కొత్త కారు కొనేవారికి శుభవార్త.. మహీంద్రా కార్లపై భారీగా డిస్కౌంట్‌ | Mahindra Discounts up to RS 2 Lakh Above on Mahindra XUV500 | Sakshi
Sakshi News home page

కొత్త కారు కొనేవారికి శుభవార్త.. మహీంద్రా కార్లపై భారీగా డిస్కౌంట్‌

Published Wed, Aug 11 2021 8:25 PM | Last Updated on Wed, Aug 11 2021 10:27 PM

Mahindra Discounts up to RS 2 Lakh Above on Mahindra XUV500 - Sakshi

మీరు కొత్త కారు కొనాలని చూస్తున్నారా..? అయితే మీకో శుభవార్త. కొనుగోలు దారులకు మహీంద్రా & మహీంద్రా బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. ఈ నెలలో కొన్ని కార్లపై రూ.2,50,000 వరకు డిస్కౌంట్ అందిస్తుంది. దేశంలో అతిపెద్ద ఆటోమొబైల్ కంపెనీ మహీంద్రా ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడమే కాకుండా ఎన్నో ఆఫర్లను అందుబాటులోకి తీసుకువస్తోంది. తాజాగా మహీంద్రా తన కంపెనీ వాహనాలపై భారీగా ఆఫర్లను ప్రకటించింది. కొనుగోలుదారులు క్యాష్ డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్ బోనస్, కార్పొరేట్ డిస్కౌంట్, కాంప్లిమెంటరీ యాక్ససరీల రూపంలో ప్రయోజనాలను పొందవచ్చు.

  • మహీంద్రా ఎక్స్‌యువి 500 కారును మీరు కొనుగోలు చేస్తే మీకు రూ.1.79 లక్షల వరకు నగదు డిస్కౌంట్, రూ.50,000 ఎక్స్ఛేంజ్ బోనస్, రూ.6,500 కార్పొరేట్ డిస్కౌంట్, రూ.20,000 విలువైన యాక్ససరీలతో పొందవచ్చు. 
  • మహీంద్రా స్కార్పియోను కొనుగోలు చేస్తే రూ.15,000 ఎక్స్ఛేంజ్ బోనస్, రూ.4,500 కార్పొరేట్ డిస్కౌంట్ యాక్ససరీల రూపంలో రూ.17,000 వరకు ఆఫర్ చేసింది.
  • మహీంద్రా మరాజోను కొనుగోలుచేస్తే రూ.20,000 వరకు క్యాష్ డిస్కౌంట్, రూ.15,000 ఎక్స్ఛేంజ్ బోనస్, కార్పొరేట్ డిస్కౌంట్ రూ.5,200 లభిస్తుంది. 
  • మహీంద్రా ఎక్స్‌యువి 300 కారు కొంటె రూ.10,480 వరకు నగదు డిస్కౌంట్, రూ.25,000 ఎక్స్ఛేంజ్ బోనస్, రూ.4,000 కార్పొరేట్ డిస్కౌంట్, రూ.5,000 విలువైన యాక్ససరీలను ఆఫర్ చేస్తుంది. 
  • మహీంద్రా బొలెరో కారు కొంటె రూ.3,500 నగదు డిస్కౌంట్, రూ.10,000 ఎక్స్ఛేంజ్ బోనస్, రూ.3,000 కార్పొరేట్ డిస్కౌంట్, కాంప్లిమెంటరీగా నాలుగో సంవత్సరం వారెంటీని అందిస్తుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement