కదులుతున్న కారులో శృంగారం.. | man dies, girl friend survived after Sex in speeding car as they hits truck | Sakshi
Sakshi News home page

కదులుతున్న కారులో శృంగారం..

Published Wed, Feb 24 2016 8:25 PM | Last Updated on Mon, Jul 23 2018 8:49 PM

ప్రమాదంలో నుజ్జునుజ్జైన కారు.. - Sakshi

ప్రమాదంలో నుజ్జునుజ్జైన కారు..

- ట్రక్కు ఢీకొని ప్రియుడి దుర్మరణం, ప్రియురాలికి తీవ్ర గాయాలు
- ఫిలిబిత్- పురాన్ పూర్(యూపీ) హైవేపై ఘటన

ఫిలిబిత్:
ప్రియురాలిని సొంత ఊరిలో దింపేందుకు కారులో బయలుదేరిన ప్రియుడు.. దారి మధ్యలోనే ప్రాణాలు కోల్పోయాడు. వేగంగా కారు నడుపుతూ ప్రియురాలితో శృంగారంలో పాల్గొనడం తనుచేసిన ఘోరతప్పిదం. ఉత్తరప్రదేశ్ లోని ఫిలిబిత్- పురాన్ పూర్ హైవేపై బుధవారం చోటుచేసుకున్న ఈ సంఘటనలో ప్రియురాలు ప్రాణాలతో బయటపడగలిగింది. గజ్రౌలా పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ రాజేశ్ యాదవ్ తెలిపిన వివరాలను బట్టి..

పురాన్ పూర్ కు చెందిన 24 ఏళ్ల యువతి.. ఫిలిబిత్ లో నివసిస్తూ ఉద్యోగం చేస్తోంది. అక్కడే పరిచయమైన 31 ఏళ్ల యువకుడితో స్నేహం ప్రేమగా మారింది. అత్యవసర పని నిమిత్తం ఆ యువతి తన సొంతింటికి వెళ్లాల్సి రావడంతో యువకుడు తన కారులో ఆ అమ్మాయిని దిగబెట్టేందుకు పురాన్ పూర్ బయలుదేరాడు. ఉద్రేకం ఆపుకోలేక కారులో ప్రయాణిస్తూనే ఇద్దరూ శృంగార చర్యకు దిగారు. డ్రైవింగ్ పై పట్టుకోల్పోయిన ఆ యువకుడు.. తన కారును ఎదురుగా వచ్చిన ట్రక్కుపైకి పొనిచ్చేశాడు. కఠానా బ్రిడ్జ్ సమీపంలో జరిగిన ఈ ప్రమాదంపై స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కారులో ఉన్న ఇద్దరినీ చూసి అవాక్కయ్యారు.

ప్రియుడు, ప్రియురాలి ఒంటిపై నూలుపోగు లేకపోవడం, కారులో వారు ఇరుక్కుపోయిన భంగిమ, ట్రక్కు డ్రైవర్ వివరణనుబట్టి.. ఆ ఇద్దరూ కారులో శృంగారానికి పాల్పడటంవల్లే ప్రమాదం సంభవించిందని పోలీసులు నిర్ధారించుకున్నారు. ప్రియుడు అక్కడికక్కడే చనిపోగా, గాయపడ్డ ప్రియురాలికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నామని, వివరాలు తెలుసుకుని కుటుంబసభ్యులకు సమాచారం అందిస్తామని పోలీసులు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement