సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్‌గా ఉంటూ సమాకాలిన అంశాలపై స్పందించే బిజినెస్ టైకూన్ ఆనంద్ మహీంద్రా మరోసారి తన పెద్ద మనసు చాటుకున్నారు. పారా ఒలింపిక్స్‌లో జావెలిన్ త్రోలో ఇండియాకు స్వర్ణపతకం సాధించిన సుమిత్ అంటిల్‌కి సరికొత్త మహీంద్రా ఎక్స్‌యూవీ 700 బహుమతిగా ఇస్తానంటూ ప్రకటించారు. అంతేకాదు సుమిత్ అంటిల్ అవసరాలకు తగ్గట్టుగా దాన్ని ప్రత్యేకంగా జావెలిన్ త్రో ఎడిషన్‌గా తయారు చేయాలంటూ కంపెనీ ప్రతినిధులకు సూచించారు. పారా ఒలింపిక్స్‌లో ఎటువంటి అంచనాలు లేకుండా బరిలో దిగి బంగారు పతకం సాధించిన సుమిత్ అంటిల్ ప్రతిభను ఆయన కొనియాడారు. అంతకు ముందు ఇదే పారా ఒలింపిక్స్‌లో షూటింగ్ విభాగంలో స్వరం సాధించిన భారత మహిళా షూటర్ అవని లేఖరాకు కూడా ఎక్స్‌యూవీ 700ను బహుమతిగా అందిస్తానంటూ ఆనంద్ మహీంద్రా ప్రకటించారు
జావెలిన్ ఎడిషన్
పారా ఒలింపియన్ దీపా మాలిక్ ఇటీవల తనకు ఎస్‌యూవీ కార్లు నడపడం అంటే చాలా ఇష్టమనీ పేర్కొన్నారు. తన లాంటి ప్రత్యేక ఎబిలిటీ ఉన్న వారి కోసం ప్రత్యేకంగా కార్లను తయారు చేయాలంటూ భారతీయ ఆటోమొబైల్ దిగ్గజాలను కోరారు. వీటికి స్పందించిన ఆనంద్ మహీంద్రా, ఈ ఒలింపిక్‌లో గోల్డ్ మెడల్ సాధించిన వారి కోసం కారును బహుమతిగా ఇవ్వడమే కాకుండా వారి అవసరాలకు తగ్గట్టుగా ప్రత్యేకంగా తయారు చేయిస్తున్నారు. అందులో భాగంగానే జావెలిన్‌త్రో విజయం సాధించిన సుమిత్ అంటిల్ కోసం ప్రత్యేకంగా తయారు చేస్తోన్న ఎక్స్‌యూవీకి జావెలిన్ ఎడిషన్‌గా ఆయన పేర్కొన్నారు.
ప్రత్యేక ఏర్పాట్లు
జావెలిన్ త్రోలో స్వరం సాధించిన సుమిత్ అంటిల్ కృత్రిమ కాలు అమర్చుకుని సాధాన చేసేవాడు. ఈ సమయంలో ఫాంటమ్ లింబ్ పెయిన్’ అనే తీవ్రమైన నొప్పితో అల్లాడిపోయే వాడు. కొన్నిసార్లు వేడి వల్ల లోపలి భాగం (లైనర్) నుంచి రక్తం కూడా కారుతున్నా ఆ బాధ తట్టుకుంటూ ప్రాక్టీస్ చేశాడు. చివరికి అద్భుతమైన ఫలితం సాధించాడు. కారు నడిపే సమయంలో ఫాంటమ్ లింబ్ పెయిన్ రాకుండా జావెలిన్ ఎడిషన్ లో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోనున్నారు. జావెలిన్ విషయానికి వస్తే సుమిత్ కంటే ముందు టోక్యో ఒలింపిక్స్‌లో నీరజ్ చోప్‌డా సైతం బంగారు పతకం సాధించాడు.
An awesome sporting feat. Without exception. His performance demands an XUV 7OO. India now has TWO Golds in this ancient sport. @BosePratap Please design another Javelin edition of the XUV 7OO that we will be privileged to gift this incredible sportsperson. 👏🏽👏🏽👏🏽 https://t.co/DA22MG1pIF
— anand mahindra (@anandmahindra) August 30, 2021
చదవండి : మేరీకోమ్‌కు ఖరీదైన కారు గిఫ్ట్‌గా
Comments
Please login to add a commentAdd a comment