారణమంటూ పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. టాటా మోటార్స్ దేశీయ ఎలక్ట్రిక్ మార్కెట్లో మూడు ఈవీ కార్లను పరిచయం చేసింది. అందులో నెక్సాన్.ఈవీ, టియాగో.ఈవీ, టైగోర్.ఈవీ ఉండగా.. భారత్‌లో ఎక్కువగా అమ్ముడు పోతున్న ఎలక్ట్రిక్ కార్ల జాబితాలో తొలిస్థానాన్ని సంపాదించుకున్నాయి. అయితే మార్కెట్ డిమాండ్‌కు అనుగుణంగా టాటా మోటార్స్ ఈవీ కార్లును తయారు చేస్తుంది. ముందస్తు షెడ్యూల్ ప్రకారమే ఆ కార్లను కొనుగోలు దారులకు అందిస్తుంది. అదే సమయంలో కార్ల తయారీ, మన్నిక విషయంలో ఆ సంస్థ అప్రతిష్టను మూటగట్టుకుంటుందంటూ టాటా ఈవీ కొనుగోలు దారులు వాపోతున్నారు. కొద్ది రోజుల క్రితం నేను టాటా షోరూంలో టాటా నెక్సాన్ కారును కొనుగోలు చేశాను. ఆ కారులో అన్నీ లోపాలేనంటూ బెంగళూరు వాసి ఆవేదన వ్యక్తం చేశాడు. ఆ ఘటన మరిచిపోక ముందే వెస్ట్ బెంగాల్‌కు చెందిన మరో వాహన దారుడు టాటా టియాగో (Tata Tiago EV XZ Plus Tech LUX ) కొనుగోలుతో ఊహించని పరిణామం ఎదురైంది. కారులు లోపాలు ఇలా ఉంటాయా? అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ సంబంధిత కారు ఫోటోల్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్.కామ్‌లో ఆ కార్ల ఫోటోల్ని షేర్ చేశాడు. A gift from Tata Motors. A underprepared Tiago EV XZPLUS TECHLUX car from Tata Motors. Paid twelve lac rupees to get this luxury car but got a faulty one with major manufacturing defects. Service center spot welded to stop the cranking noise from the car. But all in vein. pic.twitter.com/TwFHttAQEz — Chitrabhanu Pathak (@ChitrabhanuPath) December 20, 2023 రూ.12 లక్షలు ఖర్చు చేస్తే ఇలాంటి కారును అందిస్తారా? అని ప్రశ్నించాడు. టాటా మోటార్స్ బహుమతి ఇదే. కారు తయారీ నాసిరకంగా ఉంది. ఈ కారును రూ.12లక్షలు పెట్టి కొనుగోలు చేశా. కానీ ఆ కారులో లోపాలున్నాయి. డ్రైవింగ్ చేసే సమయంలో శబ్ధాలు వినిపిస్తున్నాయి. ఆ శబ్ధం రాకుండా ఉండేలా కారు మొత్తాన్ని పార్ట్ పార్ట్‌లుగా విడదీసి ఇదిగో ఇలా వెల్డింగ్ చేస్తున్నానంటూ పోస్ట్ చేసిన ఫోటోలు నెటిజన్లను షాక్‌కు గురిచేస్తున్నాయి. దీనిపై పలువురు నెటిజన్లు టాటా మోటార్స్ కార్ల కొనుగోలుతో తమకు ఎదురైన ఇబ్బందుల్ని పంచుకుంటున్నారు. -
రూ.15 లక్షలలో రాబోతున్న టాప్ ఎలక్ట్రిక్ కార్లు ఇవే!
ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల చూస్తే.. సామాన్యుడు బయటకి వెళ్లాలంటే బయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. పెట్రోల్, డీజిల్ ధరల ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇలాంటి సందర్భంలో ఎలక్ట్రిక్ వాహన కంపెనీలు తమకు వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుంటున్నాయి. నిన్న, మొన్న మొన్నటి వరకు ఎలక్ట్రిక్ వాహనాలు అంటే.. అమ్మో అనే ప్రజలు నేడు వాటి కొనుగోళ్లవైపు ఆసక్తి కనబరుస్తున్నారు. అలాగే, కాలం కలిసి రావడం వల్ల ఎలక్ట్రిక్ వాహన ధరలు కూడా భారీగా తగ్గుతున్నాయి. ఇప్పటికే మార్కెట్లో ఎలక్ట్రిక్ స్కూటర్లు, ఎలక్ట్రిక్ బైక్స్, ఎలక్ట్రిక్ కార్లు సందడి చేస్తున్నాయి. పెద్ద పెద్ద కంపెనీలు సైతం ఎలక్ట్రిక్ వాహనాల తయారీపై దృష్టి పెట్టాయి. అందుకే, త్వరలో రూ.15 లక్షల లోపు రాబోయే కార్ల గురుంచి ఒకసారి మనం కూడా తెలుసుకుందాం.. 1. టాటా టియాగో ఈవీ భారతదేశంలో టాటా మోటార్స్ ఎలక్ట్రిక్ కార్ల తయారీ పోర్ట్ ఫోలియోను విస్తరిస్తుంది. అందులో భాగంగానే భవిష్యత్‌లో లాంచ్ చేయబోయే ఎలక్ట్రిక్ కార్లలో టియాగో హ్యాచ్ బ్యాక్ కారు ఒకటి అని సమాచారం. టాటా టియాగో గురుంచి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కొన్ని మార్పులతో మినహా అదేవిధంగా టాటా టియాగో ఎలక్ట్రిక్ కారును త్వరలో మార్కెట్లోకి తీసుకొని రావాలని చూస్తుంది. దీని ధర ₹6.5 లక్షలకు సమీపంలో ఉంటుందని అంచనా.(చదవండి: పాక్ జిమ్మిక్కు.. తాలిబన్లకే టోకరా!) 2. టాటా ఆల్ట్రోజ్ ఈవీ ఆల్ట్రోజ్ హ్యాచ్ బ్యాక్ ఎలక్ట్రిక్ కారును ఈ ఏడాది చివరలో తీసుకొనిరావాలి చూస్తున్నట్లు సమాచారం. అయితే, రాబోయే ఈవి స్పెసిఫికేషన్లను కంపెనీ ఇంకా వెల్లడించలేదు. ఏదేమైనా, టాటా ఆల్ట్రోజ్ ఈవి కూడా కంపెనీ జిప్ట్రాన్ పవర్ ట్రైన్ టెక్నాలజీతో రావచ్చు అని చెప్పవచ్చు. ఈ రాబోయే ఈవి బ్యాటరీ 250 కిలోమీటర్ల నుంచి 300 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుందని కంపెనీ గతంలో తెలిపింది. టాటా ఆల్ట్రోజ్ ఈవీ ధర ₹10.5 లక్షల నుంచి ₹12.5 లక్షల వరకు ఉంటుందని అంచనా.(చదవండి: బిగ్ ‘సి’ దసరా పండుగ ఆఫర్లు) 3. మహీంద్రా ఈకెయువి100 ఆటో ఎక్స్ పో 2020 గుర్తుందా? ఈ ఎక్స్ పోలో మహీంద్రా ఈకెయువి100 ధరను వెల్లడించింది. ఆ సమయంలో మహీంద్రా & మహీంద్రా ఈకెయువి100 ధర ₹8.25 లక్షల(ఎక్స్ షోరూమ్) నుంచి ప్రారంభమవుతుందని తెలిపింది. త్వరలో రాబోయే మహీంద్రా ఈకెయువి100 లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్, 54 బిహెచ్పి, 120 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేసే ఎలక్ట్రిక్ మోటార్‌తో రానుంది. మహీంద్రా ఈకెయువి100 సింగిల్ ఛార్జ్ పై 147 కిలోమీటర్ల డ్రైవింగ్ రేంజ్ కలిగి ఉంటుంది. దీనిని ఒక గంటలో 80 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చు.(చదవండి: ఇక తగ్గేదె లే అంటున్న టాటా మోటార్స్!) 4. మహీంద్రా ఈఎక్స్ యువి300 వచ్చే సంవత్సరంలోగా మనం చూడబోయే మరో మహీంద్రా ఈవీ కారు మహీంద్రా ఈఎక్స్‌యువి300. దీనిని కూడా ఆటో ఎక్స్ పో 2020లో ప్రదర్శించారు. ఈఎక్స్‌యువి300 ఎలక్ట్రిక్ రెండు బ్యాటరీ ఆప్షన్లతో రానుంది. చిన్న బ్యాటరీ మోడల్ ఛార్జ్ చేస్తే సుమారు 300 కిలోమీటర్ల డ్రైవింగ్ వెళ్లనుంది. అలాగే, మహీంద్రా ఈఎక్స్ యువి300 లాంగ్ రేంజ్ మోడల్ ఛార్జ్ చేసిన ప్రతిసారీ సుమారు 400 కిలోమీటర్ల డ్రైవింగ్ రేంజ్ కలిగి ఉంటుంది. భారతదేశంలో మహీంద్రా ఈఎక్స్ యువి300 కారు ధరలు సుమారు ₹12.5 లక్షల వద్ద ప్రారంభమవుతాయని అంచనా. -
టియాగో@2 లక్షలు
న్యూఢిల్లీ: టాటా టియాగో అమ్మకాలు 2 లక్షల మైలురాయిని చేరాయి. ఈ కారును 2016, ఏప్రిల్‌లో మార్కెట్లోకి తెచ్చామని, ఇటీవలే మూడేళ్లలోపే 2 లక్షల విక్రయాలు సాధించామని టాటా మోటార్స్ ప్రెసిడెంట్ (ప్యాసింజర్ వెహికల్స్ బిజినెస్ యూనిట్) మయాంక్ పరీక్ చెప్పారు. ఈ మోడల్‌ను మార్కెట్లోకి తెచ్చి మూడేళ్లు అవుతున్నప్పటికీ, మంచి వృద్ధి సాధిస్తోందని పేర్కొన్నారు. ఇలాంటి ఘనత సాధించిన కొన్ని హ్యాచ్‌బ్యాక్ మోడళ్లలో ఇది కూడా ఒకటని వివరించారు. మొత్తం 2 లక్షల విక్రయాల్లో 1.7 లక్షల వరకూ పెట్రోల్ వేరియంట్లే అమ్ముడవడం విశేషం. టియాగో కారు పెట్రోల్, డీజిల్ వేరియంట్లలో లభిస్తోంది. మొత్తం 22 వేరియంట్లలలో లభిస్తున్న ఈ వాహనం ధరలు రూ.4.20 లక్షల నుంచి రూ.6.49 లక్షలు (ఎక్స్ షోరూమ్, ఢిల్లీ) రేంజ్లో ఉన్నాయి. ఈ కారు మారుతీ వ్యాగన్ఆర్, మారుతీ సెలెరియో, హ్యుందాయ్ శాంత్రో, డాట్సన్ గోలకు గట్టిపోటీనిస్తోంది. -
టాటా టియాగో ఆటోమేటెడ్ వెర్షన్
ధర రూ. 4.79 లక్షలు న్యూఢిల్లీ: ఆటోమొబైల్ సంస్థ టాటా మోటార్స్ తాజాగా ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ టెక్నాలజీ (ఏఎంటీ)తో టియాగో కారును ప్రవేశపెట్టింది. టియాగో ఎక్స్‌టీఏ వేరియంట్ ధర రూ. 4.79 లక్షలుగా ఉంటుందని సంస్థ పేర్కొంది. భారీ ట్రాఫిక్‌లోనూ, పార్కింగ్ సమయంలోనూ ఏఎంటీ టెక్నాలజీ గల కారు నడపడానికి అనువుగా ఉంటుందని టాటా మోటార్స్ హెడ్ (మార్కెటింగ్ ప్యాసింజర్ వెహికల్ వ్యాపార విభాగం) వివేక్ శ్రీవత్స తెలిపారు. ప్రస్తుతం తమ హ్యాచ్‌బ్యాక్ కార్ల విభాగంలో టియాగో అమ్మకాల వాటా దాదాపు 83 శాతం దాకా ఉంటుందని వివరించారు. దాదాపు 1 లక్ష పైగా బుకింగ్స్ రాగా.. 65,000 కార్లను ఇప్పటిదాకా కస్టమర్లకు అందించామని పేర్కొన్నారు. తమ ప్యాసింజర్ వెహికల్ వ్యాపార విభాగం మళ్లీ కోలుకోవడానికి టియాగో తోడ్పడిందని వివేక్ వివరించారు. -
టాటా టియాగో... ఆటోమేటిక్ వేరియంట్
ధర రూ.5.39 లక్షలు న్యూఢిల్లీ: టాటా మోటార్స్ కంపెనీ టియాగో మోడల్లో ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్(ఏఎంటీ) వేరియంట్, టాటా టియాగో ఈజీ షిఫ్ట్ ఏఎమ్టీను మార్కెట్లో విడుదల చేసింది. ఈ కారు ధర రూ.5.39 లక్షలు(ఎక్స్ షోరూమ్, ఢిల్లీ). దేశవ్యాప్తంగా ఉన్న తమ 597 సేల్స్ పాయింట్ల వద్ద ఈ టియాగో ఆటోమేటిక్ వేరియంట్ లభ్యమవుతుందని టాటా మోటార్స్ తెలిపింది. 1.2 లీటర్ మూడు–సిలిండర్ రెవోట్రాన్ పెట్రోల్ ఇంజిన్‌తో అందిస్తున్న ఈ కారులో నాలుగు గేర్ ఆప్షన్లు–ఆటోమేటిక్, న్యూట్రల్, రివర్స్, మాన్యువల్ ఉన్నాయని టాటా మోటార్స్ ప్రెసిడెంట్ (ప్యాసింజర్ వెహికల్స్ బిజినెస్ యూనిట్) మయాంక్ పరీక్ చెప్పారు.