Top 5 Hybrid Cars In India: భారతీయ మార్కెట్లో హైబ్రిడ్ కార్ల వినియోగం ఎక్కువవుతోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని కంపెనీలు కూడా తమ ఉత్పత్తులను ఈ విభాగంలో విడుదల చేయడానికి ఆసక్తి చూపుతున్నాయి. ప్రస్తుతం దేశీయ విఫణిలో ఎక్కువ మైలేజ్ ఇచ్చే టాప్ 5 కార్లను గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.
టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్
దేశీయ మార్కెట్లో అతి తక్కువ కాలంలో అత్యంత ప్రజాదరణ పొందిన టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ ధరలు రూ. 16.46 లక్షల నుంచి రూ. 19.99 లక్షల వరకు ఉంటుంది. ఈ కారు ఒక లీటరుకు గరిష్టంగా 27.97 కిమీ మైలేజ్ అందిస్తుందని కంపెనీ వెల్లడించింది. మంచి డిజైన్, అంతకు మించిన ఫీచర్స్ కలిగిన ఈ కారు అద్భుతమైన పనితీరుని అందించేలా రూపొందించారు.
మారుతి సుజుకి గ్రాండ్ విటారా
ఆధునిక కాలంలో అందుబాటులో ఉన్న మారుతి సుజుకి గ్రాండ్ విటారా ధరలు రూ. 18.29 లక్షల నుంచి రూ. 19.79 లక్షల వరకు ఉంటుంది. ఇది 27.97 కిమీ/లీ మైలేజ్ అందిస్తుందని సమాచారం. ఇది సిటీ అండ్ హైవే రెండింటిలోనూ 20 కిమీ కంటే ఎక్కువ మైలేజ్ అందిస్తుంది. డిజైన్ అండ్ ఫీచర్స్ కలిగిన ఈ కారులో తక్కువ ఇతర మోడల్స్ కంటే కూడా తక్కువ బూట్ స్పేస్ లభిస్తుంది.
హోండా సిటీ హైబ్రిడ్
రూ. 18.99 లక్షల నుంచి రూ. 20.49 లక్షల మధ్య లభించే ఈ కారు కూడా మన జాబితాలో ఉత్తమ మైలేజ్ అందించే బెస్ట్ కారు. ఇది 23.13 కిమీ/లీ మైలేజ్ అందిస్తుందని కంపెనీ ధ్రువీకరించింది. అయితే సిటీ అండ్ హైవే వంటి వాటిని లోబడి కొంత వరకు మైలేజ్ తగ్గే అవకాశం ఉండవచ్చు. పనితీరు చాలా చురుగ్గా ఉంటుంది.
ఇదీ చదవండి: ఫ్రెండ్‌షిప్‌డే రోజు మిత్రులకు గిఫ్ట్‌గా ఓ స్మార్ట్‌వాచ్ - ధర తక్కువ & ఎక్కువ ఫీచర్స్!
మారుతి సుజుకి ఇన్విక్టో
మారుతి సుజుకి కంపెనీకి చెందిన మరో హైబ్రిడ్ మోడల్ ఇన్విక్టో. దీని ప్రారంభ ధర రూ. 24.79 లక్షలు, కాగా టాప్ వేరియంట్ ధర రూ. 28.42 లక్షలు. మైలేజ్ విషయానికి వస్తే.. ఇది ఒక లీటరుకు గరిష్టంగా 23.24 కిమీ మైలేజ్ అందిస్తుందని తెలుస్తోంది. మన జాబితాలో ఇది కొంత ఖరీదైన కారు అనే చెప్పాలి. అయితే ధరకు తగిన ఫీచర్స్ ఇందులో లభిస్తాయి.
ఇదీ చదవండి: ప్రపంచంలోనే అత్యంత ధనిక మహిళ.. ఎలాన్ మస్క్, అంబానీ కంటే ఎక్కువే!
టయోటా ఇన్నోవా హైక్రాస్
టయోటా కంపెనీకి చెందిన ఇన్నోవా హైక్రాస్ ధర రూ. 25.30 లక్షల నుంచి రూ. 30.26 లక్షల వరకు ఉంటుంది. ఇది 23.24 కిమీ/లీ మైలేజ్ ఇస్తుందని తెలుస్తోంది. ఈ కారు ఆకర్షణీయమైన డిజైన్, అధునాతన ఫీచర్స్ పొందుతుంది. ఉత్తమ పనితీరుని అందించే ఈ కారు అతి తక్కువ కాలంలోనే మంచి అమ్మకాలను పొందగలిగింది.
Comments
Please login to add a commentAdd a comment