బెంగళూరు: దేశీ ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ ‘మహీంద్రా అండ్ మహీంద్రా’ తాజాగా తన ఎక్స్‌యూవీ 500లో మూడేళ్ల తర్వాత కొత్త అప్‌డేటెడ్ వెర్షన్‌ను మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. దీని ప్రారంభ ధర రూ.12.32 లక్షలు (ఎక్స్‌షోరూమ్ ఢిల్లీ). ఇందులో 2.2 లీటర్ 4 సిలిండర్ ఎంహక్ ఇంజిన్‌ను అమర్చినట్లు కంపెనీ తెలిపింది. ప్రీమియం ఎస్‌యూవీ విభాగంలో ఈ ఎక్స్‌యూవీ 500 కొత్త ట్రెండ్ సృష్టిస్తుందని కంపెనీ ధీమా వ్యక్తంచేసింది. ఇందులో స్మార్ట్‌వాచ్ కనెక్టివిటీ, కనెక్టెడ్ యాప్స్, ఎకో–సెన్స్ టెక్నాలజీ వంటి ప్రత్యేకతలున్నాయని తెలిపింది. తాజా ఎస్‌యూవీతో లగ్జరీ, స్టైల్ వంటి అంశాల్లో కొత్త బెంచ్ మార్క్‌ను ఏర్పాటు చేస్తామని పేర్కొంది.
దేశంలోని ఇతర ఎస్‌యూవీలలో కనిపించని కనీసం 50 ఫీచర్లు ఈ కొత్త ఎక్స్‌యూవీ 500లో ఉన్నాయని మహీంద్రా అండ్ మహీంద్రా ప్రెసిడెంట్ (ఆటోమోటివ్ విభాగం) రాజన్ వడేరా తెలిపారు. నూతన డిజైన్, లగ్జరీ ఇంటీరియర్స్, అధిక శక్తి వంటి అంశాల్లో తమ కొత్త ఎక్స్‌యూవీ 500 మార్కెట్‌లోకి ఇతర ఎస్‌యూవీల కన్నా ప్రత్యేకంగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఇక ఇది ఐదు డీజిల్ వేరియంట్లు, ఒక పెట్రోల్ వేరియంట్ రూపంలో కస్టమర్లకు అందుబాటులో ఉంటుందని తెలిపారు. కాగా కంపెనీ 2011లో ఎక్స్‌యూవీ 500 మోడల్‌ను తొలిగా మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. తర్వాత 2015లో ఇందులో కొత్త వెర్షన్‌ను ఆవిష్కరించింది.
మహీంద్రా ‘ఎక్స్‌యూవీ 500’.. సరికొత్తగా
Published Thu, Apr 19 2018 6:19 AM | Last Updated on Mon, Oct 8 2018 7:58 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment