దుబాయి : ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీకి గురువారం రాత్రి దుబాయి విమానాశ్రయంలో ప్రవాస భారతీయులు ఘన స్వాగతం పలికారు. ఈరోజు(శుక్రవారం) సాయంత్రం 4 గంటలకు దుబాయి ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగే భారీ బహిరంగ సభలో రాహుల్ ప్రసంగిస్తారు. ప్రవాస భారతీయులు తమ వాహనాల వెనుకభాగంలో రాహుల్ గాంధీ చిత్రాలను వేయించుకుని ఉత్సాహంగా రోడ్లపై తిరుగుతున్నారు. యూఏఈలోని వివిధ ప్రాంతాల నుండి దుబాయిలోని సభాస్థలి వరకు రానూపోనూ ఉచిత బస్సు సౌకర్యం కల్పించారు.
Comments
Please login to add a commentAdd a comment