టియాగో@2 లక్షలు | Tata Tiago sales cross 2 L since launch – Best selling Tata in India | Sakshi
Sakshi News home page

టియాగో@2 లక్షలు

Published Sat, Feb 16 2019 12:31 AM | Last Updated on Sat, Feb 16 2019 12:31 AM

Tata Tiago sales cross 2 L since launch – Best selling Tata in India - Sakshi

న్యూఢిల్లీ: టాటా టియాగో అమ్మకాలు 2 లక్షల మైలురాయిని చేరాయి. ఈ కారును 2016, ఏప్రిల్‌లో మార్కెట్లోకి తెచ్చామని, ఇటీవలే మూడేళ్లలోపే 2 లక్షల విక్రయాలు సాధించామని టాటా మోటార్స్‌ ప్రెసిడెంట్‌ (ప్యాసింజర్‌ వెహికల్స్‌ బిజినెస్‌ యూనిట్‌) మయాంక్‌ పరీక్‌ చెప్పారు. ఈ మోడల్‌ను మార్కెట్లోకి తెచ్చి మూడేళ్లు అవుతున్నప్పటికీ,   మంచి వృద్ధి సాధిస్తోందని పేర్కొన్నారు. ఇలాంటి ఘనత సాధించిన కొన్ని హ్యాచ్‌బ్యాక్‌ మోడళ్లలో ఇది కూడా ఒకటని వివరించారు.

మొత్తం 2 లక్షల  విక్రయాల్లో 1.7 లక్షల వరకూ పెట్రోల్‌   వేరియంట్లే అమ్ముడవడం విశేషం. టియాగో  కారు పెట్రోల్, డీజిల్‌ వేరియంట్లలో లభిస్తోంది. మొత్తం 22 వేరియంట్లలలో లభిస్తున్న ఈ వాహనం ధరలు రూ.4.20 లక్షల నుంచి      రూ.6.49 లక్షలు (ఎక్స్‌ షోరూమ్, ఢిల్లీ) రేంజ్‌లో ఉన్నాయి. ఈ కారు మారుతీ వ్యాగన్‌ఆర్, మారుతీ సెలెరియో, హ్యుందాయ్‌ శాంత్రో, డాట్సన్‌ గోలకు గట్టిపోటీనిస్తోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement