దుబాయ్‌లో సీఎం జగన్‌ పుట్టినరోజు సంబరాలు | CM YS Jagan Birthday Celebrations In Dubai | Sakshi
Sakshi News home page

దుబాయ్‌లో సీఎం జగన్‌ పుట్టినరోజు సంబరాలు

Published Fri, Dec 22 2023 4:08 PM | Last Updated on Fri, Dec 22 2023 7:12 PM

CM YS Jagan Birthday Celebrations In Dubai - Sakshi

దుబాయిలో వందలాది జగనన్న అభిమానుల నడుమ అత్యంత వైభవంగా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు. 

వైఎస్సార్‌సీపీ ఎన్‌ఆర్‌ఐ అడ్వైజర్‌ ప్రసన్న సోమిరెడ్డి, వైఎస్సార్‌సీపీ యువ నాయకులు సింహాద్రిపురం మహమ్మద్‌ జిలాన్‌ భాష, తరపట్ల మోహన్‌, రెడ్డయ్య రెడ్డి, శ్రీనివాస్‌ చౌదరి, సయ్యద్‌ నాసర్‌, చిల్లే తాతాజీ, పాస్టర్‌ యోహన తదితరుల ఆధ్వర్యంలో దుబాయ్‌లో సీఎం జగన్‌ జన్మదిన వేడుకల్లో నిర్వహించారు. ఈ వేడుకుల్లో భారీగా అభిమానులు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో 600 మంది జగనన్న అభిమానులు, కార్యకర్తలు పాల్గొని సీఎం జగన్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.  జగనన్న జన్మదిన సందర్భంగా కేక్ కటింగ్ చేసిన అనంతరం పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు,  ఈ కార్యక్రమానికి విచ్చేసిన 400 మహిళలకు చీరల పంపిణీతో పాటు సింహాద్రిపురం మహమ్మద్ జిలాన్ భాష, పవన్‌ కుమార్ ఆధ్వర్యంలో దాదాపు 150 మంది ప్రవాసఆంధ్రులకు APNRTS బీమా పథకంకు ఆర్థిక సహాయం చేశారు.దాదాపు 100 మంది కొత్తవారిని వైఎస్ఆర్సిపి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమానికి విచ్చేసిన వారందరికీ విందు భోజనాలు ఏర్పాటు చేశారు.

ఆ తర్వాత ప్రసన్న సోమిరెడ్డి, మహమ్మద్ జిలాన్ భాష, మోహన్ తరపట్ల ప్రసంగిస్తూ సీఎం జగన్‌ పాలనలో ఏపీలో జరిగిన  అభివృద్ధిని,సంక్షేమ కార్యక్రామాలని వివరిస్తూ మళ్లీ వచ్చే 2024 ఎలక్షన్లలో పార్టీ కార్యకర్తలు  అభిమానులు ఎటువంటి విభేదాలు లేకుండా, ఒకరినొకరు కలుపుకొని, ప్రతి ఒక్కరు ఒక సైనికుడిలా శక్తీ వంచన లేకుండా కృషి చేసి మళ్లీ వైఎస్సార్‌సీపీ పార్టీని భారీ మెజారిటీతో గెలిపించుకోవాలన్నారు. తిరిగి వైఎస్‌ జగన్‌ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. చివరగా కార్యక్రమానికి విచ్చేసి, విజయవంతం కావడానికి కృషి చేసిన కార్యకర్తలు, అభిమానులకు, అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. 

ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు బ్రహ్మానందరెడ్డి, ఓగూరి శ్రీనివాస్‌, పాస్టర్‌ అనిల్‌, కొల్లే రవికుమార్‌, కటికితల ప్రకాశ్‌, పాలపర్తి నీలిమ, గోసంగి లక్ష్మి, విజయ, మేడిది శ్యామ్‌, కళ్యాణ్‌, శ్యామ్‌ సురేంద్రరెడ్డి, వెంకటరమణారెడ్డి, సయ్యద్‌ సలీమ్‌, షేక్‌ షోయబ్‌, వెంకటప్పరెడ్డి, ఆర్టీఏ జహీర్‌, గూడూరు విజయ్‌రెడ్డి, మనోహర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement