
కాంగ్రెస్ అధినేత 'రాహుల్ గాంధీ' మహారాష్ట్రలో భారత్ జోడో న్యాయ్ యాత్రలో భాగంగా పర్యటిస్తున్నారు. ఆరు రోజుల పర్యటనలో భాగంగా రాహుల్ గాంధీ నేడు (గురువారం) నాసిక్‌లోని త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగ ఆలయంలో ప్రార్థనలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
నెట్టింట్లో వైరల్ అవుతున్న వీడియోలో గమనించినట్లయితే.. రాహుల్ గాంధీ చేత పూజారి పూజలు చేయించడం చూడవచ్చు. ఆయన చుట్టూ చాలామంది పార్టీ నాయకులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
వాయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ నాసిక్‌లోని త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగ ఆలయం సందర్శించడానికి ముందు రోజు జరిగిన భారీ ర్యాలీలో మాట్లాడుతూ.. ఇండియా కూటమి రైతుల గొంతు అవుతుందని పేర్కొన్నారు. రైతులను రక్షించడానికి కావలసిన విధి విధానాలను రూపొందిస్తామని హామీ ఇచ్చారు.
#WATCH | Congress MP Rahul Gandhi offers prayers at Trimbakeshwar Jyotirlinga Temple in Nashik, Maharashtra. pic.twitter.com/6MgZeANtmg
— ANI (@ANI) March 14, 2024