Rahul gadhi
-
స్పీకర్‌కు రాహుల్ లేఖ.. ‘వ్యాఖ్యలు తొలగించటంపై షాక్‌కు గురయ్యా’
ఢిల్లీ: లోక్‌సభలో చేసిన వ్యాఖ్యలను స్పీకర్ ఓం బిర్లా రికార్డుల నుంచి తొలగించటంలో తనను షాక్‌కు గురిచేసిందని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. ఆయన సోమవారం లోక్‌సభలో నీట్, హిందుత్వ, అగ్నిపథ్ వంటి అంశాలపై ప్రధాని మోదీ, బీజేపీ వ్యవహరించిన తీరుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలపై అధికార ఎన్డీయే సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలు హిందువులను కించపరిచేలా ఉన్నాయని క్షమాపణ చేప్పాలని డిమాండ్ చేశారు. మంగళవారం రాహుల్ స్పీచ్‌లో మాటలను రికార్డుల నుంచి తొలగించినట్ల స్పీకర్ ప్రకటించారు. ఈ క్రమంలో రాహుల్ గాంధీ తాను మాట్లాడిన వ్యాఖ్యలను పునరుద్ధరించాలని స్పీకర్‌కు లేఖ రాశారు.Lok Sabha LoP and Congress MP Rahul Gandhi writes to Speaker Om Birla over the remarks and portions from his speech expunged; requests that the remarks be restored. The letter reads, "...Shocked to note the manner in which considerable portion of my speech have been simply… pic.twitter.com/zoD8A0xvlc— ANI (@ANI) July 2, 2024 ‘నేను నిన్న లోక్‌సభలో మాట్లాడిన ప్రసంగంలో చాలా వ్యాఖ్యలను స్పీకర్‌ను తొలగించటంపై షాక్‌కు గురయ్యా. నా మాటాలను పునురుద్ధరించండి. నా ప్రసంగంలోని వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించటం ప్రజాస్వామ్య పార్లమెంట్ సిద్ధాంతాలకు పూర్తిగా విరుద్ధం’అని రాహుల్ లేఖలో పేర్కొన్నారు.ప్రధాని మోదీకి కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ సవాల్లోక్సభలో రాష్ట్రపతి ప్రసంగం తీర్మానంపై చర్చలో కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ మాట్లాడారు. గత ఎన్డీయే పాలనపై తీవ్ర విమర్శలు చేశారు. గతంలో కట్టిన నిర్మాణాలన్నీ కూలిపోతున్నాయన్నారు. ‘‘ ఎలక్టోరల్ బాండ్ల వ్యవహారం దేశంలోనే అతిపెద్ద కుంభకోణం. బీజేపీ పాలనలో ఢిల్లీ ఎయిర్ పోర్టు, జబల్పూర్ ఎయిర్‌పోర్టుల రూఫ్‌లు కూలిపోయాయని అన్నారు. రాజ్‌కోట్ ఎయిర్‌పోర్టు రూఫ్ ధ్వంసం అయింది. అయోధ్యలో రోడ్లు అధ్వానంగా ఉన్నాయి.#WATCH | Delhi: In the Lok Sabha, Congress MP KC Venugopal says, "... Delhi Airport roof collapsed, Jabalpur Airport roof collapse, Rajkot Airport canopy collapse, conditions of roads in Ayodhya is bad, leakage in Ram Mandir, cracks in Mumbai Harbour link road, three new bridges… pic.twitter.com/CtYCzhLp3E— ANI (@ANI) July 2, 2024 .. రామ మందిరంలో నీరు లీక్ అయింది. ముంబై హార్బర్ లింక్ రోడ్డుకు పగుళ్లు వచ్చాయి. బీజేపీ పాలనలో బిహార్‌లో మూడు బ్రిడ్జ్‌లు కూలిపోయాయి. ఇవాన్ని కూడా ఎన్డీయే ప్రభుత్వంలో చోటు చేసుకున్నాయి. ఎలక్టోరల్ బాండ్ల వ్యవహారంలో విచారణ జరిపించాలని ప్రధాని మోదీకి సవాల్ విసురుతున్నా’’ అని కేసీ వేణుగోపాల్ అన్నారు. -
రాహుల్ గాంధీకి ధైర్యం లేదు: రాజ్‌నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు
ఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత 'రాహుల్ గాంధీ' అమేథీ నుంచి పోటీ చేస్తారనే వార్తలు పెద్దగా వినిపించాయి. ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ ఇప్పటికి కూడా కాంగ్రెస్ తరపున అమేథీలో పోటీ చేసే అభ్యర్థి ఎవరనేది స్పష్టం కాలేదు. ప్రియాంక గాంధీ భర్త 'రాబర్ట్ వాద్రా' పోటీ చేయనున్నట్లు వార్తలు వెలుగులోకి వస్తున్నాయి. దీనిపైన కూడా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. 2019లో అమేథీ లోక్‌సభ స్థానం నుంచి ఓటమి పాలైన రాహుల్ గాంధీకి ఈసారి అక్కడి నుంచి పోటీ చేసే ధైర్యం లేదని బీజేపీ సీనియర్ నేత రాజ్‌నాథ్ సింగ్ గురువారం కీలక వ్యాఖ్యలు చేశారు. అక్కడ ఓటమి చవిచూసిన తరువాత కేరళకు వలస వెళ్లారని సింగ్ చెప్పారు. పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై ప్రజల్లో గందరగోళం సృష్టించేందుకు వామపక్షాలు, కాంగ్రెస్‌లు ప్రయత్నిస్తున్నాయని రాజ్‌నాథ్‌సింగ్ అన్నారు. సీఏఏ చట్టం వల్ల ఎవరి పౌరసత్వం ప్రభావితం కాబోదని సీనియర్ బీజేపీ నాయకుడు హామీ ఇచ్చారు. అంతరిక్ష రంగంలో దేశం సాధించిన విజయాలు మరియు భారతదేశపు మొట్టమొదటి మానవ అంతరిక్షయాన కార్యక్రమం అయిన గగన్‌యాన్ వంటి వివిధ రాబోయే ప్రాజెక్టులను కూడా ఆయన ప్రస్తావించారు. అనిల్ కె ఆంటోనీని ప్రశంసిస్తూ.. అతనికి ఓటు వేయాలని ప్రజలను కోరారు. కేరళలో లోక్‌సభ ఎన్నికలు ఏప్రిల్ 26న జరగనుండగా, జూన్ 4న ఫలితాలు వెలువడనున్నాయి. -
త్రయంబకేశ్వర్‌లో రాహుల్ గాంధీ పూజలు - వీడియో
కాంగ్రెస్ అధినేత 'రాహుల్ గాంధీ' మహారాష్ట్రలో భారత్ జోడో న్యాయ్ యాత్రలో భాగంగా పర్యటిస్తున్నారు. ఆరు రోజుల పర్యటనలో భాగంగా రాహుల్ గాంధీ నేడు (గురువారం) నాసిక్‌లోని త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగ ఆలయంలో ప్రార్థనలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెట్టింట్లో వైరల్ అవుతున్న వీడియోలో గమనించినట్లయితే.. రాహుల్ గాంధీ చేత పూజారి పూజలు చేయించడం చూడవచ్చు. ఆయన చుట్టూ చాలామంది పార్టీ నాయకులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. వాయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ నాసిక్‌లోని త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగ ఆలయం సందర్శించడానికి ముందు రోజు జరిగిన భారీ ర్యాలీలో మాట్లాడుతూ.. ఇండియా కూటమి రైతుల గొంతు అవుతుందని పేర్కొన్నారు. రైతులను రక్షించడానికి కావలసిన విధి విధానాలను రూపొందిస్తామని హామీ ఇచ్చారు. #WATCH | Congress MP Rahul Gandhi offers prayers at Trimbakeshwar Jyotirlinga Temple in Nashik, Maharashtra. pic.twitter.com/6MgZeANtmg — ANI (@ANI) March 14, 2024 -
రాహుల్ కాదు వరుణ్.. అమేథీ ఓటర్ల యూటర్న్?
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అమేథీ(యూపీ) లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసేందుకు విముఖత చూపడంతో, గాంధీ కుటుంబానికి పట్టంకట్టే స్థానికులు ఇప్పుడు వరుణ్ గాంధీవైపు చూస్తున్నారు. రాహుల్ 2019లో అమేథీ నుండి బీజేపీకి చెందిన స్మృతి ఇరానీ చేతిలో ఓడిపోయినప్పటి నుంచి తన ‘కుటుంబ నియోజకవర్గాన్ని’ తిరిగి దక్కించుకునేందుకు ఆసక్తి చూపడం లేదు. రాహుల్ ప్రస్తుతం కేరళలోని వయనాడ్ లోక్‌సభ ఎంపీగా ఉన్నారు. అలాగే రాహుల్ తిరిగి వయనాడ్ నుండి ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ప్రియాంక గాంధీ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తే.. రాయ్‌బరేలీని ఎంపిక చేసుకునే అవకాశం కనిపిస్తోంది. ఇటీవల సోనియా గాంధీ అమేథీ నియోజకవర్గ ప్రజలకు రాసిన లేఖలో భవిష్యత్తులో ఇక్కడి ప్రజలు తన కుటుంబానికి మద్దతు ఇస్తారనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. కాగా దివంగత సంజయ్ గాంధీతోపాటు తన రాజకీయ అరంగేట్రం చేసిన ప్రముఖ కాంగ్రెస్ నేత రామ్ కరణ్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ.. 1980లో సంజయ్ గాంధీ అమేథీ సీటును గెలుచుకోవడంతో గాంధీ కుటుంబానికి అమేథీతో అనుబంధం ఏర్పడిందని అన్నారు. రాహుల్ గాంధీ లోక్‌సభ ఎన్నికల్లో ఇక్కడి నుంచి పోటీ చేయడానికి అంగీకరించకపోతే వరుణ్ గాంధీ అమేథీ నుండి పోటీ చేసే అవకాశం ఉందన్నారు. ఇదేగానీ జరిగితే, తామంతా వరుణ్‌కు మద్దతుగా నిలుస్తామని తెలిపారు. అయితే పార్టీ విధానాలను తీవ్రంగా విమర్శించే వరుణ్ గాంధీకి బీజేపీ టిక్కెట్ ఇచ్చే అవకాశం లేదని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపధ్యంలో వరుణ్ స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉందని, కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీ అతనికి మద్దతు ఇచ్చే అవకాశాలున్నయనే వార్తలు వినిపిస్తున్నాయి. -
కాశీ విశ్వేశ్వరుణ్ణి దర్శించుకున్న రాహుల్ గాంధీ
రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ యాత్ర ఉత్తరప్రదేశ్‌లోని వారణాసికి చేరుకుంది. యూపీలో ఆయన పర్యటనకు శనివారం రెండో రోజు. రాహుల్ ఈ ప్రయాణం ప్రారంభించి 35 రోజులైంది. యూపీ చేరుకున్న రాహుల్ కాశీ విశ్వేశ్వరుణ్ణి దర్శించుకున్నారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వారణాసిలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. తన ఈ ప్రయాణంలో ఎన్నడూ ద్వేషాన్ని చూడలేదని, యాత్రలో బీజేపీ, ఆర్ఎస్ఎస్కు చెందిన వారు కూడా వెంట వచ్చారన్నారు. వారు తనతో చక్కగా మాట్లాడారన్నారు. దేశాన్ని ఏకతాటిపైకి తీసుకురావడమే దేశం పట్ల ప్రకటించే నిజమైన భక్తి అని అన్నారు. ప్రస్తుతం దేశంలో ద్వేషం, భయాందోళనకర వాతావరణం నెలకొని ఉందన్నారు. దేశ తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ, మాజీ ప్రధాని ఇందిరా గాంధీకి వారణాసితో విడదీయరాని అనుబంధం ఉంది. పండిట్ నెహ్రూ 1910 నుండి 1950 వరకు అనేకసార్లు కాశీని సందర్శించారు. ప్రధాని అయ్యాక కూడా వారణాసికి వచ్చారు. ఇందిరా గాంధీ కూడా వారణాసిలో రాజకీయ, మతపరమైన పర్యటనలు చేశారు. పండిట్ జవహర్ లాల్ నెహ్రూ తన తండ్రి పండిట్ మోతీలాల్ నెహ్రూతో కలిసి 1910లో మొదటిసారి కాశీకి వచ్చారు. ఆ తర్వాత 1921లో కాశీ విద్యాపీఠం స్థాపనకు హాజరయ్యారు. ఆ తర్వాత నెహ్రూ 1942, 1946లోనూ కాశీని సందర్శించారు. స్వాతంత్య్రానంతరం 1950, 1952లో పండిట్ నెహ్రూ ప్రధానమంత్రి హోదాలో కాశీకి వచ్చారు. 1980 మాజీ ప్రధాని, దివంగత ఇందిరా గాంధీ జరిపిన వారణాసి పర్యటన చరిత్రాత్మకంగా నిలిచిందని చెబుతుంటారు. ఆరోజున ఇందిర సభ 1979, డిసెబర్ 31న రాత్రి 8 గంటలకు జరిగాల్సి ఉండగా, ఆమె జనవరి 1980, జనవరి ఒకటిన ఉదయం 10 గంటలకు 14 గంటలు ఆలస్యంగా వచ్చారు. చల్లటి వాతావరణం ఉన్నప్పటికీ జనం ఆమెను చూసేందుకు, ఆమె మాటల వినేందుకు ఎంతో ఆసక్తి చూపారు. #WATCH | Varanasi, UP: During the Bharat Jodo Nyay Yatra, Congress MP Rahul Gandhi says, "During the entire 'yatra' I never saw hatred. Even BJP and RSS people came in the yatra, and as soon as they came to us, they would speak to us nicely... This country strengthens only when… pic.twitter.com/GYCKQHQUZ7 — ANI (@ANI) February 17, 2024 -
హైదరాబాద్ చేరుకున్న సోనియా, రాహుల్, ప్రియాంక..
-
స్టాలిన్‌కు భయమెందుకు..?
సాక్షి, చైన్నె : ఇండియా కూటమికి సంబంధించి ప్రధాని అభ్యర్థిని ప్రకటించడంలో సీఎం స్టాలిన్‌కు భయం ఎందుకు..? అని బీజేపీ మహిళానేత కుష్భు ప్రశ్నించారు. శనివారం స్థానికంగా ఆమె మాట్లాడుతూ, ఇండియా కూటమి సమావేశంపై విమర్శలు చేశారు. ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని ఓడించడమే లక్ష్యంగా అందరూ ఏకం అయ్యారని వివరించారు. అయితే 2019 లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీని ప్రధాని అభ్యర్థిగా పేర్కొంటూ స్టాలిన్ చేసిన వ్యాఖ్యలను తాజాగా ఆమె గుర్తు చేశారు. ఇప్పడెందుకో రాహుల్ గాంధీని ప్రధాని అభ్యర్థి అని ప్రకటించేందుకు స్టాలిన్ భయ పడుతున్నారు? అని ప్రశ్నించారు. ఎన్డీఏ కూటమిలో ప్రధాని అభ్యర్థి నరేంద్రమోదీ మాత్రమేనని, అయితే, ఇండియా కూటమిలో రాహుల్, నితీష్, మమత, అఖిలేష్... ఇలా ఎవరో ఆ ప్రధాని అభ్యర్థి అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పీఎం అభ్యర్థి రాహుల్ అని గతంలో వినిపించిన గళాన్ని ఇప్పుడెందుకు మూసివేశారని ప్రశ్నించారు. ఓడి పాతరనే భయం వారిలో ఉన్నట్టుందని ఎద్దేవా చేశారు. దేశంలోని ప్రతి పది మందిలో ఎనిమిది మంది మళ్లీ ప్రధాని నరేంద్రమోదీ అని స్పష్టం చేస్తున్నారని, దేశాన్ని ప్రపంచ స్థాయిలో నిలబెట్టిన తమ ప్రభుత్వానికి మళ్లీ పట్టం కట్టేందుకు ప్రజలు సిద్ధమయ్యారని ధీమా వ్యక్తం చేశారు. -
ఎంపీ పదవిని పునరుద్ధరించినందుకు ధన్యవాదాలు : రాహుల్
-
తెలియక ఇంతకాలం నేనే వంట చేశాను.. ఇక కిచెన్‌లోకి నడవండి!
తెలియక ఇంతకాలం నేనే వంట చేశాను..ఇక ఇవి తీసుకుని కిచెన్‌లోకి నడవండి! -
Congress chintan shivir: ప్రజలతో బంధం తెగింది
ఉదయ్‌పూర్ నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: దేశ ప్రజలతో కాంగ్రెస్ బంధం తెగిపోయిందని పార్టీ నేత రాహుల్ గాంధీ చెప్పారు. తెగిపోయిన బంధాన్ని మళ్లీ కలుపుకొని బలోపేతం చేసుకుందామని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఇందుకోసం అక్టోబర్‌లో దేశవ్యాప్త యాత్రకు శ్రీకారం చుట్టనున్నట్లు ప్రకటించారు. చింతన్ శిబిర్‌లో ముగింపు సందర్భంగా పార్టీ నేతలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ఒక కుటుంబం, ఒకే టికెట్ విధానాన్ని అమలు చేయనున్నట్లు ఉద్ఘాటించారు. ఒకే కుటుంబం నుంచి ఎక్కువ మంది పార్టీ కోసం పనిచేయకుండా ఎన్నికల్లో పోటీ చేయలేరని అన్నారు. ‘‘నేను మీ కుటుంబం, మీరు నా కుటుంబం. ఇది ఒక కుటుంబం. నా పోరాటం బీజేపీ, ఆర్ఎస్ఎస్ భావజాలంపైనే. అది దేశానికి ముప్పుగా మారింది. మనం కేవలం ఒక రాజకీయ పార్టీతో కాదు, దేశంలో అతిపెద్ద క్రోనీ క్యాపిటలిస్ట్‌లకు వ్యతిరేకంగా పోరాడుతున్నాం’’ అని చెప్పారు. బీజేపీ–ఆర్ఎస్ఎస్ వంటి శక్తులకు తాను భయపడనని పేర్కొన్నారు. ‘‘నేను జీవితంలో ఎలాంటి అవినీతికి పాల్పడలేదు. భరతమాత నుంచి ఒక పైసా కూడా తీసుకోలేదు. కాబట్టి నాకు భయం లేదు’’ అని వ్యాఖ్యానించారు. ప్రత్యర్థుల దగ్గర ఎక్కువ డబ్బులున్నాయ్ రానున్నది చాలా కఠినమైన పోరాటమని రాహుల్ చెప్పారు. ఇది కేవలం రాజకీయ పోరాటం కాదని, దేశ భవిష్యత్తు కోసం జరుగుతున్న పోరాటమని తెలిపారు. భారతదేశ సంస్థాగత నిర్మాణాన్ని బీజేపీ విచ్ఛిన్నం చేస్తోందని ఆరోపించారు. దేశంలో రాజ్యాంగ సంస్థలు పని చేయడం మానేసిన రోజు మనమంతా తీవ్రమైన ఇబ్బందుల్లో పడతామన్నారు. ఇప్పటికే అలాంటి పరిస్థితులు చూస్తున్నామని పేర్కొన్నారు. యువత భవిష్యత్తును ప్రభుత్వం నాశనం చేసిందని దుయ్యబట్టారు. ప్రజలతో కలిసి పోరాడటం, వారికి అండగా నిలవడం కాంగ్రెస్ బాధ్యత అని వివరించారు. నాయకుల దృష్టి అంతా ప్రజా సంక్షేమం, ప్రజల సమస్యల పరిష్కారంపైనే ఉండాలన్నారు. పార్టీ కోసం కాకుండా దేశం కోసం నాయకులు ప్రజల్లోకి వెళ్లాలని సూచించారు. ప్రతి ఒక్కరూ చెమట చిందించాల్సిందేనని.. ఇది కాంగ్రెస్ డీఎన్ఏలోనే ఉందని ఉద్ఘాటించారు. రాజకీయ ప్రత్యర్థులను అధిగమించేలా పని చేయాలని కాంగ్రెస్ శ్రేణులకు రాహుల్ పిలుపునిచ్చారు. మన దగ్గరి కంటే ప్రత్యర్థుల వద్దే ఎక్కువ డబ్బులు ఉన్నాయని చెప్పారు. అందుకే వారిలాగా ప్రచారం చేసుకోలేకపోతున్నామని తెలిపారు. కమ్యూనికేషన్ వ్యవస్థను పునరుద్ధరించుకోవాల్సిన అవసరం ఉందని రాహుల్ పేర్కొన్నారు. పార్టీలో సంస్థాగతంగా యువత, సీనియర్లతో కూడిన మిశ్రమ నాయకత్వం ఉండాలని చెప్పారు. -
చైనా అక్రమ వంతెన: మోదీ ప్రారంభిస్తారని భయంగా ఉంది!
న్యూఢిల్లీ: చైనా అక్రమంగా వాస్తవ నియంత్రణ రేఖకు సమీపంలో వంతెన నిర్మిస్తుంటే ప్రధాని మోదీ ఎందుకు మౌనంగా చూస్తున్నారంటూ కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ప్రశ్నించారు. తూర్పు లద్దాఖ్ సరిహద్దుల్లో చైనా పట్టు కోసం పాంగాంగ్ సరస్సు మీదుగా అక్రమంగా ఒక వంతెనను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. బహశా ఆయన మౌనం కారణంగా చైనా ఉత్సాహంగా వంతెనను నిర్శిస్తోంది కాబోలు అని రాహుల్ గాంధీ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. అయితే మోదీ ఈ వంతెనను ప్రారంభించేందుకు రారేమోనని భయం వేస్తుందంటూ వ్యంగ్యంగా మాట్లాడారు.పాంగాంగ్ సరస్సు మీదుగా నిర్మిస్తున్న వంతెన గనుక పూర్తైయితే చైనీస్ దళాలు సరస్సు ఒడ్డుకు త్వరగా చేరుకోవడమే గాక మిలటరీ పరంగా పట్టు సాధించగలరని తెలిసి కూడా మోదీ ప్రభుత్వ ఏం పట్టనట్టు చూస్తుందని విమర్శించారు. పైగా మోదీ ప్రభుత్వం చైనాతో తూర్పు లద్దాఖ్ సరిహద్దులో ఉన్న వివాదాన్ని పరిష్కరించడంలో విఫలమైందని, అందువల్లే భారత్- చైనా దళాల మధ్య ఘర్షణలు జరిగాయని అన్నారు. అలాగే అరుణాచల్ ప్రదేశ్‌లో కూడా భారత్‌కు చైనాతో సరిహద్దు వివాదం ఉందని.. పైగా అక్కడ కూడా భారత సైన్యం మోహరించని ప్రదేశాలను ఆక్రమించుకుని ఇలాంటి వంతెనలనే చైనా నిర్మించిందని అన్నారు. చైనా అక్రమ వంతెన నిర్మాణానికి సంబంధించిన వీడియోతోపాటు "మోదీ ఈ వంతెన ప్రారంభిస్తారేమో" అనే క్యాప్షన్‌ని జోడించి మరీ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. हमारे देश में चीन एक कूटनीतिक पुल का निर्माण कर रहा है। PM की चुप्पी से PLA के हौसले बढ़ते जा रहे हैं। अब तो ये डर है कहीं PM इस पुल का भी उद्घाटन करने ना पहुँच जायें। pic.twitter.com/OMcCC3wxXD — Rahul Gandhi (@RahulGandhi) January 19, 2022 (చదవండి: ఉపాధ్యాయ వృత్తిలో ఉండి ఏందయ్యా ఇది..) -
వైష్ణోదేవి ఆలయంలో తొక్కిసలాట
జమ్మూ: ప్రఖ్యాత వైష్ణోదేవి మందిరంలో కొత్త సంవత్సరాదిన విషాద ఘటన జరిగింది. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని భక్తులు శ్రీ మా వైష్ణో దేవి ఆలయానికి భారీగా వచ్చారు. కొత్త సంవత్సర ఘడియలు ఆరంభమైన సమయంలో అమ్మవారిని దర్శించాలన్న ఆతృతతో అధిక రద్దీ ఏర్పడింది. ఈ రద్దీ పెరిగి తొక్కిసలాటగా మారడంతో 12 మంది మరణించగా, పదహారుమంది గాయాలపాలయ్యారు. గర్భాలయానికి వెలుపల గేట్ నెంబర్ 3 వద్ద శనివారం ఉదయం 2.30– 2.45 ప్రాంతంలో భక్తుల రద్దీ పెరిగి తొక్కిసలాట ఆరంభమైంది. ఒక్కమారుగా జరిగిన ఈ ఘటనతో భీతావహ వాతావరణం నెలకొందని, ఊపిరి ఆడక పలువురు మరణించారని పోలీసులు తెలిపారు. మృతుల్లో ఏడుగురు యూపీ, ముగ్గురు ఢిల్లీకి చెందిన వారు కాగా హరియాణా, కశ్మీర్ నుంచి ఒక్కొక్కరున్నారు. గాయపడినవారికి మాతా వైష్ణోదేవి నారాయణ్ ఆస్పత్రిలో చికిత్సనందిస్తున్నారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఆరుగురు డిశ్చార్జయ్యారు. ఈ ఘటనపై ఉన్నతస్థాయి విచారణ కమిటీని ఏర్పాటుచేయాలని, వారంలో నివేదిక ఇవ్వాలని లెఫ్టినెంట్ గవర్నర్ సిన్హా ఆదేశించారు. తొక్కిసలాట అనంతరం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జితేందర్ సింగ్ ఆలయాన్ని సందర్శించారు. జమ్మూకు 50 కిలోమీటర్ల దూరంలోని త్రికూట్ పర్వతాల్లో నెలకొన్న ఈ ఆలయానికి ప్రతి సంవత్సరం లక్షలాది మంది వస్తారు. దుర్ఘటన జరిగిన గంటకు తిరిగి దర్శనాలకు అనుమతించారు. అయితే పలువురు భక్తులు ఆలయాన్ని సందర్శించకుండా వెనుదిరిగారు. ప్రముఖుల సంతాపం దుర్ఘటనపై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ తీవ్ర సంతాపం ప్రకటించారు. రాష్ట్రంలో రాజకీయపార్టీలు ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారు. పరిస్థితిపై రాష్ట్ర యంత్రాంగంతో సంప్రదిస్తున్నామని ప్రధాని మోదీ చెప్పారు. జరిగిన ఘటనపై విచారం వెలిబుచ్చారు. కాంగ్రెస్ నేత రాహుల్ కూడా ఘటనపై సంతాపం ప్రకటించారు. మరణించినవారికి రూ. 10 లక్షలు, గాయపడిన వారికి రూ. 2 లక్షల పరిహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మొత్తాన్ని ఆలయ బోర్డు చెల్లిస్తుంది. మరణించినవారికి రూ. 2లక్షలు, గాయపడిన వారికి రూ. 50వేల పరిహారాన్ని ప్రధాని ప్రకటించారు. ప్రధాని జాతీయ ఉపశమన నిధి నుంచి ఈ మొత్తాలందిస్తారు. పర్వదినాల్లో దేవాలయానికి రద్దీ పెరుగుతుందని, నూతన సంవత్సరాదిన యువత రద్దీ పెరగడం తాజా ట్రెండ్‌గా మారిందని, అందువల్ల ఇకమీదట న్యూఇయర్ రోజున తగిన ఏర్పాట్లు చేయాల్సిఉందని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ అభిప్రాయపడ్డారు. మృతదేహాలను తరలిస్తున్న దృశ్యం తమ వారు మరణించడంతో రోదిస్తున్న కుటుంబసభ్యులు గత దుర్ఘటనలు ► 2003, ఆగస్టు 27: మహారాష్ట్ర నాసిక్‌లో జరిగిన కుంభమేళాలో జరిగిన తొక్కిసలాట కారణంగా 39మంది మరణించగా, 140 మంది గాయపడ్డారు. ► 2005, జనవరి 25: మహారాష్ట్రలోని మంధర్ దేవీ ఆలయంలో కొబ్బరికాయలు భారీగా కొట్టడంతో ఆ ప్రాంతమంతా నీటిమయమైంది. బురదపై భక్తులు హఠాత్తుగా జారిపడి తొక్కిసలాట ఆరంభమైంది. ఈ ఘటనలో 340 మందికి పైగా మరణించారు. వందలాది మంది గాయాలపాలయ్యారు. ► 2008, ఆగస్టు 3: హిమాచల్‌ప్రదేశ్ నైనా దేవీ మందిరం వద్ద కొండచరియలు విరిగిపడుతున్నాయన్న పుకార్లు గందరగోళానికి దారితీసాయి. దీనివల్ల జరిగిన తోపులాటలో 162మంది మరణించగా 47మంది గాయపడ్డారు. ► 2010, మార్చి 4: యూపీలోని కృపాల్ మహరాజ్‌కు చెందిన రామ్ జానకీ ఆలయం వద్ద ఉచితంగా ఆహారం, దుస్తులు పంచారు. వీటికోసం జరిగిన తొక్కిసలాట 63మందిని బలి తీసుకుంది. ► 2011, నవంబర్ 8: హరిద్వార్‌లోని హర్ కా పౌరీ ఘాట్‌లో తొక్కిసలాట 20మంది మృతికి కారణమైంది. ► 2012, నవంబర్ 19: పాట్నా వద్ద ఛాత్‌పూజ జరిగే అదాలత్ ఘాట్ వద్ద తాత్కాలికంగా ఏర్పాటు చేసిన వంతెన కూలి 20మంది మరణించారు. ► 2013, అక్టోబర్ 13: మధ్యప్రదేశ్‌లోని రత్నగిరి ఆలయంలో నవరాత్రి ఉత్సవాల సందర్భంగా నదిపై వంతెన కూలిపోతోందన్న పుకార్లు భారీ తొక్కిసలాటకు కారణమయ్యాయి. దీంతో 115మంది మరణించగా, 100మంది గాయపడ్డారు. ► 2014, అక్టోబర్ 3: పాట్నాలోని గాంధీ మైదానంలో దసరా ఉత్సవాలు ముగిసిన అనంతరం ఆరంభమైన తోపులాట 32మం దిని బలికొంది. 26మంది గాయపడ్డారు. ► 2015, జూలై 14: ఏపీలో గోదావరి పుష్కరాల వేళ జరిగిన తొక్కిసలాటలో 29మంది చనిపోగా, 20 మంది గాయపడ్డారు. -
ఎన్‌వైఏవై అమలు చేయండి: రాహుల్ గాంధీ డిమాండ్
న్యూఢిల్లీ: కరోనా సంక్షోభంతో కుదేలయిన పేదలను ఆదుకునేందుకు తాము ప్రతిపాదించిన ఎన్‌వైఏవై(న్యూన్‌తమ్ ఆయ్ యోజన) పథకాన్ని అమలు చేయాలని కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఈ పథకంతో పేదలకు ప్రత్యక్ష నగదు బదిలీ చేయాలని, చిన్న, సన్నకారు వ్యాపారాలను ఆదుకోవాలని, ప్రైవేటీకరణను నిలిపివేయాలని ఆయన కోరారు. 2019 ఎన్నికల వేళ కాంగ్రెస్ ఈ పథకానికి రూపకల్పన చేసింది. పేదలకు ఏడాదికి రూ.72వేలను నేరుగా అందించడమే ఈ పథకం ముఖ్యోద్దేశం. గురువారం ఉదయం పదిగంటల నుంచి పదిగంటల పాటు కాంగ్రెస్ ‘స్పీకప్ ఫర్ జాబ్స్’ పేరిట ఉపాధి అవకాశాల కల్పనపై ప్రచారం జరిపింది. ఈ సందర్భంగా పలువురు కాంగ్రెస్ నేతలు తాము ప్రకటించిన ఎన్‌వైఏవై కార్యక్రమాన్ని అమలు చేయాలని కేంద్రాన్ని కోరారు. ప్రభుత్వం ప్రస్తుత సంక్షోభ సమయంలో ఉద్యోగాలు కోల్పోతున్నా పట్టించుకోవడం లేదంటూ ఈ సందర్భంగా రాహుల్ ఆరోపించారు. దేశ ఎకానమీ, చైనాతో సమస్యల విషయంలో మౌనంగా ఉండడంపై ప్రధానిని ఆయన నిలదీశారు. కరోనా సంక్షోభానికి ముందే త్వరలో ఇబ్బందులొస్తాయని తాను హెచ్చరించినా మోదీ పట్టించుకోలేదన్నారు. పేదలను ఆదుకోకుండా ప్రధానికి సన్నిహితులైన కొంతమందికి లక్షల కోట్ల రూపాయల రుణమాఫీలు, పన్ను రాయితీలు ఇస్తున్నారని దుయ్యబట్టారు. ఎకానమీ నాశనమయిందని, యువత నిర్వీర్యమవుతోందని, ప్రధాని ఇప్పటికైనా వీటిపై దృష్టి పెట్టాలని కోరారు. పేదలను ప్రత్యక్ష నగదు బదిలీతో ఆదుకోవడం, ఎంఎస్ఎంఈలను రక్షించడం, ప్రైవేటీకరణను ఆపడం చేయాలని కోరారు. మోదీ విధానాల వల్ల లక్షలాది ఉద్యోగాలు పోవడం, జీడీపీ చారిత్రక కనిష్ఠాలకు పడిపోవడం జరిగిందన్నారు. కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ వాద్రా సైతం రాహుల్ విమర్శలను సమర్ధించారు. దేశ భవిష్యత్ కోసం అందరూ గళం విప్పాలన్నారు. పలువురు కాంగ్రెస్ నేతలు సైతం ఉద్యోగ కల్పన జరగడం లేదంటూ ప్రభుత్వాన్ని విమర్శించారు. చదవండి: పార్లమెంట్ సెషన్.. సిద్ధమవుతోన్న కాంగ్రెస్ -
రాయబరేలిలో సోనియా గాంధీ అధిక్యం
-
రాహుల్ నిర్ణయమే ఫైనల్
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ శాసనసభా పక్ష (సీఎల్పీ) నేతను ఎన్నుకునే అధికారం ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి దఖలు పడింది. సీఎల్పీ నేతను నియమించే అధికారాన్ని రాహుల్‌కు కట్టబెడుతూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఏకగ్రీవ తీర్మానం చేశారు. గురువారం ఉదయం 9 గంటలకు అసెంబ్లీ ప్రాంగణంలోని సీఎల్పీ కార్యాలయంలో 19 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సమావేశమయ్యారు. అధిష్టానం నుంచి కేరళ రాష్ట్రానికి చెందిన లోక్‌సభ సభ్యుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జి ఆర్సీ కుంతియాలు ఈ సమావేశానికి హాజరయ్యారు. వేణుగోపాల్, కుంతియాలు 19 మంది సభ్యుల నుంచి వ్యక్తిగతంగా అభిప్రాయాలను సేకరించారు. ఎమ్మెల్సీలతో కూడా మాట్లాడారు. ఒక్కొక్కరితో 5 నిమిషాల పాటు మంతనాలు సీఎల్పీ నేత రేసులో ఉన్న పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్‌రెడ్డి, భట్టి విక్రమార్క, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిలకు మద్దతుగా కొందరు తమ అభిప్రాయాన్ని తెలిపారు. మరికొందరు పార్టీని పూర్తిగా ప్రక్షాళన చేయాలని, కొత్తవారికి అవకాశమివ్వాలని కోరినట్టు తెలిసింది. సీఎల్పీ పదవిని ఆశిస్తున్న సబితా ఇంద్రారెడ్డితో పాటు ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి కూడా తనకు సీఎల్పీ నేతగా పనిచేసే అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేసినట్టు సమాచారం. ఒక్కో ఎమ్మెల్యేతో 5 నిమిషాలు మాట్లాడిన అధిష్టానం దూతలు వారు చెప్పిన అభిప్రాయాలను వినడంతో పాటు సీఎల్పీ నేతగా అధిష్టానం ఎవరిని నియమించినా కట్టుబడి ఉండాలని సూచించారు. అసెంబ్లీ హాలులో మరో భేటీ దాదాపు గంటన్నర పాటు సీఎల్పీ కార్యాలయంలో సమావేశమైన అనంతరం అధిష్టానం దూతలతో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీ కమిటీ హాలులో మళ్లీ సమావేశమయ్యారు. సీఎల్పీ నేతను నియమించే అధికారాన్ని ఏఐసీసీ అధ్యక్షుడు రాహు ల్ గాంధీకి కట్టబెడుతూ తీర్మానాన్ని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ ప్రతిపాదించారు. ఈ తీర్మానానికి సభ్యులం తా ఏకగ్రీవ ఆమోదం తెలిపారు. దీని తర్వాత కాం గ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలసి వేణుగోపాల్ అసెంబ్లీ మీడియా పాయింట్లో మాట్లాడారు. సీఎల్పీ నేతను నియమించే బాధ్యతను రాహుల్‌కు కట్టబెడుతూ తీర్మానించినట్లు వెల్లడించారు. సీఎల్పీ నేతగా ఎవరుండాలనే అంశంపై తాను పార్టీ సీనియర్ నేతలు, కోర్‌కమిటీ సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీల నుంచి అభిప్రాయాలను తీసుకున్నామని, సభ్యుల అభిప్రాయాలన్నింటినీ రాహుల్‌కు వివరిస్తామని తెలిపారు. అతి త్వరలోనే సీఎల్పీ నేత ఎవరనేది రాహుల్ ప్రకటిస్తారని చెప్పారు. అనంతరం కేసీ వేణుగోపాల్ బెంగళూరుకు వెళ్లిపోయారు. నేడు ప్రకటించే చాన్స్.. సీఎల్పీ నేత ఎవరన్నది శుక్రవారం ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. గురువారమే ప్రకటించాల్సి ఉన్నా రాహుల్ ఢిల్లీలో అందుబాటులో లేని కారణంగా ఆలస్యమైనట్టు కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సీఎల్పీ నేతగా పార్టీ సీనియర్ ఎమ్మెల్యే మల్లు భట్టివిక్రమార్కను నియమించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. రాజకీయ, సామాజిక సమీకరణల నేపథ్యంలో అధిష్టానం ఆయన వైపే మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. ఇటు పీసీసీ చీఫ్ ఉత్తమ్, శ్రీధర్‌బాబుల పేర్లను కూడా అధిష్టానం తీవ్రంగా పరిశీలిస్తోంది. -
దుబాయిలో రాహుల్ గాంధీకి ఘన స్వాగతం
దుబాయి : ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీకి గురువారం రాత్రి దుబాయి విమానాశ్రయంలో ప్రవాస భారతీయులు ఘన స్వాగతం పలికారు. ఈరోజు(శుక్రవారం) సాయంత్రం 4 గంటలకు దుబాయి ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగే భారీ బహిరంగ సభలో రాహుల్ ప్రసంగిస్తారు. ప్రవాస భారతీయులు తమ వాహనాల వెనుకభాగంలో రాహుల్ గాంధీ చిత్రాలను వేయించుకుని ఉత్సాహంగా రోడ్లపై తిరుగుతున్నారు. యూఏఈలోని వివిధ ప్రాంతాల నుండి దుబాయిలోని సభాస్థలి వరకు రానూపోనూ ఉచిత బస్సు సౌకర్యం కల్పించారు. -
పాలమూరు ప్రచారంలో హేమాహేమీలు...!
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : ఎన్నికల ప్రక్రియలో భాగంగా అన్ని పార్టీలు ప్రచారాన్ని హోరెత్తించనున్నాయి. నామినేషన్ల ఉపసంహరణ గడువు గురువారం ముగియడంతో బరిలో నిలిచే నేతలెవరో తేటతెల్లమైంది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రధానంగా టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మధ్యే పోరు ఉండనుంది. దీంతో ఆయా పార్టీలకు చెందిన స్టార్ క్యాంపెనర్లు అభ్యర్థులకు మద్దతుగా ప్రచార పర్వంలోకి దిగుతున్నారు. బీజేపీ తరఫున అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేయడం కోసం స్వయంగా ప్రధాని నరేంద్రమోదీ మహబూబ్‌నగర్‌కు రానున్నారు. అలాగే బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ఉమ్మడి జిల్లాలోని నారాయణపేట, కల్వకుర్తిలో పర్యటించనున్నారు. ఇక టీఆర్ఎస్ తరఫున స్టార్ క్యాంపెనర్ అయిన ఆ పార్టీ అధినేత, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ పర్యటనలు ప్రతీ నియోజకవర్గంలో ఉండేలా ఖరారు చేశారు. అందుకు అనుగుణంగా ఈనెల 25, 27 తేదీల్లో ఏడు నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. అదే విధంగా మహాకూటమి తరఫున 40 మంది స్టార్ క్యాంపెనర్లు కూడా ప్రచారానికి రానున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌గాంధీతో ఉమ్మడి జిల్లాలోని గద్వాల లేదా కొండంగల్ నియోజకవర్గంలోని కోస్గిలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఇలా మొత్తం మీద ప్రధాన పార్టీలన్నీ కూడా పోలింగ్‌కు మిగిలిన 13 రోజుల పాటు ప్రచారాన్ని హోరెత్తించనున్నాయి. వేగం పెంచిన గులాబీ ముందస్తు ఎన్నికల్లో మొదటి నుంచి దూకుడు మీద ఉన్న గులాబీ పార్టీ... నామినేషన్ల ఉపసంహరణ పూర్తి కావడంతో వేగాన్ని మరింత పెంచింది. ఇప్పటికే రెండు నెలలుగా ప్రచారంలో నిమగ్నమైన టీఆర్ఎస్ నేతలకు మద్దతుగా ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ రంగంలోకి దిగారు. ఇదివరకే మంత్రి కేటీఆర్.. ఉమ్మడి జిల్లాలో పార్టీ కాస్త బలహీనంగా ఉన్న చోట్ల బహిరంగ సభలు నిర్వహించి కేడర్‌లో ఉత్సాహం తీసుకొచ్చారు. అలాగే సీఎం కేసీఆర్ గత అక్టోబర్‌లో వనపర్తిలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొనగా... తాజాగా బుధవారం జడ్చర్ల ఎన్నికల బహిరంగ సభలో పాల్గొన్నారు. ఇక ఈనెల 25న దేవరకద్ర, నారాయణపేటలో జరగనున్న ఎన్నికల బహిరంగ సభల్లో ఆయన ప్రసంగించనున్నారు. అలాగే, ఈ నెల 27న కేసీఆర్ ఉమ్మడి జిల్లాలో సుడిగాలి పర్యటన చేయనున్నారు. ఒకే రోజు జిల్లాలోని కల్వకుర్తి, మహబూబ్‌నగర్, వనపర్తి, కొల్లాపూర్, అచ్చంపేటలో జరిగే బహిరంగ సభల్లో కేసీఆర్ పాల్గొంటారు. ఇలా మొత్తం మీద ఈ నెల 27 నాటికి ఉమ్మడి జిల్లాలోని ఎనిమిది నియోజకవర్గాల్లో ప్రచారం పూర్తి కానుంది. మిగతా ఆరు నియోజకవర్గాల ప్రచార షెడ్యూల్‌ను త్వరలో వెల్లడింనున్నారు. కమలం.. దూకుడు రానున్న ఎన్నికల సందర్భంగా పాలమూరు ప్రాంతం నుంచి ఎలాగైనా సీట్లు గెలుపొందాలనే లక్ష్యంతో బీజేపీ వ్యూహాలకు పదును పెడుతోంది. ఒక వైపు క్షేత్రస్థాయిలో ప్రచారం చేసుకుంటూనే.. మరోవైపు ప్రజాకర్షణ కలిగిన నేతలను రంగంలోకి దింపుతోంది. ఇతర రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులతో పాటు కేంద్ర మంత్రులను సైతం ప్రచారం చేయనున్నారు. అలాగే అతి కీలకమైన భావిస్తున్న నియోజవర్గాలపై బీజేపీ అగ్రనాయకత్వం ప్రత్యేక దృష్టి కేంద్రీకరించింది. ఉమ్మడి జిల్లాలో బీజేపీకి కాస్త అవకాశాలు ఉన్న నారాయణపేట, కల్వకుర్తి, మహబూబ్‌నగర్ స్థానాల్లో ఏకంగా ప్రధాని నరేంద్రమోదీ, పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ పర్యటనలు ఖరారయ్యాయి. ఇందులో భాగంగా ఈ నెల 27న ప్రధాని నరేంద్రమోదీ మహబూబ్‌నగర్‌లో ఏర్పాటు చేసే బహిరంగ సభలో పాల్గొననున్నారు. అలాగే డిసెంబర్ 2న నారాయణపేట, కల్వకుర్తిల్లో జరిగే ప్రచార సభల్లో పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పాల్గొని ప్రసంగిస్తారు. గద్వాల లేదా కోస్గిలో రాహుల్ సభ ఈసారి ఎట్టి పరిస్థితుల్లో అధికారాన్ని చేజిక్కించుకోవాలని భావిస్తున్న కాంగ్రెస్ అందుకు తగినట్లుగా వ్యూహరచన చేస్తోంది. మహాకూటమి పొత్తులు, టికెట్ల కేటాయింపులు, బుజ్జగింపులు తదితర విషయాలలో వ్యూహాత్మక అడుగులు వేస్తోంది. ముఖ్యంగా రెబెల్స్‌ను బుజ్జగించడంలో చతురత ప్రదర్శించి కొద్ది మేర సఫలమైంది. అలాగే ప్రచారాన్ని కూడా హోరెత్తించేందుకు స్టార్ క్యాంపెనర్లను సిద్ధం చేసింది. ఇప్పటికే సిద్ధమైన 40 మంది ప్రచార కర్తలు శుక్రవారం నుంచి రంగంలోకి దిగనున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి గట్టి పట్టుందని భావించే పాలమూరు ప్రాంతంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ సభ ఏర్పాటుచేసేందుకు కసరత్తు చేస్తున్నారు. రాహుల్ సభను గద్వాల లేదా కొడంగల్ నియోజకవర్గంలోని కోస్గిలో నిర్వహించేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఇలా మొత్తం మీద ప్రధాన పార్టీలన్నీ కూడా ప్రచారంలో నిమగ్నమయ్యాయి. -
సోనియా, చిదంబరం జైలుకే: సుబ్రమణ్యస్వామి
సాక్షి, హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికలకు ముందే ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీ, మాజీ కేంద్రమంత్రి చిదంబరం జైలుకు వెళ్తారని, 2019లో తామే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి అన్నారు. ఆదివారం నగరంలో మహిళా వాణిజ్యవేత్త(ఫిక్కీ)ల గ్రూప్ ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. దేశంలోని రాజకీయ పరిణామాలు, ఇతర కీలకాంశాలు, ఆర్థిక విషయాలపై తన అభిప్రాయాలను వెల్లడించారు. రచయిత, కాలమిస్ట్ శ్రీరాం కర్రి అనుసంధానకర్తగా వ్యవహరించిన ఈ కార్యక్రమంలో ఫిక్కీ చైర్పర్సన్ ప్రియాంక గనేరీవాల్ అరోరా తదితరులు పాల్గొన్నారు. ఫిక్కీ సభ్యులు అడిగిన పలు ప్రశ్నలకు సుబ్రమణ్యస్వామి సమాధానాలిచ్చారు. హార్వర్డ్ యూనివర్సిటీలో పీహెచ్డీ పూర్తి చేసుకుని స్వదేశంలోనే ఉద్యోగం చేయాలని వచ్చానని, నాటి ప్రధాని ఇందిరాగాంధీ సోవియట్ రష్యా విధానాల పట్ల మొగ్గు చూపడాన్ని సహించలేక తీవ్రంగా వ్యతిరేకించానని తెలిపారు. ఆమె కోపానికి బలై ఉద్యోగం కోల్పోవలసి వచ్చిందని, తర్వాత రాజకీయాల్లోకి వచ్చానని తెలిపారు. నాడు ఇందిరాగాందీ, తర్వాత సోనియా, జయలలిత... ఇలా ఆడవాళ్లతోనే శత్రుత్వం ఎందుకు పెట్టుకున్నారన్న ప్రశ్నకు బదులిస్తూ తనకు మాయావతి, మమతాబెనర్జీ మంచి ఫ్రెండ్స్ అని, లింగ సమానతను నమ్ముతానని ఆయన చమత్కరించారు. మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ పారదర్శకంగా ఉండే వ్యక్తి అని, సోనియాని పెళ్లాడటమే ఆయన చేసిన తప్పని సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజీవ్ చనిపోయే సమయానికి సోనియా, రాజీవ్‌ల మధ్య వాతావరణం అంత సామరస్యంగా ఏమీ లేదన్నారు. ఆదాయపన్నుతో అవస్థలే.. ఆదాయపన్నుతో ఇబ్బందులు పడుతున్నవారు దిగువ, మధ్యతరగతి వారేనని, తాను ఆర్థికమంత్రినైతే ఆదాయపన్నును రద్దు చేస్తానని సుబ్రమణ్యస్వామి అన్నారు. దేశంలో రెవెన్యూ ఆదాయం పెంచేందుకు ఇతర మార్గాలను అన్వేషించాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. వచ్చే ఏడాది మార్చి నాటికి బాబ్రీ మసీదు కేసులో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. మాజీ ఆర్థికమంత్రి పి.చిదంబరం బీజేపీలో చేరాలనుకున్నా ఆ పార్టీ తోసిపుచ్చిందని చెప్పారు. గతంలో సోనియా ప్రధాని కాకుండా ఉండేందుకు మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం 90 శాతం పాత్ర పోషిస్తే తాను 10 శాతం పాత్ర పోషించానని, అందుకే అబ్దుల్ కలాం రెండోసారి రాష్ట్రపతి కాకుండా ఆమె అడ్డుకున్నారన్నారు. జీఎస్టీ, ఆధార్‌తో దేశప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అభిప్రాయపడ్డారు. మోదీ నియంత కాదని కితాబునిచ్చారు. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీకి అర్థశాస్త్రం తెలియదన్నారు. శబరిమల విషయంలో సుప్రీంకోర్టు తీర్పును ఉల్లంఘించే హక్కు ఎవరికీ లేదన్నారు. -
దేశ ప్రధానిగా మాయావతి?
లక్నో : విదేశీ మూలాలున్న సోనియా గాంధీకి జన్మించడం వల్లన రాహుల్ గాంధీ దేశానికి ప్రధాని అయ్యే అవకాశం లేదని బహుజన్ సమాజ్ పార్టీ నేత జై ప్రకాశ్ సింగ్ వ్యాఖ్యానించారు. 2019 లోక్‌సభ ఎన్నికలపై సమీక్షించేందుకు సోమవారం పార్టీ ఉన్నత స్థాయి సమావేశాన్ని లక్నోలో నిర్వహించింది. దేశ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ కంటే సోనియా గాంధీ పోలికలే రాహుల్‌కు ఎక్కువగా ఉన్నాయని అందుకే రాహుల్ దేశానికి ప్రధాని కాలేరని బీఎస్పీ పేర్కొంది. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని పదవికి విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా మాయావతికి ప్రకటించాలని బీఎస్పీ కోరింది. ఉత్తర ప్రదేశ్‌కి నాలుగు సార్లు సీఎంగా బాధ్యతలు నిర్వహించి, విశేష అనుభవం కలిగిన బీఎస్పీ అధినేత్రి మాయావతి దేశానికి కాబోయే ప్రధాన మంత్రి అని బీఎస్సీ జాతీయ సమన్వయకర్త జై ప్రకాశ్ సింగ్ వ్యాఖ్యానించారు. దేశంలో మత వైషమ్యాలు రెచ్చగొడుతున్న ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షాలను ఏదుర్కొనే శక్తి కేవలం మాయావతికే ఉందన్నారు. బీజేపీని ఓడించేందుకు ప్రతిపక్షాలను ఒక్కతాటిపైకి తీసుకురావడం కోసం మాయావతి తీవ్రంగా కృషి చేస్తున్నారని, కర్ణాటక వేదికగా విజయం సాధించారని పార్టీ సీనియర్ నేత వీర్ సింగ్ పేర్కొన్నారు. రాజకీయ పాఠాలు నేర్చుకుంటున్న రాహుల్ కంటే దేశ ప్రధాని అయ్యే అర్హతలు మాయావతికే ఉన్నాయన్నారు. అమె కేవలం దళితల పక్షపాతి కాదని దేశంలో అన్ని వర్గాల ప్రజల నుంచి మాయావతికి మద్దతు లభిస్తోందని తెలిపారు. బీఎస్పీ వ్యాఖ్యలపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు అనిల్ బలూనీ స్పందించారు. దేశానికి నాయకత్వం వహించాలని అనుకోవడంలో తప్పలేదని, ప్రస్తుతం లోక్‌సభలో ఒక్క సీటు కూడా లేని పార్టీ ప్రధానమంత్రి పదవి గురించి కలలు కంటోందని వ్యాఖ్యానించారు. బీఎస్పీ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకూ స్పందించకపోవడం గమనార్హం. అవి ఆయన వ్యక్తిగత వ్యక్యలు.. రాహుల్ గాంధీని విదేశీ మూలాలున్న వ్యక్తిగా వర్ణించిన బీఎస్పీ వైస్ ప్రెసిడెంట్ జై ప్రకాశ్ సింగ్‌ను ఆ పదవి నుంచి తొలగిస్తున్నట్లు మాయావతి ప్రకటించారు. ఆ వ్యక్యలు ఆయన వ్యక్తిగతమైనవని పేర్కొన్నారు. -
కర్ణాటకలో అట్ల.. ఇక్కడ ఇట్లనా?
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: ‘‘ఇచ్చిన హామీ మేరకు టీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు రూ.లక్ష వరకు రుణాలు మాఫీ చేస్తే కాంగ్రెస్ నిత్యం రకరకాల విమర్శలు చేస్తోంది. మరి పక్కనే ఉన్న కర్ణాటకలో మీ సంకీర్ణ ప్రభుత్వం చేసిందేంటి? తెలంగాణలో మాదిరే రూ.34 వేల కోట్ల రుణమాఫీని నాలుగు దఫాలుగా చేస్తామని ప్రకటించారు. ఇక్కడి కాంగ్రెస్ నేతలేమో ఏకకాలంలో రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామంటూ ప్రగల్భాలు పలుకుతున్నారు. కర్ణాటకలో చేతకానిది తెలంగాణలో ఎట్లా చేస్తారో ప్రజలకు సమాధానం చెప్పాలి’’అని ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు కాంగ్రెస్‌ను నిలదీశారు. శనివారం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో ఆయన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఐటీ అండ్ మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ కారిడార్‌కు శంకుస్థాపన చేసి రోడ్డు విస్తరణ పనులను ప్రారంభించారు. ట్యాంక్‌బండ్‌గా అభివృద్ధి చేస్తున్న పెద్దచెరువును పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ... కాంగ్రెస్‌పై మండిపడ్డారు. రైతు రుణమాఫీ విషయంలో ఆ పార్టీ కర్ణాటకలో ఒకలా తెలంగాణలో మరోలా వ్యవహరిస్తూ, మోసపూరిత ప్రకటనలు చేస్తోందన్నారు. ఆ పార్టీ అధినేత రాహుల్ గాంధీ ట్విట్టర్లో ‘కర్ణాటకలో మా సంకీర్ణ ప్రభుత్వం రూ.34 వేల కోట్ల రుణాలను విజయవంతంగా మాఫీ చేసింది’అని చేసిన ట్వీట్‌ను చూసి నవ్వుకున్నట్లు చెప్పారు. కుటుంబ పాలనెవరిదో దేశమంతా తెలుసు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కుటుంబ పాలన అంటూ విమర్శించడానికి కాంగ్రెస్ నేతలకు సిగ్గుందా అని కేటీఆర్ ప్రశ్నించారు. 2014 వరకు ఎవరిది కుటుంబ పాలనో దేశమంతా తెలుసునన్నారు. ‘‘జవహర్లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ ఇలా నాలుగు తరాలు పాలించి దేశానికి మొండిచేయి చూపించారు. ఇప్పుడు రాహుల్ గాంధీ కూడా వరుసలో ఉన్నారు. కుటుంబ పాలన సాగిస్తున్న కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని విమర్శించడం సిగ్గుచేటు’’అని అన్నారు. గతంలో 50 ఏళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో గ్రామాలకు రోడ్లు, విద్యుత్, ఆఖరికి తాగునీళ్లు ఇచ్చిన పాపాన పోలేదన్నారు. నల్లగొండ జిల్లాలో ఫ్లోరైడ్‌కు, పాలమూరులో వలసలకు కారణం కాంగ్రెస్ పార్టీ కాదా అని ప్రశ్నించారు. వాళ్ల కంటికి అలాగే కనిపిస్తది.. పచ్చ కామెర్లు వచ్చిన వారికి లోకమంతా పచ్చగానే కనిపిస్తదన్నట్లు.. స్కామ్‌లు చేయడంలో ఆరితేరిన కాంగ్రెస్ నేతలకు ప్రతీ పనిలో స్కాంలు కనిపిస్తున్నాయని కేటీఆర్ ధ్వజమెత్తారు. మిషన్ కాకతీయను కమీషన్ల కాకతీయ అని, మిషన్ భగీరథతో కాంట్రాక్టర్లకు దోచిపెడుతున్నారని.. ఇలా ప్రతీది వారి కోణంలోనే ఆలోచిస్తున్నారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ దరిద్రపు ఆలోచనలు కేసీఆర్ ప్రభుత్వానికి పట్టలేదన్నారు. ఈ నాలుగేళ్లలో చేసిన అభివృద్ధిని తెలంగాణ ప్రజానీకం చూస్తోందని, రాబోయే ఎన్నికల్లో ప్రజలే కాంగ్రెస్‌కు గుణపాఠం చెబుతారన్నారు. ఐటీ టవర్‌కు నిధులు కేటాయింపు రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన పాలమూరు ప్రాంతానికి కొత్త వైభవం తీసుకొస్తున్నట్లు కేటీఆర్ పేర్కొన్నారు. దాదాపు 400 ఎకరాల్లో చేపట్టిన ఐటీ, మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ పార్కు ద్వారా స్థానికులకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. ఐటీ పార్కు వల్ల ప్రత్యక్షంగా 15 వేల మందికి, పరోక్షంగా మరో 15 వేల మందికి ఉపాధి కలుగుతుందన్నారు. పాలమూరు ఐటీ పార్కు త్వరగా అభివృద్ధి చేసేందుకు పెద్ద టవర్ నిర్మిస్తామని, అందుకు రూ.50 కోట్లు నిధులు కూడా మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. 6 నుంచి 9 నెలల కాలంలో పనులన్నీ పూర్తి చేసుకుని కంపెనీలు నెలకొల్పేలా చర్యలు చేపట్టనున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో మంత్రి లక్ష్మారెడ్డి, ఎంపీ జితేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు వి.శ్రీనివాస్‌గౌడ్, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, గువ్వల బాలరాజు, ఎమ్మెల్సీ కె.దామోదర్‌రెడ్డి, జెడ్పీ చైర్మన్ బండారి భాస్కర్ పాల్గొన్నారు. -
మోదీ అంటేనే అవినీతి
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ అంటేనే అవినీతి అని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. కర్ణాటక అసెంబ్లీలో మెజారిటీ సాధనకు మోదీ అవినీతిని ప్రోత్సహించారని ఆయన మండిపడ్డారు. కర్ణాటక ఉదంతంతో బీజేపీ, ఆరెస్సెస్‌లు గుణపాఠం నేర్చుకుంటాయని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. మోదీ, బీజేపీ చీఫ్ అమిత్ షా, ఆరెస్సెస్‌లకు దేశంలోని వ్యవస్థలపై ఎలాంటి గౌరవం లేదని మండిపడ్డారు. శనివారం నాడిక్కడ రాహుల్ మీడియాతో మాట్లాడుతూ.. ‘కాంగ్రెస్‌తో పాటు జేడీఎస్ నుంచి ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రధాని మోదీ ఆధ్వర్యంలో, ఆయన ప్రోద్బలంతో నడిచిన వ్యవహారాన్ని కర్ణాటక ప్రజలు చూశారు. అవినీతికి వ్యతిరేకంగా మోదీ చేసే ప్రసంగాలు పూర్తి అబద్ధం. అసలు మోదీ అంటేనే అవినీతి. అవినీతికి వ్యతిరేకంగా మాట్లాడే మోదీ కర్ణాటకలో ఎమ్మెల్యేల కొనుగోలును, అవినీతిని ప్రోత్సహించారు. ఆయన దేశాన్ని నాశనం చేస్తున్నారు. కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టేందుకు బీజేపీ నేతలు ఫోన్లో చేసిన బేరసారాలు ప్రస్తుతం బహిర్గతమయ్యాయి’ అని తెలిపారు. దేశం, వ్యవస్థలు, సుప్రీంకోర్టు కంటే ప్రధాని ఎక్కువేం కాదని వ్యాఖ్యానించారు. కర్ణాటక గవర్నర్ వజూభాయ్ రాజీనామా సమర్పించాలనడం మంచి ఆలోచనే అని మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు. ప్రతిపక్షాలన్ని ఏకమై బీజేపీని ఓడించడం గర్వంగా ఉందనీ, ఇకపై దేశవ్యాప్తంగా దీన్నే పునరావృతం చేస్తామని రాహుల్ పేర్కొన్నారు. ‘యడ్యూరప్ప రాజీనామా అనంతరం జాతీయ గీతం ఆలపించకుండానే బీజేపీ ఎమ్మెల్యేలు, ప్రోటెం స్పీకర్ సభనుంచి నిష్క్రమించారు. దేశంలోని వ్యవస్థలపై వాళ్లకు ఏమాత్రం గౌరవం లేదని దీన్నిబట్టే అర్థమవుతోంది. దేశంలో ప్రతి వ్యవస్థను నాశనం చేస్తున్న ఇలాంటి శక్తులతోనే ప్రస్తుతం మనం పోరాడుతున్నాం’ అని వ్యాఖ్యానించారు. దేశంలోని వ్యవస్థలను, ప్రజా తీర్పును ఎవ్వరూ అగౌరవపర్చలేరని కర్ణాటక ఉదంతంతో బీజేపీ, ఆరెస్సెస్‌లు తెలుసుకున్నాయన్నారు. -
‘మోదీజీ.. వ్యక్తిగత దాడులు ఆపండి’
సాక్షి, ముంబై : దేశ ప్రధాని పగ్గాలు చేపట్టేందుకు సిద్ధమని కాంగ్రెస్ చీఫ్ రాహుల్ చేసిన ప్రకటనను ప్రధాని నరేంద్ర మోదీ తప్పుపట్టడం పట్ల శివసేన అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రతి పార్టీ తన అవసరాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటుందని, 2019లో రాహుల్ ప్రధాని కాగోరితే 2014లో బీజేపీని ఎన్నుకున్న తరహాలో ప్రజలే ఓ నిర్ణయం తీసుకుంటారని పేర్కొంది. ప్రజాస్వామ్యంపై విశ్వాసం ఉంటే నాయకులను ఇలా కించపరచడం సరైంది కాదని శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్ అన్నారు. పార్టీలో సీనియర్ నేతలు, భాగస్వామ్య పక్షాలను పక్కనపెట్టి రాహుల్ ప్రధాని రేస్‌లోకి వచ్చారన్న మోదీ వ్యాఖ్యలపైనా ఆయన మండిపడ్డారు. ప్రతిపార్టీలోనూ అత్యున్నత పదవికి నేతలు క్యూలో ఉంటారని, గతంలో ప్రధాని పదవిపై ప్రణబ్ ముఖర్జీ ఆసక్తి చూపినా మన్మోహన్ సింగ్ ప్రధాని అయ్యారని, ఇక బీజేపీలో మురళీ మనోహర్ జోషీ, ఎల్కే అద్వానీలు క్యూలో ఉన్నా పార్టీ ప్రధానిగా నరేంద్ర మోదీ వైపు మొగ్గుచూపిందని అన్నారు. వ్యక్తిగత దాడులు చేసేందుకు ప్రధాని దూరంగా ఉండాలని రౌత్ హితవు పలికారు. మరోవైపు రాహుల్ 2019లో ప్రధాని పదవి చేపట్టేందుకు సిద్ధమని చేసిన ప్రకటనపై ఎన్సీపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఎవరు ఏ పాత్ర నిర్వర్తిస్తారనేది చెప్పడం ఇప్పుడు తొందరపాటే అవుతుందని ఆ పార్టీ చీఫ్ శరద్ పవార్ అన్నారు. -
‘80 శాతం ఇంజనీర్లు నిరుద్యోగులే’
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో నిరుద్యోగం తాండవిస్తోందని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. యువత భవిష్యత్‌ను పట్టించుకోకుండా దేశంలో విద్యా సంస్థల ప్రతిష్టను మసకబార్చుతున్నారా అంటూ ప్రధాని నరేంద్ర మోదీని రాహుల్ ప్రశ్నించారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రోజుకో ప్రశ్నతో ముందుకొస్తున్న రాహుల్ ఆదివారం పదకొండో ప్రశ్నగా విద్యా వ్యవస్థలో నెలకొన్న సమస్యలను ప్రస్తావించారు. దేశంలో 80 శాతం మంది ఇంజనీర్లు నిరుద్యోగులేనని, టాటా నానో వంటి కంపెనీలు ఉద్యోగాలు కోరుతున్న ఇలాంటి యువకుల వైపు చూడటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యా, పరీక్షల వ్యవస్థను ప్రధాని టోకుగా అమ్మేస్తున్నారని విమర్శించారు. స్కూళ్లు, కాలేజీలు వ్యాపారంగా మారాయని అన్నారు. గతకొన్నిరోజులుగా రాహుల్ గిరిజనులు, ఆదివాసీల సమస్యలతో పాటు ధరల పెరుగుదల, రైతుల ఇబ్బందులు సహా పలు సమస్యలపై ప్రధానిని నిలదీస్తూ పలు ప్రశ్నలు సంధిస్తున్నారు. -
దేశమే నా తల్లి, తండ్రి
లూనావాడా/బోడేలి: దేశమే తనకు తల్లి, తండ్రి అని..దేశ సేవలోనే తుదిశ్వాస విడుస్తానని ప్రధాని మోదీ అన్నారు. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ తండ్రి రాజీవ్ గాంధీ, నాయనమ్మ ఇందిరాగాంధీ దేశం కోసం ప్రాణత్యాగం చేశారని, ముత్తాత నెహ్రూ స్వాతంత్య్ర సమరయోధుడంటూ ట్వీట్ చేసిన కాంగ్రెస్ నేత సల్మాన్ నిజామీ.. ప్రధాని మోదీ తల్లిదండ్రులెవరంటూ ప్రశ్నించారు. ఈ ట్వీట్లపై మహిసాగర్ జిల్లా లూనావాడాలో జరిగిన ర్యాలీలో మోదీ విరుచుకుపడ్డారు. కశ్మీర్‌కు చెందిన నిజామీ.. ఆజాద్ కశ్మీర్ కోసం డిమాండ్ చేశాడని, అక్కడి భారత సైన్యాన్ని రేపిస్టులని ఆరోపించాడని అన్నారు. పార్లమెంట్‌పై దాడి చేసిన అఫ్జల్ గురును అమరుడంటూ కీర్తించిన ఘనత నిజామీది అని దుయ్యబట్టారు. అఫ్జల్ గురును ఉరి తీసిన తర్వాత ఇంటింటికీ ఒక అఫ్జల్ తయారు కావాలని ప్రసంగించాడని ఆరోపించారు. . పటీదార్లకు రిజర్వేషన్ హామీ ప్రత్యేక కోటాలో రిజర్వేషన్లు ఇస్తామంటూ కాంగ్రెస్ ఇస్తున్న హామీని నమ్మవద్దని పటీదార్లను మోదీ కోరారు. పటీదార్ల కోసం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లలో కోత వేస్తారా..లేక మిగతా రాష్ట్రాల్లో మాదిరిగా ముస్లింలకు రిజర్వేషన్లు అంటూ హామీ ఇచ్చి వదిలేస్తారా అని కాంగ్రెస్‌ను నిలదీశారు. ఏ రాష్ట్రంలోనైనా ముస్లింలకు రిజర్వేషన్లు అమలయ్యాయా అని ప్రశ్నించారు. బీసీలు పనికిరాని వారా? అయ్యర్ ట్వీట్లను మోదీ ప్రస్తావించారు. చోటా ఉదయ్‌పూర్ జిల్లా బోడేలిలో మాట్లాడుతూ.. వెనుకబడిన కులంలో పుట్టినందుకే తనను ‘నీచ్’అంటూ విమర్శించారన్నారు. వెనుకబడిన వర్గాల వారంతా పనికిరాని వారని అనుకుంటున్నారా అని అడిగారు. ఎన్నికలు జరిగిన ప్రతీచోటా ఓడిన కాంగ్రెస్ తనను లక్ష్యంగా చేసుకుందని అన్నారు. తనను ఓడిస్తే ప్రధాని పదవి ఖాళీ అవుతుందని, యువరాజు(రాహుల్)ను గద్దెపై కూర్చోబెట్టవచ్చనే ఆశతో ఉందన్నారు. -
బాబా రాందేవ్‌పై ఎఫ్ఐఆర్
రాహుల్ గాంధీపై వివాదాస్పద వ్యాఖ్యల పర్యవసానం ఆయన వ్యాఖ్యలను ఖండించిన పలు పార్టీలు కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని ఉద్దేశించి యోగాగురువు బాబా రాందేవ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ఉత్తరప్రదేశ్ పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు. ఆ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలను పరిశీలించిన తర్వాత ఐపీసీ సెక్షన్ 171 (జి) (ఎన్నికలతో సంబంధం ఉన్న తప్పుడు ప్రకటన) కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు ఏఎస్పీ హబీబుల్ హసన్ పీటీఐ వార్తాసంస్థకు తెలిపారు. హనీమూన్, విహార యాత్రల కోసం రాహుల్ గాంధీ దళితుల ఇంటికి వెళుతున్నారని రాందేవ్ బాబా శుక్రవారం విమర్శలు చేసిన విషయం తెలిసిందే. అనంతరం ఆ వ్యాఖ్యలపై దుమారం రేగింది. పలు పార్టీలు ఆయన వ్యాఖ్యల్ని ఖండించాయి. తన వ్యాఖ్యలపై ఆయన విచారం వ్యక్తం చేశారు. బహిరంగ క్షమాపణ చెప్పాలి.. రాందేవ్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా మండిపడింది. ఆయన దళితులను అవమానించారని, అందుకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ దిగ్విజయ్ సింగ్ డిమాండ్ చేశారు. ఆ వ్యాఖ్యలపై నరేంద్ర మోడీ, బీజేపీ స్పందించాలన్నారు. అవి తుచ్ఛమైనవని, సిగ్గుపడే వ్యాఖ్యలని కేంద్ర మంత్రి చిదంబరం ధ్వజమెత్తారు. రాందేవ్ వ్యాఖ్యలపై మోడీ మౌనం దాల్చుతున్నారంటే ఆయన వాటిని సమర్థిస్తున్నట్లేనని ఆలిండియా మహిళా కాంగ్రెస్ చైర్మన్ శోభా ఓఝా అన్నారు. యోగా గురువుపై ఎస్సీ, ఎస్టీ చట్టం కింద విచారణ చేపట్టాలని సీపీఎం డిమాండ్ చేసింది. ఆ వ్యాఖ్యలను సుమోటోగా తీసుకుని చర్యలు చేపట్టాలని ఆ పార్టీ నేత బృందాకారత్ ఎన్నికల సంఘాన్ని కోరారు. బీఎస్పీ నేతలు పలు ప్రాంతాల్లో నిరసన ప్రదర్శనలు చేపట్టారు. కించపరిచే ఉద్దేశం లేదు..: అయితే తన వ్యాఖ్యలపై వివాదం చెలరేగడంతో రాందేవ్ బాబా విచారం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీనో, దళితుల్నో కించపరిచే ఉద్దేశం తనకు లేదన్నారు. తన మాటలు దళితుల్ని బాధపెట్టి ఉంటే దానికి విచార పడుతున్నానని వడోదరలో చెప్పారు. హనీమూన్ అనే పదం రాజకీయాల్లో వాడుతుంటారని, అదే ఉద్దేశంతో తాను ఉపయోగించానన్నారు. అయితే రాహుల్ ప్రచారం కోసమే దళితుల గృహాల్ని సందర్శిస్తారనే తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానన్నారు. కాగా, రాందేవ్‌ను బీజేపీ వెనకేసుకొచ్చింది. ఆయన హనీమూన్ అనే పదాన్ని ఏభావంలో వాడారో ఆ భావంతోనే తీసుకోవాలి తప్ప కాంగ్రెస్ దృష్టి కోణంలో కాదని బీజేపీ ప్రతినిధి షానవాజ్ హుస్సేన్ చెప్పారు.