కుష్భు
సాక్షి, చైన్నె : ఇండియా కూటమికి సంబంధించి ప్రధాని అభ్యర్థిని ప్రకటించడంలో సీఎం స్టాలిన్‌కు భయం ఎందుకు..? అని బీజేపీ మహిళానేత కుష్భు ప్రశ్నించారు. శనివారం స్థానికంగా ఆమె మాట్లాడుతూ, ఇండియా కూటమి సమావేశంపై విమర్శలు చేశారు. ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని ఓడించడమే లక్ష్యంగా అందరూ ఏకం అయ్యారని వివరించారు.
అయితే 2019 లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీని ప్రధాని అభ్యర్థిగా పేర్కొంటూ స్టాలిన్ చేసిన వ్యాఖ్యలను తాజాగా ఆమె గుర్తు చేశారు. ఇప్పడెందుకో రాహుల్ గాంధీని ప్రధాని అభ్యర్థి అని ప్రకటించేందుకు స్టాలిన్ భయ పడుతున్నారు? అని ప్రశ్నించారు. ఎన్డీఏ కూటమిలో ప్రధాని అభ్యర్థి నరేంద్రమోదీ మాత్రమేనని, అయితే, ఇండియా కూటమిలో రాహుల్, నితీష్, మమత, అఖిలేష్... ఇలా ఎవరో ఆ ప్రధాని అభ్యర్థి అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
పీఎం అభ్యర్థి రాహుల్ అని గతంలో వినిపించిన గళాన్ని ఇప్పుడెందుకు మూసివేశారని ప్రశ్నించారు. ఓడి పాతరనే భయం వారిలో ఉన్నట్టుందని ఎద్దేవా చేశారు. దేశంలోని ప్రతి పది మందిలో ఎనిమిది మంది మళ్లీ ప్రధాని నరేంద్రమోదీ అని స్పష్టం చేస్తున్నారని, దేశాన్ని ప్రపంచ స్థాయిలో నిలబెట్టిన తమ ప్రభుత్వానికి మళ్లీ పట్టం కట్టేందుకు ప్రజలు సిద్ధమయ్యారని ధీమా వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment