Mahindra sold special edition of XUV400 for a whopping price - Sakshi
Sakshi News home page

మహీంద్ర ఎక్స్‌యూవీ 400స్పెషల్‌ ఎడిషన్‌ రూ. 1.75 కోట్లా! ఎందుకలా

Published Mon, Feb 13 2023 3:59 PM | Last Updated on Mon, Feb 13 2023 4:46 PM

Mahindra sold special edition of XUV400 for a whopping price - Sakshi

సాక్షి, ముంబై: దేశీయ దిగ్గజ ఆటోమొబైల్​ సంస్థ మహీంద్రా అండ్​ మహీంద్రా  ప్రత్యేకంగా తీసుకొచ్చిన  ఎక్స్‌ యూవీ400 భారీ ధర పలికింది. వన్-ఆఫ్-వన్ ఎడిషన్‌ను వేలం సందర్భంగా ఈ ఎక్స్‌యూవీ 400 ఎలక్ట్రిక్ వాహనాన్ని రూ. 1.75కోట్లకు అమ్ముడుపోయింది.హైదరాబాద్‌కు చెందిన రుణాకర్​ కుందావరమ్​ ఈ ఎక్స్‌క్లూజివ్‌ ఎడిషన్‌ను సొంతం చేసుకున్నారు.  మహీంద్రా అండ్ మహీంద్రా చైర్‌పర్సన్  ఈ కారును ఆయనకు అందించారు. 

మహీంద్రా ఎక్స్​యూవీ400 ఎక్స్‌ షోరూం ధర రూ. 16.99లక్షలు-రూ. 18.99లక్షలుగా ఉంది. దీనిప్రకారం​ ప్రారంభ ధర కన్నా.. ఎక్స్​యూవీ400 ​ ఎక్స్‌క్లూజివ్‌ ఎడిషన్‌ను  రూ. 1.58 కోట్లు ఎక్కువ ధరకు అమ్ముడుపోయింది.  ఈ నిధులను సామాజిక సేవ కోసం వినియోగించనున్నట్టు సంస్థ పేర్కొంది.

సాధారణ మహీంద్రా ఎక్స్​యూవీ400 ఈవీతో పోలిస్తే  పెద్దగా మార్పులు లేనప్పటికీ  ప్రత్యేకత ఏంటంటే.. మహీంద్రా XUV400 వన్-ఆఫ్-వన్ ఎడిషన్‌ను ఫ్యాషన్ డిజైనర్ రిమ్జిమ్ దాదు సహకారంతో మహీంద్రా చీఫ్ డిజైన్ ఆఫీసర్ ప్రతాప్ బోస్ రూపొందించారు. ప్రత్యేక ఎడిషన్ కారును  'రిమ్జిమ్ దాదు X బోస్' బ్యాడ్జ్​ , ఆర్కిటిక్ బ్లూ థీమ్‌తో తీసుకొచ్చింది. 

స్టాండర్డ్ మహీంద్రా XUV 400 eSUV రెండు వేరియంట్‌లలో లభిస్తుంది. దీనికి సంబంధించి జనవరి 26 న ప్రారంభం కాగా మోడల్ ఇప్పటివరకు 15,000 బుకింగ్‌లను పొందింది. ఈ బుకింగ్‌ల డెలివరీలు దాదాపు ఏడు నెలల్లో పూర్తవుతాయని మహీంద్రా అండ్ మహీంద్రా తెలిపింది.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement