దుబాయ్‌లో ఘనంగా క్రిస్మస్ సంబరాలు | Christmas Celebrations Held At Dubai Cruise Ship | Sakshi
Sakshi News home page

దుబాయ్‌లో ఘనంగా క్రిస్మస్ సంబరాలు

Published Tue, Dec 26 2023 3:07 PM | Last Updated on Tue, Dec 26 2023 3:14 PM

Christmas Celebrations Held At Dubai Cruise Ship - Sakshi

దుబాయ్‌లో ఘనంగా క్రిస్మస్‌ సంబరాలు జరిగాయి. యూఏఈలో బ్రదర్ సామ్యూల్ రత్నం నీలా ఆధ్వర్యంలో డేరా క్రీక్ ధోవ్‌ క్రూయిజ్‌లో క్రిస్మస్‌ సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా క్రైస్తవులు, ఇతర మతస్థులు, వారి కుటుంబాలతో కలిసి వేడుకలను జరుపుకున్నారు.

.

ఇందులో భాగంగా క్రైస్తవ సంఘాల క్వయర్‌తో కలిసి అందరూ పాటలు, ప్రార్థనలతో అలరించారు. బ్రదర్ అరవింద్ వుడ్స్-సాక్సోఫోన్, యేసు,మేరి జ్యోతి బృందం వారు క్రిస్మస్ కేరల్స్‌తో కచేరితో అలరించారు. ఈ కార్యక్రమంలో దుబాయ్‌లోని వివిధ సంఘాల పాస్టర్స్‌, సంఘ పెద్దలతో పాటు పాస్టర్లు జాన్ ప్రసాద్, జైకుమార్ రబ్బి తదితరులు హాజరయ్యారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement