Top 5 Cheapest Cars in India: Bajaj Qute, Renault Kwid and More - Sakshi
Sakshi News home page

Affordable Cars: తక్కువ ధర వద్ద లభించే టాప్ 5 బెస్ట్ కార్లు ఇవే - చూసారా?

Published Fri, May 26 2023 9:09 PM | Last Updated on Fri, May 26 2023 9:28 PM

Top ten cheapest cars in india bajaj qute renault kwid and more - Sakshi

Affordable Cars in 2023: భారతదేశంలో ప్రస్తుతం చాలామంది సొంతవాహనాలను కలిగి ఉండటానికి ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ఈ కారణంగానే ప్రతి ఒక్కరూ సొంతంగా కార్లను కొనుగోలు చేయడానికి ముందుకు వస్తున్నారు. అయితే కొంతమంది ఖరీదైన కార్లను కొనుగోలు చేస్తే మరి కొందరు వారి రేంజ్ కి తగ్గట్టుగా తక్కువ ధరలో లభించే కార్లను కొనుగోలు చేయడానికి ఎగబడుతున్నారు. నిజానికి ఖరీదైన కార్లను కొనుగోలు చేసే వారి సంఖ్య కంటే సరసమైన ధర వద్ద లభించే కార్లను కొనుగోలు చేసేవారి సంఖ్య ఎక్కువగా ఉంది. భారతీయ మార్కెట్లో తక్కువ ధరకు లభించే టాప్ అండ్ బెస్ట్ 10 కార్లను గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

బజాజ్ క్యూట్
భారతదేశంలో అతి తక్కువ ధరకు లభించే సరసమైన కారు బజాజ్ కంపెనీకి చెందిన క్యూట్. దీని ప్రారంభ ధర కేవలం రూ. 2.64 లక్షల నుంచి రూ. 2.84 లక్షల మధ్యలో ఉంటుంది. ఈ ధర ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న బైకుల ధర కంటే చాలా తక్కువ. ఇది 216 సిసి ఇంజిన్ కలిగి లీటరుకు 35 కిమీ నుంచి 45 కిమీ మైలేజ్ అందిస్తుంది. చూడటానికి చిన్నగా ఉన్నప్పటికీ ఇది మంచి డిజైన్, మంచి ఫీచర్స్ పొందుతుంది.

డాట్సన్ రెడీ గో
అమెరికన్ వాహన తయారీ సంస్థ ఫోర్డ్ కంపెనీకి చెందిన డాట్సన్ రెడీ గో కూడా మన జాబితాలో తక్కువ ధరకు లభించే బెస్ట్ కారు. దీని ధర రూ. 3.8 లక్షల నుంచి రూ. 4.96 లక్షల వరకు ఉంది. ఇది 799 సిసి ఇంజిన్ కలిగి లీటరుకు 20.7 కిమీ నుంచి 22 కిమీ మైలేజ్ అందిస్తుంది. 2017లో NDtv స్మాల్ కార్ ఆఫ్ ది ఇయర్ అవార్డు కైవసం చేసుకున్న ఈ కారు ప్రొడక్షన్ ఇప్పుడు ఇండియాలో ఆగిపోయింది. కానీ విక్రయాలు మాత్రం కొనసాగుతూ ఉన్నాయి.

(ఇదీ చదవండి: అమ్మేది పాత బూట్లు.. సంపాదన రూ. కోట్లు - ఓ యువకుని సక్సెస్ స్టోరీ)

రెనాల్ట్ క్విడ్
మన జాబితాలో చెప్పుకోదగ్గ సరసమైన కారు మాత్రమే కాదు, అత్యంత సురక్షితమైన కారు కూడా. దీని ధర రూ. 4.7 లక్షల నుంచి రూ. 6.33 లక్షల మధ్య ఉంటుంది. చూడటానికి చిన్నగా ఉన్నప్పటికీ డిజైన్ పరంగా ఫీచర్స్ పరంగా చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ కారులోని 799 ఇంజిన్ ఒక లీటరుకు 22 కిమీ నుంచి 23 కిమీ మధ్య మైలేజ్ అందిస్తుంది. ప్రస్తుతం దేశీయ మార్కెట్లో ఎక్కువ అమమకాలు పొందుతున్న కార్లలో ఇది ప్రధానంగా చెప్పుకోదగ్గది.

(ఇదీ చదవండి: రూ. 5.1 కోట్ల మెక్‌లారెన్ కొత్త సూపర్‌కార్‌ ఇదే - పూర్తి వివరాలు)

మారుతి ఆల్టో 800
ఇండియన్ మార్కెట్లో అత్యధిక ప్రజాదరణ పొందిన మారుతి ఆల్టో 800 ధర రూ. 3.54 లక్షల నుంచి రూ. 5.13 లక్షల మధ్య ఉంటుంది. ఈ కారు ఆధునిక కాలంలో మాత్రమే కాకుండా ఒకప్పటి నుంచి మంచి సంఖ్యలో అమ్ముడవుతూ ఉంది. ఇది ఇప్పుడు ఆధునిక హంగులతో మార్కెట్లో అందుబాటులో ఉంది. కావున మునుపటికంటే మంచి డిజైన్, ఉత్తమ ఫీచర్స్ పొందుతుంది. ఇందులోని 796 సిసి ఇంజిన్ లీటరుకు 24.7 కిమీ నుంచి 31.4 కిమీ మైలేజ్ అందిస్తుంది. మంచి మైలేజ్ అందిస్తున్న కారణంగా కూడా ఎక్కువమంది దీనిని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు.

(ఇదీ చదవండి: నిస్సాన్ మాగ్నైట్ సరికొత్త ఎడిషన్‌.. ధర ఎంతో తెలుసా?)

మారుతి ఎస్ ప్రెస్సో
మారుతి సుజుకి కంపెనీకి చెందిన మరో కారు ఎస్-ప్రెస్సో. ఇది కూడా తక్కువ ధర వద్ద లభించే బెస్ట్ కారు. దీని ధర రూ. 4.25 లక్షల నుంచి రూ. 6.1 లక్షల మధ్య ఉంటుంది. ఇందులోని కె10బి పెట్రోల్ ఇంజిన్ ఆటోమాటిక్ మరియు మాన్యువల్ ట్రాన్స్మిషన్ పొందుతుంది. ఇది ఆకర్షణీయమైన డిజైన్, అంతకు మించిన ఫీచర్స్ పొందుతుంది. ఇది లీటరుకు 24.8 కిమీ నుంచి 32.7 కిమీ మైలేజ్ అందిస్తుంది. పనితీరు పరంగా చాలా అద్భుతంగా ఉంటుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement