సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో నిరుద్యోగం తాండవిస్తోందని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. యువత భవిష్యత్‌ను పట్టించుకోకుండా దేశంలో విద్యా సంస్థల ప్రతిష్టను మసకబార్చుతున్నారా అంటూ ప్రధాని నరేంద్ర మోదీని రాహుల్ ప్రశ్నించారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రోజుకో ప్రశ్నతో ముందుకొస్తున్న రాహుల్ ఆదివారం పదకొండో ప్రశ్నగా విద్యా వ్యవస్థలో నెలకొన్న సమస్యలను ప్రస్తావించారు.
దేశంలో 80 శాతం మంది ఇంజనీర్లు నిరుద్యోగులేనని, టాటా నానో వంటి కంపెనీలు ఉద్యోగాలు కోరుతున్న ఇలాంటి యువకుల వైపు చూడటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యా, పరీక్షల వ్యవస్థను ప్రధాని టోకుగా అమ్మేస్తున్నారని విమర్శించారు.
స్కూళ్లు, కాలేజీలు వ్యాపారంగా మారాయని అన్నారు. గతకొన్నిరోజులుగా రాహుల్ గిరిజనులు, ఆదివాసీల సమస్యలతో పాటు ధరల పెరుగుదల, రైతుల ఇబ్బందులు సహా పలు సమస్యలపై ప్రధానిని నిలదీస్తూ పలు ప్రశ్నలు సంధిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment