సాక్షి,న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోసారి గబ్బర్ వ్యాఖ్యలు చేశారు.గిట్టుబాటు ధరలు కల్పించకుండా, రుణ మాఫీ చేయకుండా రైతులను ప్రధాని వెన్నుపోటు పొడిచారని ఆరోపించారు.పంట బీమా సొమ్ము చెల్లించడం లేదని దుయ్యబట్టారు.
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రధాని మోదీని రోజుకో ప్రశ్నతో ఉక్కిరిబిక్కిరి చేయాలన్న కాంగ్రెస్ వ్యూహంలో భాగంగా గురువారం రైతుల సమస్యలపై నిలదీస్తూ తొమ్మిదో ప్రశ్నగా ట్వీట్ చేశారు.
అంతకుముందు ధరల పెరుగుదల, పడిపోయిన వృద్ధి రేటు, నిరుద్యోగం వంటి అంశాలపై కేంద్రాన్ని నిలదీస్తూ రాహుల్ వరుసగా ప్రశ్నల వర్షం కురిపించారు.మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం సంపన్నుల కోసమే పనిచేస్తోందని విమర్శలు గుప్పించారు. ధరలతో సామాన్యుడు చితికిపోతున్నా ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితిలో లేదని ఆందోళన వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment