Upcoming Cars: జులై నెల దాదాపు ముగిసింది. ఇక రెండు రోజుల్లో ఆగష్టు నెల రానుంది. అయితే ఆ నెలలో (ఆగష్టు) విడుదలయ్యే కొత్త కార్లు ఏవి? వాటి వివరాలు ఏంటనేది.. ఈ కథనంలో తెలుసుకుందాం.
టాటా పంచ్ సీఎన్‌జీ (Tata Punch CNG)
దేశీయ మార్కెట్లో ఇప్పటికే అత్యంత ప్రజాదరణ పొందిన టాటా మోటార్స్ కంపెనీకి చెందిన మైక్రో ఎస్‌యువి త్వరలో సీఎన్‌జీ రూపంలో విడుదలకావడానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే ఈ కారు 2023 ఆటో ఎక్స్‌పోలో అడుగుపెట్టింది. గత కొంత కాలంలో ఇది టెస్టింగ్ సమయంలో కూడా కనిపించింది. కావున ఈ కారు ఆగష్టు ప్రారంభంలో విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి.
సెకండ్ జనరేషన్ మెర్సిడెస్ బెంజ్ జిఎల్సీ (Second-gen Mercedes-Benz GLC)
జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ 2023 ఆగష్టు 09న తన సెకండ్ జనరేషన్ జిఎల్సీ విడుదల చేయడానికి సన్నద్ధమవుతోంది. గత ఏడాది ప్రపంచ వ్యాప్తాహముగా అరంగేట్రం చేసిన ఈ కారు పెట్రోల్ అండ్ డీజిల్ వేరియంట్లలో విడుదలయ్యే అవకాశం ఉంది. డిజైన్ అండ్ ఫీచర్స్ పరంగా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవకాశం లేదు. ఆధునిక కాలంలో వినియోగదారులకు అవసరమైన అన్ని ఫీచర్స్ లభించనున్నట్లు స్పష్టమవుతోంది.
ఆడి క్యూ8 ఈ-ట్రాన్ (Audi Q8 e-tron)
జర్మనీ బ్రాండ్ కంపెనీ అయిన ఆడి కూడా ఆగష్టు 18న తన క్యూ8 ఈ-ట్రాన్ కారుని విడుదల చేయడానికి సన్నద్ధమవుతోంది. ఇది దాని మునుపటి మోడల్స్ కంటే కూడా చాలా ఆధునికంగా ఉంటుంది. రీడిజైన్ చేయబడిన ఫ్రంట్ ఫాసియా, రియర్ బంపర్ వంటి వాటిని కలిగిన ఈ కారు ఒక ఫుల్ ఛార్జ్‌తో 600 కిమీ రేంజ్ అందిస్తుందని తెలుస్తోంది.
ఇదీ చదవండి: ఇంటర్నెట్‌ని షేక్ చేస్తున్న దుబాయ్ షేక్ కారు.. వీడియో వైరల్
టయోటా రూమియన్ (Toyota Rumion)
మనదేశంలో ఎక్కువమంది ఇష్టపడి కొనుగోలు చేసే కార్లు ఏవైన ఉన్నాయంటే అందులో 'టయోటా' కూడా ఉంటుంది. ఇప్పటికే సౌత్ ఆఫ్రికాలో అందుబాటులో ఉన్న ఈ ఎంపివి త్వరలోనే ఇండియన్ మార్కెట్లో కూడా అడుగుపెట్టనుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో 103 హార్స్ పవరే, 137 న్యూటన్ మీటర్ టార్క్ అందించే 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్‌ను పొందుతుంది. రానున్న రోజుల్లో ఇది సీఎన్‌జీ రూపంలో విడుదలయ్యే అవకాశం కూడా ఉంది.
ఇదీ చదవండి: ఆధార్‌పై కేంద్రం సంచలన నిర్ణయం.. పుట్టిన బిడ్డకు ఎంతో మేలు!
వోల్వో సీ40 రీఛార్జ్ (Volvo C40 Recharge)
స్వీడన్ కంపెనీకి చెందిన వోల్వో కంపెనీ త్వరలో సీ40 రీఛార్జ్ విడుదల చేయడానికి సన్నద్ధమవుతోంది. ఇది కంపెనీకి చెందిన రెండవ ఎలక్ట్రిక్ మోడల్ కావడం విశేషం. ఇది చూడటానికి దాదాపు దాని మునుపటి మోడల్ గుర్తుకు తెస్తుంది. దీనికి సంబంధించిన అధికారిక వివరాలు త్వరలోనే తెలుస్తాయి.
Comments
Please login to add a commentAdd a comment