రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ యాత్ర ఉత్తరప్రదేశ్‌లోని వారణాసికి చేరుకుంది. యూపీలో ఆయన పర్యటనకు శనివారం రెండో రోజు. రాహుల్ ఈ ప్రయాణం ప్రారంభించి 35 రోజులైంది. యూపీ చేరుకున్న రాహుల్ కాశీ విశ్వేశ్వరుణ్ణి దర్శించుకున్నారు.
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వారణాసిలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. తన ఈ ప్రయాణంలో ఎన్నడూ ద్వేషాన్ని చూడలేదని, యాత్రలో బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌కు చెందిన వారు కూడా వెంట వచ్చారన్నారు. వారు తనతో చక్కగా మాట్లాడారన్నారు. దేశాన్ని ఏకతాటిపైకి తీసుకురావడమే దేశం పట్ల ప్రకటించే నిజమైన భక్తి అని అన్నారు. ప్రస్తుతం దేశంలో ద్వేషం, భయాందోళనకర వాతావరణం నెలకొని ఉందన్నారు.
దేశ తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ, మాజీ ప్రధాని ఇందిరా గాంధీకి వారణాసితో విడదీయరాని అనుబంధం ఉంది. పండిట్ నెహ్రూ 1910 నుండి 1950 వరకు అనేకసార్లు కాశీని సందర్శించారు. ప్రధాని అయ్యాక కూడా వారణాసికి వచ్చారు. ఇందిరా గాంధీ కూడా వారణాసిలో రాజకీయ, మతపరమైన పర్యటనలు చేశారు.
పండిట్ జవహర్ లాల్ నెహ్రూ తన తండ్రి పండిట్ మోతీలాల్ నెహ్రూతో కలిసి 1910లో మొదటిసారి కాశీకి వచ్చారు. ఆ తర్వాత 1921లో కాశీ విద్యాపీఠం స్థాపనకు హాజరయ్యారు. ఆ తర్వాత నెహ్రూ 1942, 1946లోనూ కాశీని సందర్శించారు. స్వాతంత్య్రానంతరం 1950, 1952లో పండిట్ నెహ్రూ ప్రధానమంత్రి హోదాలో కాశీకి వచ్చారు.
1980 మాజీ ప్రధాని, దివంగత ఇందిరా గాంధీ జరిపిన వారణాసి పర్యటన చరిత్రాత్మకంగా నిలిచిందని చెబుతుంటారు. ఆరోజున ఇందిర సభ 1979, డిసెబర్ 31న రాత్రి 8 గంటలకు జరిగాల్సి ఉండగా, ఆమె జనవరి 1980, జనవరి ఒకటిన ఉదయం 10 గంటలకు 14 గంటలు ఆలస్యంగా వచ్చారు. చల్లటి వాతావరణం ఉన్నప్పటికీ జనం ఆమెను చూసేందుకు, ఆమె మాటల వినేందుకు ఎంతో ఆసక్తి చూపారు.
#WATCH | Varanasi, UP: During the Bharat Jodo Nyay Yatra, Congress MP Rahul Gandhi says, "During the entire 'yatra' I never saw hatred. Even BJP and RSS people came in the yatra, and as soon as they came to us, they would speak to us nicely... This country strengthens only when… pic.twitter.com/GYCKQHQUZ7
— ANI (@ANI) February 17, 2024
Comments
Please login to add a commentAdd a comment