‘ప్లష్ న్యూ ఎక్స్‌యూవీ500’తో శ్రీనివాస్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్యాసింజర్ వాహన విక్రయాల్లో 2018–19లో రెండంకెల వృద్ధి సాధిస్తామని మహీంద్రా అండ్ మహీంద్రా తెలిపింది. గత ఆర్థిక సంవత్సరంలో 5 లక్షల పైచిలుకు యూనిట్లు అమ్మినట్లు కంపెనీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ అరవపల్లి చెప్పారు. ‘ప్లష్ న్యూ ఎక్స్‌యూవీ 500’ ప్రీమియం ఎస్‌యూవీని హైదరాబాద్ మార్కెట్లో విడుదల చేసిన సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ‘గతేడాదిలో ప్యాసింజర్ వాహన పరి శ్రమ 8% వృద్ధితో సుమారు 31 లక్షల యూనిట్లకు చేరింది.
2018–19లో పరిశ్రమ రెండంకెల వృద్ధి నమోదు చేస్తుంది. యుటిలిటీ వాహన విభాగం 17% అధికమై 8.47 లక్షల యూనిట్లను తాకింది. ఈ విభాగంలో మహీంద్రా వాటా 27.6%. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా ఎక్స్‌యూవీ 500 వాహనాలు 2.15 లక్షల యూనిట్ల వరకూ రోడ్డెక్కాయి. ఇందులో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వాటా 14,000 యూనిట్లు. ఇక ప్లష్ న్యూ ఎక్స్‌యూవీ500 నెలకు 3,000–4,000 యూ నిట్లు అమ్ముడవుతుందని ధీమాగా ఉన్నాం. ఇందులో తెలుగు రాష్ట్రాల్లో 350 యూనిట్లు ఉండొచ్చు’ అని చెప్పారు. కాగా, హైదరాబాద్ ఎక్స్‌షోరూంలో ప్లష్ న్యూ ఎక్స్‌యూవీ500 ధర వేరియంట్‌నుబట్టి రూ.12.31 లక్షల నుంచి 17.87 లక్షల వరకూ ఉంది.
Comments
Please login to add a commentAdd a comment