రివాల్వర్ విక్రయించేందుకు వచ్చి..
-
పోలీసులకు చిక్కిన ఉత్తరప్రదేశ్‌వాసి
కోనరావుపేట: తుపాకులు విక్రయించేందుకు వచ్చిన ఓ వ్యక్తి పోలీసులకు చిక్కాడు. వివరాలు.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ధర్మేంద్ర కుమార్ తివారీ రెండు నెలల క్రితం కరీంనగర్ జిల్లా కోనరావుపేటకు చెందిన ముదాం ప్రసాద్, మనుక రాజుకు రివాల్వర్ విక్రయించాడు. ఆదివారం మళ్లీ ఇదే ప్రాంతంలో మరో రివాల్వర్ విక్రయించేందుకు వచ్చాడు. విషయం తెలుసుకున్న వేములవాడ పోలీసులు ఆయన పట్టణంలోని రాజధాని దాబా పరిసరాల్లో అడుపులోకి తీసుకున్నారు. అతనినుంచి రివాల్వర్ స్వాధీనం చేసుకున్నట్లు సీఐ మాధవి, ఎస్సై రమేశ్ తెలిపారు. నిందితుడిని కోర్టులో హాజరుపర్చినట్లు వివరించారు.