దేవ భూమిగా పిలిచే ఉత్తరాఖండ్ దివాస్ చరిత్ర | Uttarakhand Foundation Day Mark The Formation Of The State Of Uttaranchal | Sakshi
Sakshi News home page

దేవ భూమిగా పిలిచే ఉత్తరాఖండ్ దివాస్ చరిత్ర

Published Tue, Nov 9 2021 8:55 AM | Last Updated on Tue, Nov 9 2021 10:19 AM

Uttarakhand Foundation Day Mark The Formation Of The State Of Uttaranchal - Sakshi

భారతదేశంలోని ఉత్తరప్రదేశ్ ప్రావిన్స్ నుండి ఉత్తరాఖండ్ రాష్ట్రం ఏర్పడినందుకు గుర్తుగా ప్రతి ఏడాది నవంబర్‌ 9న ఉత్తరాఖండ్ రాష్ట్ర వ్యవస్థాపక దినోత్సవం జరుపుకుంటారు. ప్రతి ఏడాది ఈ దినోత్సవాన్ని ఉత్తరాఖండ్‌వాసులు ఘనంగా నిర్వహించుకుంటారు. అంతేకాదు ఈ దినోత్సవాన్నిఉత్తరాఖండ్‌ డే  లేదా ఉత్తరాఖండ్‌ ఫౌండేషన్‌ డే లేదా ఉత్తరాఖండ్‌ దివాస్‌గా జరుపుకుంటున్నారు

ఉత్తరాఖండ్ దివాస్ చరిత్ర:
భారత రాజ్యాంగం 1950 సంవత్సరంలో ఆమోదించబడిన తరువాత యునైటెడ్ ప్రావిన్సులు ఉత్తరప్రదేశ్‌గా మారాయి. ఇది ఆ తరువాత భారతదేశ రాష్ట్రంగా మారింది. ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్ర వాసుల అంచనాలను అందుకోవడానికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తీవ్రంగా కృషి చేసింది గానీ సఫలం కాలేకపోయింది. ఈ నేపథ్యంలో  ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర నివాసితులకు సరైన జీవనోపాధి అవకాశాలను అందించడం కోసమే  ఉత్తరాఖండ్ క్రాంతి దళం ఏర్పడింది.

అంతేకాదు అక్టోబర్ 2,1994న హింసాత్మక ఉద్యమం కారణంగా ఉత్తరప్రదేశ్ పోలీసులు ఈ దళంలోని వ్యక్తులను విజయవంతంగా నియంత్రించలేకపోయారు. ఆ తర్వాత చివరకు చాలా సుదీర్ఘ కాల పోరాటం తర్వాత ఉత్తరాఖండ్ వంబర్ 9, 2000న ఉత్తరాంచల్‌గా ఏర్పడింది. ఈ మేరకు  ఉత్తరాంచల్ రాష్ట్రం కాస్త  జనవరి1, 2007న ఉత్తరాఖండ్‌గా మారింది.

పైగా 2020 మార్చిలో గైర్‌సైన్‌ని ఉత్తరాఖండ్‌ వేసవి రాజధానిగా పిలిచారు. అలాగే ఉత్తరాఖండ్ శీతాకాల రాజధానిగా డెహ్రాడూన్‌ని పిలుస్తారు. ఈ రాష్ట్రాన్ని దేవతల భూమి లేదా "దేవభూమి" అభివర్ణిస్తారు. ఇందుకు ప్రధాన కారణం ఇక్కడ నాలుగు ప్రముఖ పుణ్యక్షేత్రాలు  అయిన యమునోత్రి, గంగోత్రి, కేదార్‌నాథ్, బద్రీనాథ్ వంటివి క్షేత్రాలు కొలువుదీరి ఉండటమే. ఈ మేరకు ఈ నాలుగు పుణ్యక్షేత్రాలను కలిపి చోటా చార్ ధామ్ అని పిలుస్తారు. పైగా భక్తులు ఈ ఉత్తరాఖండ్‌ యాత్రను చార్‌ధామ్‌ యాత్రగా పిలుస్తారు.

ఏవిధంగా జరుపకుంటారంటే:
ఉత్తరాఖండ్ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ప్రతి ఏడాది ఉత్తరాఖండ్ రాష్ట్ర ముఖ్యమంత్రి  తమ రాష్ట్ర ప్రజల ధైర్యసాహసాలను లేదా వారి ప్రతిభ, నైపుణ్యాలను గుర్తించి వెలికతీసి మంచి అవార్డులతో సత్కరించడం ద్వారా ఈ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటారు. 2016వ సంవత్సరంలో ఉత్తరాఖండ్ రాష్ట్ర ముఖ్యమంత్రి హరీష్ రావత్ ఉత్తరాఖండ్ రత్న అవార్డును ఏర్పాటు చేసి తమ రాష్ట్రంలో ధైర్యసాహసాలకు చూపిన చాలా మందికి ఈ అవార్డును అందించారు.

2017 సంవత్సరంలో ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ తన ప్రభుత్వ విజన్ డాక్యుమెంట్‌ను కూడా ఆవిష్కరించి ఘనంగా నిర్వహించారు. 2018లో,ఉత్తరాఖండ్ గవర్నర్ బేబీ రాణి మౌర్య 18వ వార్షిక రాష్ట్ర వ్యవస్థాపక దినోత్సవాన్ని ప్రారంభించారు. అయితే 2019లో ఈ వేడుక దాదాపు ఒక వారం పాటు జరిగింది. కానీ 2020వ సంవత్సరంలో మాత్రం 20వ వార్షిక రాష్ట్ర స్థాపన దినోత్సవ  వేడుకలను కరోనా మహమ్మారికి ముందే ప్రారంభించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement