చికాగో: ఇటీవల శాస్త్రసాంకేతిక రంగాల్లో ఎన్నో అద్భుత ఆవిష్కరణలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే గత కొన్ని నెలలుగా ఎగిరే కార్ల ప్రస్తావన ఎక్కువగా వినిపిస్తోంది. ప్రస్తుతం రోడ్లపై కార్లు ఏ విధంగానైతే పరుగులు పెడుతున్నాయో ఇంకొన్నేళ్లలోనే గాల్లో ఎగిరే కార్లనూ చూడనున్నామనే వార్తలు వినిపిస్తున్నాయి. వీటిని నిజం చేసే దిశగా తొలి అడుగు పడింది.
ప్రముఖ విమానయాన సంస్థ బోయింగ్.. గాల్లో ఎగిరే కారును తొలిసారి తయారుచేసింది. అంతేకాదు, బోయింగ్ ప్రోటోటైప్ అనే ఈ ఎగిరే కారును విజయవంతంగా పరీక్షించింది కూడా. దీంతో ఇకపై పట్టణాల్లో రవాణా, డెలివరీ సేవలు మరింత వేగమవుతాయని బోయింగ్ ప్రతినిధులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment