టాలీవుడ్ మొదలు హాలీవుడ్ వరకు అవుట్‌డోర్ షూటింగ్‌లకి వెళ్లే హీరోలు వ్యానిటీ కార్లు ఉపయోగిస్తుంటారు. అచ్చం ఇంటిలాగే బెడ్, డైనింగ్, కిచెన్, బాత్‌రూమ్ ఇలా సకల సౌకర్యాలు ఆ వ్యానిటీ వెహికల్‌లో ఉంటాయి. సినిమా హీరోల తరహాలో ఆ తర్వాత కొందరు రాజకీయ నాయకులు కూడా ఇలాంటి సౌకర్యం ఏర్పాటు చేసుకున్నారు. హీరోలు, పొలిటీషియన్లకే కాదు ఇప్పుడు అడ్వెంచరిస్టులు, క్యాంపర్లతో పాటు ఈ తరహా వాహనాలపై ఆసక్తి ఉన్న సామాన్యులకు వ్యానిటీ వెహికల్‌ను అందుబాటులోకి తెస్తోంది టయోటా.
సెమా షోలో
పూర్తి ఆఫ్‌రోడ్ వెహికల్‌గా టయోటా సంస్థ టోకోజిల్లాను రూపొందించింది. అమెరికాలోని లాస్‌వెగాస్‌లో జరుగుతున్న సెమా షో 2021లో ఈ ట్రక్‌ను టయోటా ప్రదర్శించింది. త్వరలోనే మార్కెట్‌లోకి తెస్తామని తెలిపింది.
కదిలే ఇళ్లు
టయోటా టోకోజిల్లాలో ఇద్దరు వ్యక్తులు ఇందులో ప్రయాణించడమే కాదు ఇంటిగా మార్చుకుని బతికేందుకు అవసరమైనన్ని సౌకర్యాలు ఇందులో ఉన్నాయి. కిచెన్ అందులో స్టవ్, సింక్, డిష్ వాషర్, ఫ్రిడ్జ్ వంటివి ఉన్నాయి. బాత్‌రూమ్ కమ్ టాయిలెట్, టీవీ, డైనింగ్ ఏరియా, రెండు సోఫాలు, ఇద్దరు వ్యక్తులు పడుకునేందుకు వీలుగా స్లీపింగ్ ఏరియాతో పాటు సన్‌రూఫ్ సౌకర్యాన్ని కూడా అమర్చారు. ఈ ట్రక్కులో లివింగ్ ఏరియా 1.83 మీటర్ల ఎత్తుతో డిజైన్ చేశారు.
క్యాంపింగ్‌కి అనుకూలం
టయోటా నుంచి 70, 80వ దశకాల్లో వచ్చిన ట్రక్ మోడల్‌లను అనుసరించి పూర్తి రెట్రో స్టైల్‌లో టాకోజిల్లాను తయారు చేశారు. క్యాంపింగ్‌ని ఇష్టపడే వారికి ఈ ట్రక్ ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందని టయోటా అంటోంది. వచ్చే ఏడాదిలో ఈ కారు మార్కెట్‌లోకి వచ్చే అవకాశం ఉంది. ధరకు సంబంధించి టయోటా నుంచి ఎటువంటి ప్రకటన రాలేదు.
ఇంజన్ సామర్థ్యం
3.5 లీటర్ వీ6 ఇంజన్‌తో 6 మాన్యువల్ గేర్ షిప్ట్ పద్దతి 4 వీల్ డ్రైవ్ మోడ్‌లో ఈ కారుని డిజైన్ చేశారు. ఈ కారు ఇంజన్ 278 హెచ్‌పీతో 6,000 ఆర్‌పీఎమ్ ఇవ్వగలదు.
Comments
Please login to add a commentAdd a comment