ఉత్తరప్రదేశ్: సినిమాల్లో మాదిరి నిజ జీవితం అన్ని జరగవు. అయితే కొన్ని సంఘటనలు చూస్తే సినిమాల్లో మాదిరిగా చేస్తున్నారో లేక వాటిని స్ఫూర్తిగా తీసుకుని చేస్తున్నారో కూడా తెలియదు. కానీ కాన్పూర్‌కి చెందిన పంకజ్ అనే వ్యక్తి 1999లో వచ్చిన బ్లాక్‌బస్టర్ 'హమ్ దిల్ దే చుకే సనమ్' సినిమాల్లో హీరో మాదిరిగా చేశాడు.
(చదవండి: హౌరా బ్రిడ్జ్ పై జౌరా అనిపించే డ్యాన్స్)
వివరాల్లోకెళ్లితే....గుర్‌గామ్‌లోని ఓ ప్రైమేట్ సంస్థలో అకౌంటెంట్‌గా పనిచేస్తున్న పంకజ్ అనే వ్యక్తికి ఈ ఏడాది మేలో కోమల్ అనే ఆమెతో వివాహం అయ్యింది. అయితే పంకజ్ భార్య కోమల్ పెళ్లి చేసుకున్నప్పటి నుంచి అతనితో మాట్లాడకుండా దూరంగానే ఉండేది.
అంతేకాక తనతోనే కాక ఇంట్లో వాళ్ల ఎవరితోనూ మాట్లాడకుండా దూరంగా ఉండేది. చివరికి అతను కోమలిని ఎంతో ప్రయత్నించి అడగగా ఆమె తాను పింటూ అనే వ్యక్తిని ప్రేమించినట్లు చెప్పింది. దీంతో పంకజ్ తన అత్తమామలకు ఈ విషయాన్నితెలియజేశాడు. అయితే పంకజ్ అత్తమామలు కోమల్‌కు సర్ది చెప్పడానికి ప్రయత్నించిన ఆమె అంగీకరించ లేదు. ఆ తర్వాత ఈ విషయం గృహ హింస నిరోధక విభాగం, ఆశాజ్యోతి సెంటర్‌కు చేరుకుంది.
వారు పంకజ్‌కి అతని భార్య కోమల్, పింటూ, వారి బంధవులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. అయితే కోమల పింటూనే వివాహం చేసుకోవాలని గట్టిగా నిశ్చయించుకోవడంతో చివరికి పంకజ్ వారి వివాహానికి అంగీకరించాడు. ఈ మేరకు పంకజ్ దగ్గరుండి మరీ లాయర్ సమక్షంలో తన భార్య ప్రేమించిన పింటూతో ఘనంగా వివాహం జరింపించాడు.
Comments
Please login to add a commentAdd a comment