XUV500 sports utility vehicle
-
మహీంద్రా ఎక్స్‌యూవీ 700 జావెలిన్ ఎడిషన్! ఎవరి కోసం?
సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్‌గా ఉంటూ సమాకాలిన అంశాలపై స్పందించే బిజినెస్ టైకూన్ ఆనంద్ మహీంద్రా మరోసారి తన పెద్ద మనసు చాటుకున్నారు. పారా ఒలింపిక్స్‌లో జావెలిన్ త్రోలో ఇండియాకు స్వర్ణపతకం సాధించిన సుమిత్ అంటిల్‌కి సరికొత్త మహీంద్రా ఎక్స్‌యూవీ 700 బహుమతిగా ఇస్తానంటూ ప్రకటించారు. అంతేకాదు సుమిత్ అంటిల్ అవసరాలకు తగ్గట్టుగా దాన్ని ప్రత్యేకంగా జావెలిన్ త్రో ఎడిషన్‌గా తయారు చేయాలంటూ కంపెనీ ప్రతినిధులకు సూచించారు. పారా ఒలింపిక్స్‌లో ఎటువంటి అంచనాలు లేకుండా బరిలో దిగి బంగారు పతకం సాధించిన సుమిత్ అంటిల్ ప్రతిభను ఆయన కొనియాడారు. అంతకు ముందు ఇదే పారా ఒలింపిక్స్‌లో షూటింగ్ విభాగంలో స్వరం సాధించిన భారత మహిళా షూటర్ అవని లేఖరాకు కూడా ఎక్స్‌యూవీ 700ను బహుమతిగా అందిస్తానంటూ ఆనంద్ మహీంద్రా ప్రకటించారు జావెలిన్ ఎడిషన్ పారా ఒలింపియన్ దీపా మాలిక్ ఇటీవల తనకు ఎస్యూవీ కార్లు నడపడం అంటే చాలా ఇష్టమనీ పేర్కొన్నారు. తన లాంటి ప్రత్యేక ఎబిలిటీ ఉన్న వారి కోసం ప్రత్యేకంగా కార్లను తయారు చేయాలంటూ భారతీయ ఆటోమొబైల్ దిగ్గజాలను కోరారు. వీటికి స్పందించిన ఆనంద్ మహీంద్రా, ఈ ఒలింపిక్‌లో గోల్డ్ మెడల్ సాధించిన వారి కోసం కారును బహుమతిగా ఇవ్వడమే కాకుండా వారి అవసరాలకు తగ్గట్టుగా ప్రత్యేకంగా తయారు చేయిస్తున్నారు. అందులో భాగంగానే జావెలిన్‌త్రో విజయం సాధించిన సుమిత్ అంటిల్ కోసం ప్రత్యేకంగా తయారు చేస్తోన్న ఎక్స్‌యూవీకి జావెలిన్ ఎడిషన్‌గా ఆయన పేర్కొన్నారు. ప్రత్యేక ఏర్పాట్లు జావెలిన్ త్రోలో స్వరం సాధించిన సుమిత్ అంటిల్ కృత్రిమ కాలు అమర్చుకుని సాధాన చేసేవాడు. ఈ సమయంలో ఫాంటమ్ లింబ్ పెయిన్’ అనే తీవ్రమైన నొప్పితో అల్లాడిపోయే వాడు. కొన్నిసార్లు వేడి వల్ల లోపలి భాగం (లైనర్) నుంచి రక్తం కూడా కారుతున్నా ఆ బాధ తట్టుకుంటూ ప్రాక్టీస్ చేశాడు. చివరికి అద్భుతమైన ఫలితం సాధించాడు. కారు నడిపే సమయంలో ఫాంటమ్ లింబ్ పెయిన్ రాకుండా జావెలిన్ ఎడిషన్ లో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోనున్నారు. జావెలిన్ విషయానికి వస్తే సుమిత్ కంటే ముందు టోక్యో ఒలింపిక్స్‌లో నీరజ్ చోప్డా సైతం బంగారు పతకం సాధించాడు. An awesome sporting feat. Without exception. His performance demands an XUV 7OO. India now has TWO Golds in this ancient sport. @BosePratap Please design another Javelin edition of the XUV 7OO that we will be privileged to gift this incredible sportsperson. 👏🏽👏🏽👏🏽 https://t.co/DA22MG1pIF — anand mahindra (@anandmahindra) August 30, 2021 చదవండి : మేరీకోమ్‌కు ఖరీదైన కారు గిఫ్ట్‌గా -
మహీంద్రా ఎక్స్‌యూవీ700 @ రూ.11.99 లక్షలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా నుంచి కొత్త ఎస్యూవీ ఎక్స్‌యూవీ700 మార్కెట్లోకి అడుగుపెట్టింది. ఎక్స్‌షోరూంలో ధర రూ.11.99 లక్షల నుంచి ప్రారంభం. డీజిల్, పెట్రోల్ వేరియంట్లలో మాన్యువల్, ఆటోమేటిక్ ఆప్షన్స్‌తో 5, 7 సీట్ల సామర్థ్యంతో వాహనాన్ని రూపొందించారు. వేరియంట్‌నుబట్టి స్మార్ట్ డోర్ హ్యాండిల్స్, స్కైరూఫ్, కర్టెయిన్ ఎయిర్‌బ్యాగ్స్, డ్రైవర్ డ్రౌజినెస్ అలర్ట్, స్మార్ట్ క్లీన్ జోన్, అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్, సైడ్ ఎయిర్‌బ్యాగ్స్, మెమరీతో 6–వే పవర్ సీట్, సీక్వెన్షియల్ టర్న్ ఇండికేటర్స్, బ్లైండ్ వ్యూ మానిటరింగ్, ఎల్రక్టానిక్ పార్క్ బ్రేక్, వైర్లెస్ చార్జింగ్, 360 సరౌండ్ వ్యూ వంటి హంగులు ఉన్నాయి. -
కొత్త కారు కొనేవారికి శుభవార్త.. మహీంద్రా కార్లపై భారీగా డిస్కౌంట్
మీరు కొత్త కారు కొనాలని చూస్తున్నారా..? అయితే మీకో శుభవార్త. కొనుగోలు దారులకు మహీంద్రా & మహీంద్రా బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఈ నెలలో కొన్ని కార్లపై రూ.2,50,000 వరకు డిస్కౌంట్ అందిస్తుంది. దేశంలో అతిపెద్ద ఆటోమొబైల్ కంపెనీ మహీంద్రా ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడమే కాకుండా ఎన్నో ఆఫర్లను అందుబాటులోకి తీసుకువస్తోంది. తాజాగా మహీంద్రా తన కంపెనీ వాహనాలపై భారీగా ఆఫర్లను ప్రకటించింది. కొనుగోలుదారులు క్యాష్ డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్ బోనస్, కార్పొరేట్ డిస్కౌంట్, కాంప్లిమెంటరీ యాక్ససరీల రూపంలో ప్రయోజనాలను పొందవచ్చు. మహీంద్రా ఎక్స్యువి 500 కారును మీరు కొనుగోలు చేస్తే మీకు రూ.1.79 లక్షల వరకు నగదు డిస్కౌంట్, రూ.50,000 ఎక్స్ఛేంజ్ బోనస్, రూ.6,500 కార్పొరేట్ డిస్కౌంట్, రూ.20,000 విలువైన యాక్ససరీలతో పొందవచ్చు. మహీంద్రా స్కార్పియోను కొనుగోలు చేస్తే రూ.15,000 ఎక్స్ఛేంజ్ బోనస్, రూ.4,500 కార్పొరేట్ డిస్కౌంట్ యాక్ససరీల రూపంలో రూ.17,000 వరకు ఆఫర్ చేసింది. మహీంద్రా మరాజోను కొనుగోలుచేస్తే రూ.20,000 వరకు క్యాష్ డిస్కౌంట్, రూ.15,000 ఎక్స్ఛేంజ్ బోనస్, కార్పొరేట్ డిస్కౌంట్ రూ.5,200 లభిస్తుంది. మహీంద్రా ఎక్స్యువి 300 కారు కొంటె రూ.10,480 వరకు నగదు డిస్కౌంట్, రూ.25,000 ఎక్స్ఛేంజ్ బోనస్, రూ.4,000 కార్పొరేట్ డిస్కౌంట్, రూ.5,000 విలువైన యాక్ససరీలను ఆఫర్ చేస్తుంది. మహీంద్రా బొలెరో కారు కొంటె రూ.3,500 నగదు డిస్కౌంట్, రూ.10,000 ఎక్స్ఛేంజ్ బోనస్, రూ.3,000 కార్పొరేట్ డిస్కౌంట్, కాంప్లిమెంటరీగా నాలుగో సంవత్సరం వారెంటీని అందిస్తుంది. -
ఈ ఏడాది రెండంకెల వృద్ధి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్యాసింజర్ వాహన విక్రయాల్లో 2018–19లో రెండంకెల వృద్ధి సాధిస్తామని మహీంద్రా అండ్ మహీంద్రా తెలిపింది. గత ఆర్థిక సంవత్సరంలో 5 లక్షల పైచిలుకు యూనిట్లు అమ్మినట్లు కంపెనీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ అరవపల్లి చెప్పారు. ‘ప్లష్ న్యూ ఎక్స్‌యూవీ 500’ ప్రీమియం ఎస్‌యూవీని హైదరాబాద్ మార్కెట్లో విడుదల చేసిన సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ‘గతేడాదిలో ప్యాసింజర్ వాహన పరి శ్రమ 8% వృద్ధితో సుమారు 31 లక్షల యూనిట్లకు చేరింది. 2018–19లో పరిశ్రమ రెండంకెల వృద్ధి నమోదు చేస్తుంది. యుటిలిటీ వాహన విభాగం 17% అధికమై 8.47 లక్షల యూనిట్లను తాకింది. ఈ విభాగంలో మహీంద్రా వాటా 27.6%. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా ఎక్స్‌యూవీ 500 వాహనాలు 2.15 లక్షల యూనిట్ల వరకూ రోడ్డెక్కాయి. ఇందులో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వాటా 14,000 యూనిట్లు. ఇక ప్లష్ న్యూ ఎక్స్‌యూవీ500 నెలకు 3,000–4,000 యూ నిట్లు అమ్ముడవుతుందని ధీమాగా ఉన్నాం. ఇందులో తెలుగు రాష్ట్రాల్లో 350 యూనిట్లు ఉండొచ్చు’ అని చెప్పారు. కాగా, హైదరాబాద్ ఎక్స్‌షోరూంలో ప్లష్ న్యూ ఎక్స్‌యూవీ500 ధర వేరియంట్‌నుబట్టి రూ.12.31 లక్షల నుంచి 17.87 లక్షల వరకూ ఉంది. -
మహీంద్రా ‘ఎక్స్‌యూవీ 500’.. సరికొత్తగా
బెంగళూరు: దేశీ ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ ‘మహీంద్రా అండ్ మహీంద్రా’ తాజాగా తన ఎక్స్‌యూవీ 500లో మూడేళ్ల తర్వాత కొత్త అప్డేటెడ్ వెర్షన్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. దీని ప్రారంభ ధర రూ.12.32 లక్షలు (ఎక్స్‌షోరూమ్ ఢిల్లీ). ఇందులో 2.2 లీటర్ 4 సిలిండర్ ఎంహక్ ఇంజిన్‌ను అమర్చినట్లు కంపెనీ తెలిపింది. ప్రీమియం ఎస్యూవీ విభాగంలో ఈ ఎక్స్‌యూవీ 500 కొత్త ట్రెండ్ సృష్టిస్తుందని కంపెనీ ధీమా వ్యక్తంచేసింది. ఇందులో స్మార్ట్‌వాచ్ కనెక్టివిటీ, కనెక్టెడ్ యాప్స్, ఎకో–సెన్స్ టెక్నాలజీ వంటి ప్రత్యేకతలున్నాయని తెలిపింది. తాజా ఎస్‌యూవీతో లగ్జరీ, స్టైల్ వంటి అంశాల్లో కొత్త బెంచ్ మార్క్‌ను ఏర్పాటు చేస్తామని పేర్కొంది. దేశంలోని ఇతర ఎస్‌యూవీలలో కనిపించని కనీసం 50 ఫీచర్లు ఈ కొత్త ఎక్స్‌యూవీ 500లో ఉన్నాయని మహీంద్రా అండ్ మహీంద్రా ప్రెసిడెంట్ (ఆటోమోటివ్ విభాగం) రాజన్ వడేరా తెలిపారు. నూతన డిజైన్, లగ్జరీ ఇంటీరియర్స్, అధిక శక్తి వంటి అంశాల్లో తమ కొత్త ఎక్స్‌యూవీ 500 మార్కెట్లోకి ఇతర ఎస్‌యూవీల కన్నా ప్రత్యేకంగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఇక ఇది ఐదు డీజిల్ వేరియంట్లు, ఒక పెట్రోల్ వేరియంట్ రూపంలో కస్టమర్లకు అందుబాటులో ఉంటుందని తెలిపారు. కాగా కంపెనీ 2011లో ఎక్స్‌యూవీ 500 మోడల్‌ను తొలిగా మార్కెట్లోకి తీసుకువచ్చింది. తర్వాత 2015లో ఇందులో కొత్త వెర్షన్‌ను ఆవిష్కరించింది. -
మహీంద్రా ఎక్స్‌యూవీ500 కొత్త వేరియంట్
ధరలు రూ.11.21 లక్షల నుంచి రూ.15.99 లక్షల రేంజ్లో * రెండు కొత్త కాంపాక్ట్ ఎస్‌యూవీలు న్యూఢిల్లీ: మహీంద్రా కంపెనీ ఎక్స్‌యూవీ500 స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్ కొత్త వేరియంట్‌ను సోమవారం మార్కెట్లోకి తెచ్చింది. ఈ కొత్త వేరియంట్లో ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, పుష్ బటన్ స్టార్ట్, ఆరు విధాలుగా అడ్జెస్ట్ చేసుకునే సీట్లు, తదితర ప్రత్యేకతలున్నాయని మహీంద్రా అండ్ మహీంద్రా ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ పవన్ గోయెంకా తెలిపారు. ఈ అప్డేటెడ్ వెర్షన్‌లోని ఎంట్రీ లెవెల్ వేరియంట్ డబ్ల్యూ4 ధర రూ.11.21 లక్షలని, హై ఎండ్ వేరియంట్ డబ్ల్యూ10 ధర రూ.15.99 లక్షలని(ఎక్స్ షోరూమ్, ఢిల్లీ) వివరించారు. ప్రస్తుతం ఎస్యూవీ సెగ్మెంట్లో తమ మార్కెట్ 40 శాతమని, దీనిని మరింతగా పెంచుకోవడానికి ఈ కొత్త వేరియంట్ ఉపకరిస్తుందని వివరించారు. తొమ్మిది కొత్త మోడళ్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తొమ్మిది మోడళ్లను మార్కెట్లోకి తేనున్నామని పవన్ గోయెంకా చెప్పారు. వీటిల్లో 2 కొత్త కాంపాక్ట్ స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్స్ ఉన్నాయని, వీటితో పాటు ప్రస్తుతమున్న మోడళ్లలో కొత్త వేరియంట్లను అందిస్తామని వివరించారు. ఇక కొత్తగా తేనున్న కాంపాక్ట్ ఎస్‌యూవీలను తక్కువ ధరల్లోనే అందిస్తామని చెప్పారు. ప్రస్తుతం ఈ సెగ్మెంట్లో అందిస్తున్న క్వాంటో మోడల్ ధర(రూ.6.65 లక్షలు-8.17 లక్షలు) కంటే తక్కువకే ఈ కొత్త ఎస్‌యూవీలను అందిస్తామన్నారు. ఈ క్వార్టర్‌లోనే వెరిటో ఎలక్ట్రిక్ వేరియంట్‌ను అందిస్తామని తెలిపారు.