ప్రముఖ దేశీయ ఆటోమొబైల్ తయారీ దిగ్గజం మహీంద్రా & మహీంద్రా ఇతర కంపెనీలకు గట్టి పోటీ ఇచ్చేందుకు ఎక్స్‌యూవీ700 కారును విడుదల చేసిన సంగతి మనకు తెలిసిందే. అయితే, ఈ మహీంద్రా ఎక్స్‌యూవి700 పిల్లలకు, పెద్దలకు సురక్షితం అని గ్లోబల్ ఎన్సీఏపీ తెలిపింది. గ్లోబల్ ఎన్సీఏపీ #SaferCarsForIndia పేరుతో నిర్వహించిన క్రాష్ టెస్ట్‌లో ఎక్స్‌యూవీ700 5 స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను సంపాదించింది. పిల్లల రక్షణకు కారు సంబంధించి 4 స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను పొందింది.
ఇటీవల విడుదల చేసిన మహీంద్రా ఎక్స్‌యూవి700 రెండు ఎయిర్‌బ్యాగ్‌లు, ఏబీఎస్ బ్రేక్‌లతో అత్యంత సురక్షితమైన కారుగా నిలిచింది. మహీంద్రా ఎక్స్‌యూవి700లో సైడ్-బాడీ ఎయిర్‌బ్యాగ్‌లు, సైడ్ హెడ్ కర్టెన్ ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ ఫీచర్స్ ఉన్నాయి .గ్లోబల్ ఎన్సీఏపీ సెక్రటరీ-జనరల్ అలెజాండ్రో ఫురాస్ మాట్లాడుతూ.. “పెద్దల రక్షణకు సంబంధించి మహీంద్రా టాప్ స్కోర్‌తో ఒక ప్రధాన మైలురాయిని సాధించింది. అలాగే, అటానమస్ ఎమర్జెన్సీ బ్రేకింగ్(AEB) వ్యవస్థ గల మొదటి భారతీయ కంపెనీగా మహీంద్రా నిలిచింది. ఈ లైఫ్-సేవింగ్ టెక్నాలజీని తీసుకొని రావడం గొప్ప విషయం" అని ఆయన అన్నారు.
The adrenaline rush reaches an all new high with the #XUV700 being ranked as India’s Safest Vehicle.
— MahindraXUV700 (@MahindraXUV700) November 10, 2021
Highest Combined Safety Score of 57.69/66 & Highest Child Safety Score of 41.65/49, setting a 5-star Global NCAP rating. https://t.co/YzSD0plClP#SafersCarsForIndia @GlobalNCAP pic.twitter.com/8PoKHyA55O
ప్రీ బుకింగ్స్‌ను పరంగా కూడా ఈ కారు రికార్డు సాధించింది. ప్రీ బుకింగ్స్ ప్రారంభించిన 14రోజుల్లో 65,000 వెహికల్స్ బుకింగ్స్ జరిగినట్లు దేశీ ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా సంస్థ తెలిపింది. బుకింగ్స్ ప్రారంభమైన తొలిరోజు అక్టోబర్ 7, అక్టోబర్ 8 రోజుల్లో మొత్తం 50వేల వెహికల్స్ బుకింగ్ జరిగినట్లు కంపెనీ ప్రతినిధులు వ్యక్తం చేశారు. చెన్నైలో ప్రూవింగ్ ట్రాక్ (ఎమ్‌ఎస్‌పీటీ) లో మహీంద్రా ఎక్స్‌యూవీ700 సరికొత్త రికార్డ్‌లని క్రియేట్ నమోదు చేసింది. ప్రూవింగ్ ట్రాక్‌లో జరిగిన 24 గంటల స్పీడ్ ఎండ్యూరెన్స్ ఛాలెంజ్‌లో మహీంద్రా ఎక్స్‌యూవీ ఒక్కొక్కటి సుమారు 4000 కి.మీ. మొత్తంగా 17000 కిలోమీటర్ల మేర ప్రయాణించాయి. గతంలో ఈ రికార్డు 3161 కిలోమీటర్లతో ఉండేది.
(చదవండి: అయ్యో ఎలన్ మస్క్.. ఎంత కష్టం వచ్చే!)
Comments
Please login to add a commentAdd a comment