‘రీల్స్ చెయ్యాలి... సోషల్ మీడియాలో పెట్టాలి.. అందరూ చూడాలి.. లెక్కలేనన్ని వ్యూస్, లైక్స్ రావాలి’.. ఇదే చాలామంది యువతీ యువకుల మనసులలో బలంగా ఉన్న కోరిక. అయితే ఈ తాపత్రయంలోనే కొందరు యువతీయువకులు ప్రాణాలు కూడా పోగొట్టుకుంటున్నారు. యూపీలో చోటుచేసుకున్న ఒక ఘటన దీనికి ఉదాహరణగా నిలిచింది.
ఉత్తరప్రదేశ్‌లోని సీతాపూర్‌కు చెందిన నీరజ్ అనే రీల్స్ చేస్తుంటాడు. ఇదే మోజులో ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఈ ఘటన స్థానికంగా అందరినీ విషాదంలో ముంచెత్తింది. అత్రియా పోలీస్ స్టేషన్ పరిధిలోని హిమ్మత్ నగర్‌కు చెందిన నీరజ్ డిఫరెంట్ స్టంట్స్ చేస్తూ రీల్స్ చేస్తుంటాడు. తాజాగా అతను ఒక ట్రాక్టర్‌ను మరో ట్రాక్టర్‌కు కట్టి లాగే స్టంట్ చేసే ప్రయత్నం చేశాడు. ఈ విన్యాసాన్ని చూసేందుకు భారీగా జనం తరలివచ్చారు.
ఈ ఫీట్ చేస్తుండగా నీరజ్ కూర్చున్న ట్రాక్టర్‌లోని ముందు భాగం అతనిపైకి తిరగబడింది. దీంతో నీరజ్ ట్రాక్టర్ రెండు భాగాల మధ్య ఇరుక్కుపోయాడు. తీవ్రంగా గాయపడిన నీరజ్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన అనంతరం అక్కడ జనం తొక్కిసలాట జరిగింది. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు పోలీసులకు తెలియకుండా మృతదేహాన్ని దహనం చేశారు.కేసు పోలీసులు దర్యాప్తులో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment