వాయనాడ్: లోక్‌సభ ఎన్నికల బరిలో వాయనాడ్ నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ నాయకుడు 'రాహుల్ గాంధీ'కి.. కేరళ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు 'కే సురేంద్రన్' ప్రత్యర్థిగా నిలబడ్డాడు. కాంగ్రెస్ కంచుకోట అయిన వాయనాడ్‌లో పలుమార్లు ఎన్నికల్లో ఓటమి చవి చూసిన సురేంద్రన్ గట్టి పోటీ ఇస్తారా అనేది ఉత్కంఠగా మారింది.
2019 సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లోని అమేథీలో రాహుల్ గాంధీ.. బీజేపీ అభ్యర్థి స్మృతి ఇరానీ చేతిలో ఓటమిపాలయ్యారు. అదే గతి ఈసారి వాయనాడ్‌లో కూడా ఎదురవుతుందని సురేంద్రన్ ఎద్దేవా చేశారు. కాగా 2019లో రాహుల్ గాంధీ భారీ మెజారిటీతో వాయనాడ్‌లో విజయం సాధించారు.
తన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నియోజకవర్గమైన వాయనాడ్ సంక్షోభంలో ఉందని, ఆయన నియోజకవర్గానికి చేసింది ఏమీ లేదని సురేంద్రన్ వ్యాఖ్యానించారు. కేంద్ర నాయకత్వం నాకు ఒక బాధ్యతను అప్పగించింది. తప్పకుండా ప్రజలు మమ్మల్ని గెలిపిస్తారని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment