స్పీకర్‌కు రాహుల్‌ లేఖ.. ‘వ్యాఖ్యలు తొలగించటంపై షాక్‌కు గురయ్యా’ | LOP rahul Gandhi wants Om Birla to restore Lok Sabha speech | Sakshi
Sakshi News home page

స్పీకర్‌కు రాహుల్‌ లేఖ.. ‘వ్యాఖ్యలు తొలగించటంపై షాక్‌కు గురయ్యా’

Published Tue, Jul 2 2024 2:14 PM | Last Updated on Tue, Jul 2 2024 3:12 PM

LOP rahul Gandhi wants Om Birla to restore Lok Sabha speech

ఢిల్లీ:  లోక్‌సభలో చేసిన వ్యాఖ్యలను స్పీకర్  ఓం బిర్లా రికార్డుల నుంచి తొలగించటంలో తనను షాక్‌కు  గురిచేసిందని ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ అన్నారు. ఆయన సోమవారం లోక్‌సభలో నీట్‌, హిందుత్వ, అగ్నిపథ్‌ వంటి అంశాలపై ప్రధాని మోదీ, బీజేపీ  వ్యవహరించిన తీరుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. 

రాహుల్‌ చేసిన వ్యాఖ్యలపై అధికార  ఎన్డీయే సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. రాహుల్‌ చేసిన వ్యాఖ్యలు హిందువులను కించపరిచేలా ఉన్నాయని క్షమాపణ చేప్పాలని డిమాండ్‌ చేశారు. మంగళవారం రాహుల్‌ స్పీచ్‌లో మాటలను రికార్డుల నుంచి తొలగించినట్ల  స్పీకర్‌ ప్రకటించారు. ఈ క్రమంలో రాహుల్‌ గాంధీ తాను మాట్లాడిన వ్యాఖ్యలను పునరుద్ధరించాలని స్పీకర్‌కు లేఖ రాశారు.

 

‘నేను నిన్న లోక్‌సభలో మాట్లాడిన ప్రసంగంలో చాలా వ్యాఖ్యలను స్పీకర్‌ను తొలగించటంపై షాక్‌కు గురయ్యా. నా మాటాలను పునురుద్ధరించండి. నా ప్రసంగంలోని వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించటం ప్రజాస్వామ్య పార్లమెంట్‌ సిద్ధాంతాలకు పూర్తిగా విరుద్ధం’అని రాహుల్‌ లేఖలో పేర్కొన్నారు.


ప్రధాని మోదీకి కాంగ్రెస్‌ ఎంపీ కేసీ వేణుగోపాల్‌ సవాల్‌
లోక్‌సభలో రాష్ట్రపతి ప్రసంగం తీర్మానంపై చర్చలో కాంగ్రెస్‌ ఎంపీ కేసీ వేణుగోపాల్‌ మాట్లాడారు. గత ఎన్డీయే పాలనపై తీవ్ర విమర్శలు చేశారు. గతంలో కట్టిన నిర్మాణాలన్నీ కూలిపోతున్నాయన్నారు. 

‘‘ ఎలక్టోరల్‌ బాండ్ల వ్యవహారం దేశంలోనే అతిపెద్ద కుంభకోణం. బీజేపీ  పాలనలో ఢిల్లీ ఎయిర్‌ పోర్టు, జబల్‌పూర్‌ ఎయిర్‌పోర్టుల రూఫ్‌లు కూలిపోయాయని అన్నారు. రాజ్‌కోట్‌ ఎయిర్‌పోర్టు రూఫ్‌ ధ్వంసం అయింది. అయోధ్యలో రోడ్లు అధ్వానంగా ఉన్నాయి.

 

.. రామ మందిరంలో నీరు లీక్‌ అయింది. ముంబై హార్బర్‌ లింక్‌ రోడ్డుకు పగుళ్లు వచ్చాయి.  బీజేపీ పాలనలో బిహార్‌లో మూడు బ్రిడ్జ్‌లు కూలిపోయాయి. ఇవాన్ని  కూడా ఎన్డీయే ప్రభుత్వంలో చోటు చేసుకున్నాయి. ఎలక్టోరల్‌ బాండ్ల వ్యవహారంలో విచారణ జరిపించాలని ప్రధాని మోదీకి సవాల్‌ విసురుతున్నా’’ అని కేసీ వేణుగోపాల్‌ అన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement